BIG BEN Cinemas New Movie Announcement: ఆర్జే శ్వేత ను దర్శకురాలిగా పరిచయం చేస్తున్న బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ ! 

IMG 20240511 WA0151 e1715418362860

పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటో స్టూడియో వంటి డిఫరెంట్ మూవీస్ నిర్మించి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ బ్యానర్ బిగ్ బెన్ సినిమాస్. ఈ సంస్థ తమ కొత్త ప్రాజెక్ట్ ను లాంఛ్ చేసేందుకు రెడీ అయ్యింది.

ఈ సంస్థలో ఇప్పటికే తరుణ్ భాస్కర్, భరత్ కమ్మ, కేవి మహేంద్ర, సంజీవ్ రెడ్డి వంటి పలువురు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ను పరిచయం చేశారు నిర్మాత యష్ రంగినేని.

తాజాగా మరో డైరెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఉప్పెన సినిమాలో హీరోయిన్ కృతి శెట్టికి డబ్బింగ్ చెప్పిన ఆర్జే శ్వేత పీవీఎస్ ను దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రేపు ఉదయం 11.07 నిమిషాలకు రివీల్ చేయబోతున్నారు. బిగ్ బెన్ సినిమాస్ గత సినిమాల్లాగే రిచ్ కంటెంట్, న్యూ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *