Pushpa Allu Arjun Campaining for YSRCP? : అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ కి ప్రత్యక్ష ప్రచారం చేయడానికి  మెగా కారణం !

20240511 154445

తెలుగు సినిమా హీరో లు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ రాజకీయం చేస్తున్నారా?. ఒక వైపు మాత్రమే మద్దతు ఇస్తే భవిష్యత్ లో తమ సినిమాలకు ఇబ్బంది వస్తుంది అని భయపడుతున్నారా?.

Screenshot 20240511 151412

ఈ మధ్యనే ఉత్తమ నటుడు గా జాతీయ అవార్డు (తెలుగు లో మొదటి నటుడు) అందుకున్న టాప్ హీరో అల్లు అర్జున్ తీరు చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు.

IMG 20240511 151450

ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ కి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కి ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే…మరో వైపు టీడీపీ, జన సేన, బీజేపీ లు కూటమిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి ఒక వీడియో విడుదల చేసి మద్దతు తెలపగా…రామ్ చరణ్ కూడా తొలుత ట్వీట్ ద్వారా మద్దతు ప్రకటించారు.

20240511 150940

ఈ రొజు తన తల్లి సురేఖ తో కలిసి పిఠాపురం వెళ్ళారు. అందరూ మెగా హీరోలు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పిఠాపురం వెల్లి ప్రచారం లొ పాల్గొన్నారు.

కానీ, అల్లు అర్జున్ మాత్రం  పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఓక ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని…తన ప్రేమ, మద్దతు ఎప్పటికి పవన్ కె ఉంటాయని అందులో పేర్కొన్నారు. పవన్ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

నిన్నటి వరకు ఇది అంతా బాగానే ఉన్నట్లు కనిపించింది. కానీ శనివారం నాడు అల్లు అర్జున్ అధికార వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు గా నిలబడేందుకు భార్య స్నేహ రెడ్డి తో కలిసి నంద్యాల వెళ్లారు ప్రచారం లో పాల్గొనటం మెగా ఫాన్స్ కి నచ్చడం లేదు

20240511 150828

ఇంతకీ ఐకాన్ స్టార్ ఎందుకు నంద్యాల వెళ్ళి  శిల్పా రవిచంద్ర రెడ్డి కి మరియు వైఎస్ఆర్ సీపీ కి ప్రచారం చెయ్యవలసి వచ్చిందీ అంటే…! 

రవిచంద్ర రెడ్డి భార్య, అల్లు అర్జున్ భార్యలు క్లాస్ మేట్స్, స్నేహితులు కూడా ఆట ! ఈవిధంగా ఆడవారితో పాటూ మగవారిలో అంటే అల్లు అర్జున్, రవి చంద్ర రెడ్డి మధ్య కూడా స్నేహం పెరిగిందట.

అందులో భాగంగానే స్నేహితుడికి అండగా నిలబడటానికి అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు అని అల్లు వారి క్యాంప్ నుండి వస్తున్న సమచారం .

Screenshot 2024 0511 151354

భార్య కు హితులు  స్నేహితులు కోసం అండగా ఉండటాన్ని ఎవరూ తప్పుపట్టారు. కానీ కుటుంబ సభ్యుడు అయిన పవన్ కళ్యాణ్ విషయం లో మాత్రం ఒక ట్వీట్ తో సరిపెట్టి, వైసీపీ అభ్యర్థి కోసం ఏకంగా నంద్యాల వరకు వెళ్ళటం ఇప్పుడు అటు రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాల్లోనూ  ముఖ్యంగా పవర్ స్టార్ ఫాన్స్, మెగా ఫాన్స్, AA ఆర్మీ మద్య  హాట్ టాపిక్ గా మారింది.

IMG 20240511 151902

మొత్తానికి  అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి స్నేహితురాలు కొసం  తీసుకొన్న  ఈ పొలిటికల్ డెసిషన్ తో మెగా ఫాన్స్ మద్య పెద్ద చీలిక వచ్చేటట్టు ఉంది.

ఏదైనా, సినిమా హీరో ల రాజకీయం వెరైటీగా ఉంటుంది అనే చెప్పాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *