కాజల్ అగర్వాల్ “సత్యభామ” సినిమా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే! 

IMG 20240511 WA0076 e1715418258173

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు.

“మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.

IMG 20240511 WA0150

ఈ రోజు “సత్యభామ” సినిమా నుంచి థర్డ్ సింగిల్ ‘వెతుకు వెతుకు..’ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ పాటను ఈ నెల 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నేరస్తులను పట్టుకోవడంలో పోలీస్ ఆఫీసర్ గా సత్యభామ చేసే సెర్చింగ్ నే ఈ పాటకు నేపథ్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ తో “సత్యభామ” సినిమా మీద మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

 నటీనటులు:

కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు..,

 

టెక్నికల్ టీమ్:

బ్యానర్: అవురమ్ ఆర్ట్స్, స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క, నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి, కో ప్రొడ్యూసర్ – బాలాజీ, సినిమాటోగ్రఫీ – బి విష్ణు, సీఈవో – కుమార్ శ్రీరామనేని, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), దర్శకత్వం: సుమన్ చిక్కాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *