నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ‘అగ్లీ స్టోరీ’ టీజర్ రివ్యూ !

ugly story e1759485500110

నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అగ్లీ స్టోరీ’. రియా జియా ప్రొడక్షన్స్ పతాకం మీద సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌, ‘హే ప్రియతమా’ లిరికల్ సాంగ్ రిలీజ్ ఎక్సట్రాడినరీ రెస్పాన్స్ అందుకున్నాయి. దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ ఇంటెన్స్ టీజర్ రిలీజ్ చేశారు.

మంటల మీదుగా సిగరెట్ కాలుస్తున్న నందును ‘అగ్లీ స్టోరీ’ టీజర్‌లో ముందుగా పరిచయం చేశారు. అతడిది పర్వర్ట్ క్యారెక్టర్ అన్నట్టు సన్నివేశాలు ఉన్నాయి. తర్వాత అవికా గోర్ పరిచయం జరిగింది. నందును కాకుండా అవికా గోర్ మరొక అబ్బాయిని ప్రేమిస్తుంది. మరొకరిని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నామని అవికా గోర్ చెప్పినా సరే నందు వదలడు. వేధిస్తాడు. ‘వాళ్ళది ప్రేమ, అందుకే కలిసుకున్నారు. నీది కోరిక, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావ్’ అని డైలాగ్ వస్తుంటే స్క్రీన్ మీద అవికా గోర్ – రవితేజ మహాదాస్యం పెళ్లిని, మెంటల్ ఆస్పత్రిలో నందును చూపించారు. కథలో ట్విస్టులతో పాటు చివర్లో అవికా గోర్ ప్రేమ కోసం నందు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? అనేది సినిమాలో చూడాలి.

నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శివాజీ రాజా, రవితేజ మహదాస్యం, ప్రజ్ఞ లాంటి టాలెంటెడ్ కాస్ట్ నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ శ్రీ సాయికుమార్ దారా, కొరియోగ్రఫీ ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్ శ్రీకాంత్ పట్నాయక్, సోమ మిథున్, ఆర్ట్ డైరెక్షన్ విఠల్ కోసనం, పీఆర్ఓ మధు వీఆర్ లాంటి టీమ్ ఈ ప్రాజెక్ట్‌కి స్ట్రెంగ్త్ యాడ్ చేసింది.

నటి నటులు : 

హీరో ,హీరోయిన్ : నందు, అవికా గోర్, రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా మరియు ప్రజ్ఞా నయన్..,

సాంకేతిక వర్గం : 

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రణవ స్వరూప్‌, బ్యానర్ : రియాజియాప్రొడ్యుసర్ : సుభాషిని, కొండా ల‌క్ష్మ‌ణ్ , కెమెరా: శ్రీసాయికుమార్‌ దారా, సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్, ఆర్ట్ డైరెక్టర్ : విఠల్ కోసనం, పి ఆర్ ఓ: మధు వి ఆర్, డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *