Eagle Girl Kavya Thapar Special Interview: రవితేజ తో చేసిన రొమాన్స్ ఆడియన్స్ కి కిక్ ఇస్తుంది అంటున్న కావ్య !

kavya thapar special interview for Eagle 5 e1707277227379

 పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కార్తీక ఘట్టమనేని తో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’ ఈ వారమే విడుదల కు సిద్దం అయ్యింది. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ గా ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కంటిన్యూ గా సినిమా లు చేస్తూనే ఉన్నారు.

IMG 20240204 WA0239

రవితేజ కి జోడీగా  కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న ఈ ఈగల్ సినిమా ప్రోమోసన్స్ లో భాగంగా  హీరోయిన్ కావ్య థాపర్ ఈగల్ షూటింగ్ విశేషాలని మా 18F మూవీస్  విలేకరితో  సమావేశంలో పంచుకున్నారు. అందులోని ఆసక్తి కరమైన విశయాలు మీ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము.

kavya thapar special interview for Eagle 8

‘ఈగల్’మూవీ  లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?

ఇందులో నా పాత్ర పేరు రచన. జీవితంలో చాలా యునిక్ గోల్స్ వున్న అమ్మాయిగా కనిపిస్తాను. ఇందులో చాలా అద్భుతమైన ప్రేమకథ వుంది. దాని గురించి అప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు. రవితేజ గారు, నా పాత్రల మధ్య కెమిస్ట్రీ చాలా యూనిక్ గా వుంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈగల్ పై రవితేజ గారు, డైరెక్టర్ కార్తిక్, మా టీం అంతా చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా వున్నాం. ఈగల్ తప్పకుండా ప్రేక్షకులని చాలా గొప్పగా అలరిస్తుంది.

అసలు ‘ఈగల్’ సినిమా  ప్రాజెక్ట్ లోకి మీరు  ఎలా వచ్చారు?

kavya thapar special interview for Eagle 7

ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో వున్న సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గారు ఈగల్ కథ చెప్పారు. చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. తప్పకుండా సినిమా చేయాలని అనుకున్నాను. అన్నిటికంటే రవితేజ గారి సినిమాలో చేయడం గొప్ప అవకాశం. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఎంపిక చేశారు. ఈగల్ లో యాక్షన్, రోమాన్స్ సన్నివేశాలు చాలా యూనిక్ గా వుంటాయి. రోమాన్స్ అయితే చాలా డిఫరెంట్ గా, కొత్తగా వుంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

రవితేజ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

kavya thapar special interview for Eagle 4
రవితేజ గారితో సినిమా చేయడం నా అదృష్టం. రవితేజ గారి వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని. ఆయన చాలా పాజిటివ్ ఎనర్జీతో వుంటారు. సెట్స్ లో చాలా సరదాగా, సపోర్టివ్ గా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి.

ఈగల్ మూవీ లో నటన విషయంలో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్ ?

రచయిత మణిగారు అద్భుతంగా నటించారు. తెరపై కావ్య కాకుండా రచన కనిపించింది అన్నారు. రచయిత నుంచి ఈ ప్రశంస రావడం చాలా తృప్తిని ఇచ్చింది. నా వరకూ పాత్రకు వందశాతం న్యాయం చేశాననే నమ్ముతున్నాను.

kavya thapar special interview for Eagle 2

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో వవర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాని ఇంటర్నేషనల్ గా చాలా గ్రాండ్ గా చిత్రీకరించారు. వారితో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను.

మీరు గతం లో హిందీ సినిమాలు చేశారు, సౌత్ లో తెలుగు, తమిళ సినిమాలు చేస్తున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రి నుండి ఎంకరేజ్ మెంట్ ఎలా ఉంది?

kavya thapar special interview for Eagle 6

చాలా బాగా ఉంది. నా మొదటి సినిమా తెలుగులోనే చేశాను. తర్వాత హిందీ లోను, రీసెంట్ గా తమిళ సినిమా కూడా చేశాను. ఇక్కడ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ చాలా మంచివారు. సినిమా స్టార్స్ ని దేవుళ్ళు గా చూస్తారు. అదే ముంబయి లేదా హిందీ లో ఇలాంటి రెస్పాన్స్ ఉండదు. అందుకే మా లాంటి వర్దమాన నటులు తెలుగు లో ఎక్కువ సినిమాలకు పనిచేయాలి అనుకొంటాము.

మీకు ఎలాంటి సినిమాలు చేయాలని వుంది ?

ఫుల్ మాస్ యాక్షన్ సినిమా చేయాలని వుంది. అలాగే సూపర్ నేచురల్ సినిమాలు చేయాలని వుంది.

 

ఒకే ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్యూ కావ్యా,

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *