Krishnamma Movie Review & Rating: స‌త్య‌దేవ్ న‌టించిన చిత్రం ‘కృష్ణ‌మ్మ‌ రివ్యూ & రేటింగ్

krishnamma movie review by 18 fms e1715401350440

చిత్రం: కృష్ణ‌మ్మ‌

విడుదల తేదీ : మే 10, 2024,

నటీనటులు: సత్యదేవ్, అతిరా రాజ్, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు,

దర్శకుడు: వివి గోపాలకృష్ణ,

నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి,

సంగీత దర్శకుడు: కాల భైరవ,

సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి,

ఎడిటింగ్: బి తమ్మిరాజు,

మూవీ: కృష్ణ‌మ్మ‌ రివ్యూ  (Krishnamma Movie Review) 

వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన లేటెస్ట్ రా & రాస్థీక్  చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’.  ఈ సినిమాకు డెబ్యూ దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు.

 ఈ ‘కృష్ణ‌మ్మ‌’ చిత్రం ఈ శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !

krishnamma movie review by 18 fms 5

కధ పరిశీలిస్తే (Story Line): 

భద్ర (సత్యదేవ్), కోటి (లక్ష్మణ్ మీసాల), శివ (కృష్ణతేజ రెడ్డి) ముగ్గురూ ప్రాణ స్నేహితులు. పైగా ఈ ముగ్గురు కృష్ణానది లానే ఎప్పుడు , ఎక్కడ పుట్టారో తెలియదు కానీ, బెజవాడ – ఇంజిపేట లొని కృష్ణమ్మ ముగ్గిరిని ఒకటిగా కలుపుతుంది. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేంత అభిమానంగా కృష్ణ నది వడ్డున ఇంజిపేటలొ జీవనం సాగిస్తూ ఉంటారు .

అయితే, చిన్నతనం లోనే  భద్ర – కోటి చేసిన తప్పుకి శివ బాల ఖైదీ గా శిక్ష అనుభవించి వచ్చి, జీవితం లో తప్పు చేయకూడదు అని జునైల్ హోమ్ లో నేర్పిన విద్యతో చిన్న స్క్రీన్ ప్రింటింగ్ షాప్ నడుపుతుంటాడు. కానీ, భద్ర – కోటి ఏ వృత్తి నేర్చుకోక ఇంజిపేట లొని యువకుల లానే  గంజాయి సరఫరా వృత్తినే కొనసాగిస్తూ ఉంటారు. అది శివకు నచ్చదు.

ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో  శివ మీనా (అతిరా రాజ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.

మ స్నేహితుడు శివ ప్రేమ కోసం భద్ర – కోటి ఏం చేశారు ?,

ఈ క్రమంలో వారి జీవితాల్లో జరిగిన మలుపులు ఏమిటి ?,

ఈ మొత్తం వ్యవహారంలో శివను  ఎందుకు ఎన్కౌంటర్ చేస్తారు?,

శివ చనిపోవడానికి కారణం ఏమిటి ?,

శివ చావుకు భద్ర – కోటి ఎలా బదులు తీర్చుకున్నారు ?

బెజవాడ లొని యించిపేట కధ ఏమిటి ? 

అనే ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంటే వెంటనే దియేటర్ కి వెళ్ళి కృష్ణమ్మ సినిమా చూసేయండి.

IMG 20240508 WA0363

కధనం పరిశీలిస్తే (Screen – Play):

ప్రతి మనిషిని ఎమోషనల్ గా కదిలించే సన్నివేశాలతో ఈ కృష్ణమ్మ సినిమా కధ ను దర్శకుడు చాలా బాగా రాసుకొన్నాడు. కానీ  కొన్ని సీన్స్ లో  కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం, అదేవిధంగా కధనం (స్క్రీన్ ప్లే) చాలా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలగడం వంటి అంశాలు సినిమాకి కొంత  మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

ముఖ్యంగా దర్శకుడు మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) కథనాన్ని మరికొన్ని ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో  మలిచి ఉంటే బాగుండేది. కధ లొని ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని సీన్స్ లో రొటీన్ డ్రామాలా అనిపిస్తోంది.

అదేవిధంగా మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో  కామెడీ కోసం పెట్టిన కొన్ని సీన్స్ అంతగా ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి.

కృష్ణమ్మ సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, ప్రధాన పాత్రలు ఎలాంటి కష్టాల్లో పడతారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు వివి గోపాలకృష్ణ మాత్రం ఆ దిశగా సినిమాని కధనాన్ని వ్రాసుకోలేకపోయాడా లేక తెరమీద చూపించలేకపోయాడా అనే సందేశం కలుగుతుంది.

krishnamma movie review by 18 fms 2

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు VV గోపాల కృష్ణ తను మొదటి సినిమా కి దర్శకత్వం చేస్తున్నట్టు కాకుండా ఎంతో మెట్యూరిటీ తో కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా (కొన్ని సంవత్సారాల క్రితం గుంటూర్ కాలేజీ హాస్టల్ లో ఆయేషా అనే అమ్మాయి రేప్ & మర్డర్ కేస్ కధను పోలిన ఇన్సిడెంట్స్ గుర్తుచేసేలా) బెజవాడ కృష్ణమ్మ బాక్ డ్రాప్ లో  రూపొందిన ఈ ‘కృష్ణ‌మ్మ‌’ చిత్రంలో  ఎమోషన్స్ అండ్ మెయిన్ థీమ్ సినిమా చూసే ప్రేక్షకుల మనసును కదిలిస్తోంది.

పోలీసు డిపార్ట్మెంట్ లొని కొంతమంది అధికారుల దురుసు ప్రవర్తన, పై అధికారుల ఒత్తిడితో వాళ్ళు అమాయకులను ఎలా టార్చర్ పెడతారనే అంశాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు గోపాలకృష్ణ. తప్పుడు కేసు పెట్టి హీరోని అతని ఫ్రెండ్స్ ను పోలీసులు హింసించే సన్నివేశాలు కూడా చాలా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటాయి.

మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన వివి గోపాలకృష్ణ అంతే స్థాయిలో ఉత్కంఠభరితమైన కథనాన్ని (స్క్రీన్ – ప్లే) రాసుకోవడంలో మాత్రం కాస్త రొటీన్ ఫార్ములా ని ఫాలో అయినట్టు అనిపిస్తుంది కానీ, ఆయన రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకున్నాయి.

సత్యదేవ్ ఇంజిపేట భద్ర పాత్రలో జీవించాడు అని చెప్పవచ్చు. తన నటన అద్భుతంగా అనిపిస్తోంది. భద్ర పాత్ర కోసం తను చూపించిన డెడికేశన్ కి హ్యాట్స్ అప్ చెప్పాలి.

 లక్ష్మణ్ మీసాల కోటి అనే మరో కీలక పాత్రలో చాలా బాగా నటించాడు. సత్యదేవ్ కి సమానంగా సాగిన ఈ కోటి పాత్రలో లక్ష్మణ్ మార్క్ నటనతో మెప్పించాడు.

కృష్ణతేజ రెడ్డి కూడా శివ పాత్రలో ఆకట్టుకున్నాడు. భద్ర- శివ- కోటి అనే మూడు పాత్రలలో నటుల నటన మనకు అంతగా గుర్తుంటుంది అంటే ఆ క్రెడిట్ అంతా దర్శకుడు గోపాలకృష్ణ దే అని చెప్పవచ్చు.

ఫిమేల్ లీడ్ అతిరా రాజ్ పాత్ర మాత్రం ఈ సినిమాకి ప్రత్యేకం. హీరోయిన్ గా ఆమె బాగానే అలరించింది. అలాగే, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

krishnamma movie review by 18 fms 3

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

 సంగీత దర్శకుడు కాల భైరవ సంగీతం బాగుంది. ముఖ్యంగా పాటలకంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ని ఎంతో ఉన్నతంగా నిలబెట్టింది. కొన్ని యాక్షన్ సీన్స్ లో అయితే గుస్బుంప్స్ వస్తాయి.

సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాలా సీన్స్ న్యాచురల్ గా ఉన్నాయి.

బి తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగుంది. షార్ప్ కట్స్ తో యాక్షన్ ఎపిసోడ్స్ హై లైట్ గా నిలిస్తాయి.

నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి గురించి మాట్లాడితే,  దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వాస్తవిక చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి ను అభినందించాలి. చిత్ర నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

krishnamma movie review by 18 fms 1

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

సత్యదేవ్ హీరో గా ‘కృష్ణ‌మ్మ‌’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ రివేంజ్ యాక్షన్ డ్రామాలో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. అలాగే నటీనటుల నటన ఆకట్టుకుంది.

కాకపోతే, కొన్ని సీన్స్ లో  స్లో నేరేషన్, మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో ఇంట్రెస్టింగ్ & గ్రిప్పింగ్ కంటెంట్ మిస్ కావడం, అలాగే పూర్తిస్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి కొంత  మైనస్ అయ్యాయి.

ఓవరాల్ గా ఈ చిత్రంలో ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రం బాగానే ఆకట్టుకుంటాయి. ఇలాంటి రా & రాస్థీక్ కధలను ప్రేక్షకులు దియేటర్ కి వచ్చి చూసి అదరిస్తే, వర్ధమాన రచయితలు దర్శకులు  మరెన్నో ఇలాంటి  కొత్త కధలను వెండి తెర మీద ఆవిష్కరించాడానికి ఆష్కారం కలుగుతుంది.

చివరి మాట:రా & రాస్థీక్ రీవెంజ్ ఎమోషనల్ డ్రామా   !

18F RATING: 2.75  / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *