Satya Movie Review & Rating: కాలేజీ పిల్లల క్యూట్ టీనేజ్ లవ్ స్టోరీ సత్య సినిమా ! ఎలా ఉందంటే !

satya Movie review by 18 fms 5 e1715408161484

చిత్రం: సత్య ,

విడుదల తేదీ : మే 10, 2024,

నటీనటులు: హమరేశ్, ప్రార్ధనా సందీప్, ‘ఆడుగాలం’ మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులు,

దర్శకుడు: వాలీ మోహన్‌దాస్‌,

నిర్మాత: శివమల్లాల,

సంగీత దర్శకుడు: సుందరమూర్తి కేవీ,

సినిమాటోగ్రఫీ: ఐ మరుదనాయగం,

ఎడిటింగ్: కే సత్యనారయణ,

మూవీ:  సత్య రివ్యూ  (Satya Movie Review) 

డిఫరెంట్ కాన్సెప్ట్ తో గత సంవత్సరం తమిళం లో రాంగోళి అంటూ వచ్చి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకొన్న ఈ సినిమాని ప్రముఖ జర్నలిస్టు శివ మల్లాల శివం మీడియా బేనర్ మీద సత్య అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చారు.

సత్య (తమిళ – రంగోళి) సినిమా కి వాలీ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించారు. ఈ  సత్య సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఈ శుక్రవారమే థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. శివమల్లాల నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో హమరేశ్, ప్రార్ధనా సందీప్, ‘ఆడుగాలం’ మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మరి ఈ సత్య సినిమాలో  తెలుగు ప్రేక్షకులను మెప్పించే ఎలిమెంట్స్ ఏ మేరకు ఉన్నాయి, సినీ ప్రేక్షకులు ఎంత వరకూ ఎంటర్టైన్ అవ్వగలరు అనేది మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకొందామా !

satya Movie review by 18 fms

కధ పరిశీలిస్తే (Story Line): 

నీరుపేద కుటుంబానికి చెందిన సత్యమూర్తి అలియాస్ సత్య(హమరేష్) గాజువాకలో ఓ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్టయిర్ చదువుతూ ఉంటారు. అయితే తండ్రి మోహన్ కుమార్ గాంధీ అలియాస్ గాంధీ(ఆడుగలం మురుగదాస్) తన కుమారుణ్ని అందరిలానే మంచి కార్పొరేట్ కళాశాలలో చేర్పించి, ఉన్నత చదువులు చెప్పించాలనుకుంటారు.

ప్రభుత్వ కళాశాల నుంచి కార్పొరేట్ కళాశాలకు వెళ్లిన సత్య, అక్కడ తోటి విద్యార్థుల నుంచి రక రకాలుగా వివక్షకు గురవుతూ ఉంటారు. అదే కళాశాలలో చదివే పార్వతి అలియాస్ పారు( ప్రార్థన) ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడినా, సత్య మాత్రం ఎందుకో కార్పొరేట్ కళాశాలలో ఇమడ లేకపోతుంటాడు.

సత్య చివరకు తన చదువును కార్పొరేట్ కళాశాలలో కొనసాగించాడా?,

తోటి విద్యార్దులతో ఎందుకు గొడవలు వస్తున్నాయి?, 

పార్వతితో తన ప్రేమ ఎలాంటి మలుపు తీసుకుంది?,

సత్య – పార్వతి  మధ్య ఏం జరిగింది?

కార్పొరేట్ కళాశాలలో చేర్పించడానికి తన తండ్రి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?

కార్పొరేట్ కళాశాలలో టీచర్స్‌ సత్యను ఎలా చూశారు?,

ఇష్టం లేకుండా చేరిన కాలేజిలో సత్య అనుకొన్నది సాదించాడా?,

చదువులో ప్రబుత్వ , ప్రేవెట్ కళాశాల ల మద్య తేడా ఏంటి?, 

ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కావాలంటే వెంటనే దియేటర్ కి వెళ్ళి సినిమా చూడాల్సిందే!

satya Movie review by 18 fms 2

కధనం పరిశీలిస్తే (Screen – Play):

సత్య సినిమాని  కథగా చెప్పుకోవాలంటే ఒక సింపుల్ లైన్, కానీ దర్శకుడు తనదైన కధనం (స్క్రీన్ – ప్లే) తో పిల్లల చదువుల కోసం తల్లి దండ్రులు పడుతున్న బాధలు మరియు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రేక్షకులను రెండు గంటలకు  పైగా కూర్చో పెట్టి  సినిమా గా చూపించే విషయంలో దర్శకుడు చాలా వరకు సఫలమయ్యాడు.

నిజానికి సినిమా మొదలైన కొంచెం సేపటి వరకు ఏదో సాగిపోతుందిలే అనిపిస్తుంది కానీ ఒక్కసారి కథ లోకి ఎంటర్ అయిన తర్వాత సన్నివేశాలు చాలా రియలిస్టిక్ అనిపిస్తాయి. నిజానికి గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకున్న లేదా ప్రైవేట్ కాలేజీల్లో చదువుకున్న చాలా మందికి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా కధనం ఉంది.

దర్శకుడు వాలి కి ఈ సత్య మొదటి సినిమానే అయినా కధ – కధనం హ్యాండిల్ చేసిన విధానం  మాత్రం ఆసక్తికరంగా ఉంది.  ప్రస్తుతం సన్నివేశాలతో కధ చెప్పే దర్శకులు సంఖ్య దాదాపు తగ్గిపోతున్న తరుణంలో దర్శకుడు వాలి మోహన్ ఈ కధ కు విజువల్ స్టోరీ టెల్లింగ్ ఫార్ములా ని చక్కగా వాడుకుని అందరినీ అలరించాడు.

సత్య కాలేజీలో గొడవలతో నాలిగిపోతూ, నచ్చిన అమ్మాయితో సరదా మాటలతో సంతోష పడుతూ, తల్లిదండ్రుల బాధలు చూడలేక తీసుకునే నిర్ణయాలు లాంటి విషయాలుప్రతి స్టూడెంట్ కి కనెక్ట్ అవుతాయి కానీ, నటి నటుల ఫేస్ లు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఉండటం, కొన్ని సీన్స్ లో తమిళ వాసనలు వంటి చిన్న చిన్న లోపాలు పక్కన సత్య కథ – కథనంతో చాలామంది కనెక్ట్ అవుతారు.

ఇదే కధ – కధనం తో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసి ఉంటే రిసల్ట్ ఇంకా బాగుండేది. అయినా సినీ లవర్స్ కి, సామాన్యులకు కూడా బాగా కనెక్ట్ అయ్యే సీన్స్ చాలానే ఉన్నాయి.

satya Movie review by 18 fms 3

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

సత్య చిత్ర కథకుడు దర్శకుడు వాలీ మోహన్‌దాస్‌ దర్శకునిగా తన టేకింగ్ ఎలా ఉంటుందో తన మొదటి సినిమాతో నే చూపించారు. ముఖ్యంగా మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాల్లోని తల్లి దండ్రులు,  ప్రైవేటు కాలేజీ వ్య‌వహారాలతో ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డారు అనే కధ తో చక్కగా చూపించాడు.

మ‌రోవైపు గ‌వ‌ర్న‌మెంట్ కాలేజీ లో జ‌రిగే విద్యార్దుల మ‌ధ్య చిన్న చిన్న అల్ల‌ర్ల‌ను ఎంతో హృద్యంగా చెప్పే ప్ర‌యత్నం మెచ్చుకోద‌గినది. కొన్ని సీన్స్‌లో మధ్యతరగతి వాడు ఎలా ఉండాలో, ఎంతలో ఉండాలో చెప్పినతీరు ఎంతో బావుంది.

హీరో గా చేసిన హమరేశ్ గతం లో కొన్ని తమిళ సినిమాలలో బాల నటుడిగా చేసినా, ఈ సినిమా తో పూర్తి నటుడిగా మారి బాగా నటించాడు. కాలేజీ స్టూడెంట్ గా, క్యూట్ లవర్ గా బాగా నటించాడు. తన లుక్స్ చూస్తే అప్పటిలో GV ప్రకాష్, ధనుష్ (వారి మొదటి సినిమాల లుక్) లా కనిపించాడు. హమరేశ్ సత్య లాంటి మంచి కధలను ఎన్నుకొంటే ఫిల్మ్ ఇండస్ట్రి లో నటుడిగా మంచి ఫ్యూచర్‌ ఉంటుంది.

ఇక పార్వతి పాత్రలో ప్రార్థన కూడా చాలా బాగా చేసింది. తన ఫేస్‌ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే కళ్లతో, స్మైల్‌తో నటించిందని చెప్పొచ్చు.  ఫ్రెండ్‌ పూజగా నటించిన క్రితింగ కూడా ఆకట్టుకుంది.

తమిళమ్ లో సీనియర్‌ యాక్టర్‌ ఆడుగాలం మురుగదాస్‌ కూడా తన పాత్ర లో పోటా పోటిగా నటించారు.  తండ్రి కొడుకుల మధ్యలో ఉండే బ్యూటిఫుల్‌ ఎమోషన్స్‌తో పాటు కొడుకును ఎవరన్న ఏమన్నా అంటే తట్టుకోలేని తండ్రి పాత్రలో మురుగదాస్‌ నటించిన తీరు బాగుంది.

ఆడుకాలం మురుగదాస్‌ భార్య కళా పాత్రలో సాయి శ్రీ ప్రభాకరణ్‌ బాగా చేసింది. కానీ ఆమె డబ్బింగ్ సరిగా లేక కాస్త చిరాకు అనిపిస్తుంది. అక్క పాత్రలో అక్షయ సెటిల్డ్ గా కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

తెలుగు టీచర్‌గా అమిత్‌ భార్గవ్‌ మరో ఇంప్రెసివింగ్‌ రోల్‌ అని చెప్పొచ్చు. గౌతమ్‌గా రాహుల్‌, ఇతర ఆర్టిస్టులంతా చాలా సహజంగా నటించి మెప్పించారు.

మరుదనాయగంకెమెరా వర్క్ బాగుంది. సత్యనారాయణ  ఎడిటింగ్ వ‌ర్క్ ఆక‌ట్టుకుంటుంది.  సత్య సినిమా సంగీత దర్శకుడు సుందరమూర్తి  బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లాడు.

IMG 20240506 WA0174

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

సంగీత దర్శకుడు సుందరమూర్తి  బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లాడు. సత్య సినిమా పాటలు కూడా బాగున్నాయి.

పాటల రచయిత రాంబాబు గోసాల ను ప్రత్యేకంగా అబినందించాలి. డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ లేకుండా వినుసొంపైన చక్కని సాహిత్యాన్ని అందించాడు.

మరుదనాయగం కెమెరా వర్క్ బాగుంది.

సత్యనారాయణ  ఎడిటింగ్ వ‌ర్క్ కూడా  ఆక‌ట్టుకుంటుంది.

నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.ఏదో డబ్బింగ్ సినిమా ని తెలుగు లో విడుదల చేస్తున్నాము అని కాకుండా, స్ట్రెయిట్ సినిమా లెవెల్ ప్రమోషన్స్ తో పాటు మంచి క్వాలిటి తో డబ్బింగ్ చెప్పించిన తెలుగు నిర్మాత శివ మల్లాల ను కూడా మెచ్చుకోవాలి.

IMG 20240503 WA0143

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో టీనేజ్ లవ్ స్టోరీలు తెలుగు లో ఎన్నో వచ్చాయి. ‘సత్య’ కూడా ఆ కోవకి చెందిన కధే అయినా ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కి దర్శకుడు పెద్దపీట వేశారు. కథగా చూసుకుంటే ‘సత్య’ చిన్న కథే అయినప్పటికీ.. ఆకట్టుకునే కథనం (స్క్రీన్ – ప్లే), చక్కటి సన్నివేశాలతో దర్శకుడు మెప్పించాడు.

గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే కుర్రాడు చెడిపోతున్నాడేమో అని తల్లిదండ్రులు ఒక ప్రైవేటు కాలేజీలో చేర్చాలని నిర్ణయానికి రావడం, అందుకోసం అప్పటికే అప్పుల్లో ఉన్నా మళ్లీ అప్పు చేసి జాయిన్ చేయడానికి సిద్ధం అవ్వడం లాంటి సన్నివేశాలు చాలామందికి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

చాలా సీన్లు నిజ జీవితంలో మనం చూసిన లేదా ఎదుర్కొన్న సంఘటనలను గుర్తు చేసేలా ఉన్నాయి. అలాగే టీనేజ్ లో ప్రేమ కథలు ఎలా ఉంటాయో చూపించిన తీరు ఆకట్టుకుంది. మొదటి సినిమానే అయినప్పటికీ ‘సత్య’ చిత్రాన్ని దర్శకుడు వాలీ మోహన్‌దాస్ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో విజువల్ స్టోరీ టెల్లింగ్ కట్టిపడేసింది.

ఇలాంటి కధను నమ్మి ఫస్ట్ టైమ్ దర్శకత్వం చేస్తున్న డైరెక్టర్ చేతిలో పెట్టడం అంటే సాహసమే. కానీ నిర్మాతలు లాభాలు కోసం కాకుండా మంచి కధను అందిస్తున్నాము అని అనుకోని చేసిన సినిమా నే ఈ సత్య (తమిళ – రంగొలి).

చివరి మాట: మద్య తరగతి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన చక్కని ప్రేమ కధ !

18F RATING: 2.75  / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *