Zee5 original Series Puli-Meka Telugu Review: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకొనే పులి మేక !

puli meka review e1677410035397

వెబ్ సిరీస్: పులి – మేక  

స్ట్రీమింగ్ తేదీ : 24 th, ఫిబ్రవరి, 2023

నటీనటులు: ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి, సుమన్, సిరి హన్మంత్, రాజా చేంబోలు, ముక్కు అవినాష్, సాయి శ్రీనివాస్, గోపరాజు రమణ, స్పందన పల్లి

దర్శకుడు : చక్రవర్తి రెడ్డి

నిర్మాతలు: కోనా ఫిలిం కార్పొరేషన్ (KFC) & జీ 5

సంగీత దర్శకులు: ప్రవీణ్ లక్కరాజు

సినిమాటోగ్రఫీ: రామ్ కె మహేష్

ఎడిటర్: చోట కె ప్రసాద్

పులి – మేక సిరీస్ రివ్యూ (Puli – Meka Series Review):

pulu meka team 2

ప్రస్తుతం మంచి సినిమాలు,ప్రతి  నెల ఒక మంచి కంటెంట్ ఉన్న  వెబ్ సిరీస్ లతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది ప్రముఖ ఓటిటిఫ్లాట్ ఫామ్ జీ 5. కోన వెంకట రైటింగ్ లో జీ 5 ఓటిటి లో ఈ శుక్రవారం  ఆడియన్స్ ముందుకి వచ్చిన వెబ్ సిరీస్ పులి మేక.

ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠిలు  మొదటి సారిగా ఓటీటీ లో ప్రవేశిస్తూన్న ఈ వెబ్ సిరీస్ థ్రిల్లింగ్ జానర్ లో  నిర్మించబడినది. ఈ పులి మేక సిరీస్  ఎలా ఉందొ మా 18 f మూవీస్ టీం సమీక్షా లో చదివి తెలుసుకుందామా !

కధ ను పరిశీలిస్తే (story line):

pulu meka లావణ్య teaser

హైదరాబాద్ మహా నగరంలో ఒక సీరియల్ కిల్లర్  పోలీస్ డిపార్ట్మెంట్ లోని ఒకోక పోలీస్  ఆఫీసర్లని టార్గెట్ చేస్తూ,  ఒకరి తరువాత మరొకరిని హత్యచేస్తూ ఉంటాడు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి పెద్ద తలనొప్పిగా మారుతుంది.

ప్రొఫెషనల్ గా  మంచి ట్రాక్ రికార్డు కలిగిన ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి) ని, ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకునేందుకు స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తారు. అయితే తన టీమ్ తో కలిసి ఆమె ఇన్వెస్టిగేషన్ ప్రారంబించిన సమయంలో ఆమెకు ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ లో హెడ్ గా వర్క్ చేసే ప్రభాకర్ శర్మ (ఆది సాయి కుమార్) సహాయం చేస్తుంటాడు.

పోలీస్ డిపార్ట్మెంట్ లోని ఆఫిసర్స్ ని టార్గెట్ చేసిన  ఆ కిల్లర్ ఎవరు? 

 అసలు అతడు పోలీస్ డిపార్ట్ మెంట్ ని ఎందుకు టార్గెట్ చేసాడు ?

 కిరణ్ ప్రభ పర్సనల్ లైఫ్ ఎన్టీ ? ప్రభాకర్ శర్మ ఎలా సహాయం చేశాడు ?

ఫైనల్ గా కిల్లర్ ని  కిరణ్ ప్రభ పట్టుకున్నాదా ? 

లేదా అనేది మిగతా కథ.

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (screen – Play):

pulu meka లావణ్య

ఇలాంటి ఇంటెన్సివ్  క్రైమ్ థ్రిల్లర్స్ ని తెరకెక్కించేటపుడు స్క్రిప్ట్ ని చాలా ఇంటెల్జెంట్ గా  పక్కాగా రాసుకోవాలి. ఇక ఈ పులి మేక వెబ్  సిరీస్ ని తీసుకుంటే మొదటి నాలుగు ఎపిసోడ్స్ కొంత స్లో గా సాగుతున్నట్టు అనిపిస్తుంది. కధ కు అనుగుణంగా రాసుకొన్న కహదానం లోని  ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు,

కథనం (స్క్రీన్ – ప్లే) నార్మల్ గా  సాగుతూ సిరీస్ చూసే  ఆడియన్స్ కి కనెక్ట్ కాదు. ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ లో కొన్ని లాజికల్ ఎర్రర్స్ లేకుండా జాగ్రత్త గా స్క్రిప్ట్ రాసుకోవాలి.. కానీ ఈ పులి మేక సిరీస్ లో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి. ఒక కీలక పాత్ర డ్రగ్స్ కేసులో చిక్కుకుని వార్తల్లో నిలుస్తుంది.

విచిత్రంగా అదే నగరంలో నివసిస్తున్న నిందితుల తల్లిదండ్రులకు తప్ప అది అందరికీ తెలుస్తుంది. కొన్ని అనవసరమైన ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు,  అలానే కొన్ని భూతు  పదాలు ఆడియన్స్ కి ఇబ్బందికరంగా మారుతాయి.

ఇక ఈ పులి మేక వెబ్ సిరీస్  రన్ టైం విషయంలో కూడా మరింత శ్రద్ద తీసుకుని అనవసర సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

pulu meka trailer

దర్శకుడు చక్రవర్తి విషయానికి వస్తే, అతను ఈ పులి మేక సిరీస్‌తో మంచి థ్రిల్లింగ్ ఇంటెన్సివ్ సిరీస్ చేశాడు అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్ ఎపిసోడ్స్ ని హ్యాండిల్ చేసిన విధానం అంతగా ఆసక్తికరంగా లేదు, అలానే కథనం (స్క్రీన్ – ప్లే) కూడా నీరసంగా సాగుతుంది. ఓవరాల్ గా వలె అనిపించాడు కానీ, మంచి ఏమోసనల్ థ్రిల్లింగ్ సిరీస్ దర్శకత్వవం వహించాడు అని చెప్పలేము.

pulu meka team 3

ఈ పులి మేక వెబ్ సిరీస్ ద్వారా తొలిసారిగా ఓటీటీ  లో నటించారు ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి.

 

లావణ్య త్రిపాఠి, కిరణ్ ప్రభ పాత్ర తో  ఈ సిరీస్ లో ఆమోఘంగా  నటించింది ఆనే చెప్పాలి. పలు కీలక సన్నివేశాల్లో ఆమె చేసిన స్టంట్స్ అలానే పండించిన ఎమోషన్స్ ఎంతో బాగున్నాయి.  మొత్తంగా ఈ పాత్ర ఆమె కెరీర్ లో బెస్ట్ అని చెప్పాలి. ఆడియన్స్ ని ఆమె నటన ఎంతో ఆకట్టుకుంటుంది.

pulu meka team 4

 ఆది సాయి కుమార్, ప్రభాకర్ శర్మ పాత్ర లో చాలా రోజుల తరువాత మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో నటించారు. ఈ  సిరీస్ మొదట్లో ఆ పాత్ర  వస్తుంది, తనకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ కూడా పాత్ర యొక్క పరిధి మేరకు ఆది సిన్సియర్ గా పెర్ఫార్మ్ చేసారు ని చెప్పాలి.  ఇటువంటి డిఫరెంట్ రోల్స్ ఫ్యూచర్ లో ఆది మరిన్ని చేస్తే నటుడిగా ఆయన మంచి స్థాయికి వెళ్లడం ఖాయం.

puli meka పొస్తర్ 3

బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ ఈ సిరీస్ లో కీలక రోల్ చేసారు. ఈ సిరీస్ లో పల్లవి పాత్రలో ఆమె కనబరిచిన నటన, ఎమోషన్స్ నిజంగా ఎంతో బాగున్నాయి. ఆమె పాత్ర ఎంట్రీ తో కథ పై మరింతగా ఆసక్తి పెరుగుతుంది.

ఇతర  ముఖ్య పాత్రలో నటించిన సీనియర్ యాక్టర్ సుమన్ ఎంతో బాగా ఆకట్టుకున్నారు. అలానే రాజా చెంబోలు పాత్ర కూడా ఆడియన్స్ ని అలరిస్తుంది. ఈ సిరీస్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ట్విస్ట్ టోటల్ గా పెద్ద ప్లస్ అని చెప్పాలి.

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

puli meka పొస్తర్

సినిమా లకు పనిచేసే చాలామంది పెద్ద టెక్నీషియన్స్ పులి మేక సిరీస్ కి వర్క్ చేసారు.

ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి పనితీరు అయితే ఎంతో బాగుంది. సిరీస్ లో కనిపించే కొన్ని సెట్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి.

ప్రవీణ్ లక్కరాజు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. కొన్ని కీలక సీన్స్ లో వచ్చే బీజీఎమ్ ఆడియన్స్ ని ఎంతో అలరిస్తుంది.

puli meka పొస్తర్ 2

ఇక రామ్ కె మహేష్ ఫోటోగ్రఫి కూడా బాగుంది, విజువల్స్ ఆకట్టుకుంటాయి. అయితే ఎడిటింగ్ విభాగం మాత్రం మరింతగా కేర్ తీసుకుంటే బాగుండేదనిపిస్తుంది. మెయిన్ స్టోరీ యొక్క పాయింట్ ని కోనా వెంకట్, వెంకటేష్ కిలారు బాగా రాసుకున్నారు.

ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్‌లు కొన్ని ఎపిసోడ్స్ లో అక్కడక్కడా వచ్చినా, అవి కధ లో బాగంగానే  అర్ధవంతంగానే ఉంటాయి, అలానే ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి.

సిరీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు  అన్నీ సమకూర్చారు అని చెప్పాలి.

18F మూవీస్ టీం ఒపీనియన్:

pulu meka team

క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా తెరకెక్కిన పులి మేక ఓవరాల్ గా ఆడియన్స్ ని మంచి థ్రిల్లర్ గా  ఆకట్టుకుంటుంది. ప్రధాన పాత్రలు చేసిన లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, అలానే ఇతర పాత్రధారులు అందరూ కూడా తమ పెర్ఫార్మన్స్ లతో ఆడియన్స్ ని మెప్పించారు.

రెండు మూడు  ఎస్పిసోడ్స్ తరువాత వచ్చే ట్విస్టుల అనంతరం కథ ట్విస్టులతో మరో ప్రపంచం లోకి తీసుకుపోతుంది. ఓవరాల్ గా  అన్నీ ఎపిసోడ్స్ పర్వాలేదనిపించినా  ఈ వారం ఫామిలీ తో కలిసి బాగా ఎంజాయ్ చేసే సిరీస్ ఈ పులి మేక.

pulu meka team lavanya

టాగ్ లైన్:  పులి గాండ్రింపునీ లెక్కచేయకుండా ఆలరించిన  మేక  

18F Movies రేటింగ్:  3 / 5

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *