What is link between Thug Life & rise of SkyWalker?: కమల్ మణి ల థగ్ లైఫ్ కి రైజ్ ఆఫ్ స్కై వాకర్ కి మధ్య లింకు ఏదేనా ! 

thug life 1 e1699376711112

ఈ రోజే పుట్టిన రోజు జరుపుకొంటున్న యూనివర్సల్ స్టార్  కమల్ హాసన్ హీరోగా మల్టీ స్టారర్ సినిమా అంటూ నిన్న రిలీజ్ చేసిన లెజెండరీ దర్శకులు మణిరత్నం భారీ ప్రాజెక్టు థగ్ లైఫ్ మూవీ  ఫస్ట్ లుక్ మరియు టిజర్ మీద ఈ రోజు నెటిజన్స్ కాపీ బొమ్మలు అతికిస్తున్నారు.  ఇంతకీ మణి రత్నం సారు ఏమి తీద్దాము అనుకొంటున్నారు ?

 అప్పటిలో మణిరత్నం కమల్ హాసన్ కలయక అంటేనే పెద్ద క్రేజ్.  వీరి కలయికలో 1987 లో వచ్చిన “నాయకుడు” సినిమా ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్  చాలా ఫిల్మ్ స్కూల్ లైబ్రరిలలో నాయకుడు భద్రంగా ఉన్నాడు అంటే కమల్ – మణి ల  కలయక పవర్ ఏంటో తెలుస్తుంది.  మళ్ళీ  దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరి కాలయకలో  రాబోతున్న సరికొత్త చిత్రమే “థగ్ లైఫ్”

thug life కమల్

నిన్ననే రాజ్ కమల్ ప్రొడక్షన్స్ వారు  ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెన్స్ టైటిల్ &  ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయగా ఆడియెన్స్ అయితే ఇది చూసి ఎంతో థ్రిల్ అయ్యారు, కానీ  కొంత సేపటికే మన సోషల్ మీడియా వీరులు ఈ టీజర్ లో కనిపించిన విజువల్స్ కమల్ డ్రెస్సింగ్ యాక్షన్ సీక్వెన్స్ ని సరిపోలే ఒక హాలీవుడ్ సినిమా  ని పట్టుకొని దాని  కాపీ అంటూ కొన్ని పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.

thug life 1 1 e1699376825963

ఇంతకీ ఆ హాలీవుడ్ ఇంగ్షీషు సినిమా ఏంటంటే  2019 లో వచ్చిన స్టార్ వార్స్ సిరీస్ లొని మూవీ “రైజ్ ఆఫ్ స్కై వాకర్” అంటూ ఆ సిన్మా సీన్ పిక్చర్స్ నెట్ ఇంట్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు.  దీనితో మణి హార్డ్ కోర్ ఫోల్లవర్స్ ఆన్సర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది జస్ట్ ఇన్స్పైర్ అయ్యి చేసిందే తప్ప సినిమా వేరుగా ఉంటుంది అని అంటున్నారు.

మొత్తానికి అయితే ఈ సెన్సేషనల్ కాంబినేషన్ పై స్టార్టింగ్ నుంచే కాపీ మరకలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పాలి.  ఈ థగ్ లైఫ్ సినిమా కి ప్రొడ్యూసర్స్  మణి  కమల్ కాబట్టి,  ఈ రోజు బర్త్డే అయిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ నుండి క్లారిటీ రావచ్చు. ఇది జస్ట్ సీన్ ఇన్స్పెరెసన్ నా లేక అఫిసియల్ రీమేక్ నా అనేది తెలుస్తుంది. ఆఫీసియల్ కంఫోర్మెసన్ వచ్చే వరకూ నెట్ ఇంట్లో ఎవరి స్టోరీలు వారు తయారుచేసుకొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *