ఆర్పీ పట్నాయక్ లంచ్ చేసిన W/O అనిర్వేష్ మూవీ పోస్టర్ !

IMG 20250201 WA0164 e1738411829597

గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి తదితరులు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం W/O అనిర్వేష్.

ఈ చిత్రం త్వరలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ గారి చేతుల మీదగా ఫిలిం ఛాంబర్ లో లాంచ్ చేశారు.

IMG 20250201 WA0165

ఈ సందర్భంగా..

ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ: అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో రూపొందిన W/O అనిర్వేష్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ సాధిస్తుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఎడిటింగ్ అని “లింక్డ్ స్క్రీన్ ప్లే” అనే ఫిలిం టెక్నీక్ తో ఎడిటర్ హేమంత్ నాగ్ కొత్త తరహా ఎడిటింగ్ ని ప్రేక్షకులకు అందిస్తున్నాము అన్నారు.

ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితం లో జరిగిన ఇబ్బందులని తనకు తెలిసిన కళతో ఎలా ఎదుర్కొని పరిష్కరించాడు అనేది దర్శకుడు ఆసక్తిగా తెరకెక్కించారని, మా బ్యానర్లో రాబోతున్న W/O అనిర్వేష్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని అన్నారు.

ఈ చిత్రాన్ని ఎస్ కె ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *