VARUN & KRITI in Hyd for BHEDIYA (THODELU) PROMOTIONS: ఈ సిటీ నాకు సొంత ఇళ్ళులా అనిపిస్తుంది అంటున్న వరుణ్ దావన్ హైదరాబాద్ ఎందుకు వచ్చాడో తెలుసా ?

Bhediya team in Hyd for Thodelu promotions1

 

వరుణ్‌ ధవన్‌, కృతిససన్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భేదియా (Bhediya). ఈ చిత్రం తెలుగులో తోడేలు (Thodelu) టైటిల్‌తో
“గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ద్వారా విడుదలవుతుంది.

ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్‌ ప్రెస్ మీట్ ను  నిర్వహించారు.

Bhediya team in Hyd for Thodelu promotions 1

నిర్మాత దినేష్ విజన్ మాట్లాడుతూ…అందరికి నమస్కారం.అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ కి ముందుగా థాంక్స్ చెబుతున్నాను.మీరు మాకు ఇన్స్ప్రెషన్.ఈ సినిమాను మీరు తెలుగులో రిలీజ్ చెయ్యడం మాకు చాలా ఆనందంగా ఉంది.

తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది ఖచ్చింతగా చూస్తారని ఆశిస్తున్నాను.

Bhediya team in Hyd for Thodelu promotions1 1

 మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..ముందుగా మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ…బాహుబలి సినిమా తరువాత తెలుగు, హిందీ, సౌత్, నార్త్ అని ఎల్లలు తీసేసాం. మంచి సినిమాను ఎక్కడున్నా చూడటం అనేది ఒక కల్చర్ గా మారింది.

నిర్మాత దినేష్ విజన్ గురించి మాట్లాడుతూ, పుష్ప సినిమా కంటే ముందే అల్లు అర్జున్ పెద్ద స్టార్ అవుతాడు అని నమ్మి అల్లు అర్జున్ తో సినిమా చెయ్యడానికి వచ్చారు. ఫ్యూచర్ లో ఆయన అల్లు అర్జున్ సినిమా తియ్యాలని కోరుకుంటున్నాను.

thodeu still

వరుణ్ గురించి మాట్లాడుతూ.. వరుణ్ నువ్వు హిందీలో సినిమా చేస్తే తెలుగులో డబ్ చేయడం కాదు. నువ్వు గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తే ఆలిండియాలో డబ్ చేసి రిలీజ్ చేద్దాం. ఈ సినిమాలో కొంత భాగం చూసే అవకాశం నాకు కలిగింది.

ఈ సినిమాలో ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రోమోట్ చెయ్యడానికి చిరంజీవి గారు వస్తాను అన్నారు కానీ ఆయనకు ఒక కాంబినేషన్ లో షూటింగ్ ఉండడంతో రాలేకపోయారు. ఈ సినిమాను తెలుగులో విడుదలచేయడం మంచి అవకాశంగా ఫీల్ అవుతున్నాను.

Bhediya team in Hyd for Thodelu promotions1 2

కృతి సనన్ మాట్లాడుతూ… చాలా రోజులు తరువాత ఇక్కడికి రావడం చాలా హ్యాపీ గా ఉంది. నా కెరియర్ ను ఇక్కడే స్టార్ట్ చేశాను. నా మొదటి సినిమాకే మంచి లవ్ ఇచ్చారు, అలానే తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది మరోసారి మీ ప్రేమను అందివ్వండి.

ఈ సినిమాను అరుణాచల్ ప్రదేశ్ లో చేసారు. ఇది చాలా అందమైన ప్లేస్ 70% ఆక్సిజన్ అక్కడి నుండి వస్తుంది. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఇది ఒక ఫన్ జర్నీ.

thodeu telugu poster

ఈ సినిమాలో తోడేలు మెయిన్ హీరో.ఈ ట్రైలర్ మీకందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తెలుగు, హిందీ, తమిళ్ లలో 2డి, 3డి వెర్సన్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా చుడండి.

Bhediya team in Hyd for Thodelu promotions1 3

వరుణ్ ధావన్ మాట్లాడుతూ… ఇది నాకు సొంత ఇల్లు లా ఉంది.ఒక దర్శకుడు కొడుకుగా సినిమా నా బ్లడ్ లోనే ఉంది. మేము ఎప్పుడు సినిమాల గురించే చర్చించుకుంటాం.

ఓన్లీ హిందీ సినిమాలు మాత్రమే కాదు మేము తెలుగు సినిమాలు గురించి కూడా మాట్లాడకుంటాం.ఇండియాలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ముంబై , హైదరాబాద్ కి చెందిన వాళ్ళే.మనం వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు కానీ మనందరం ఇండియన్స్.

todelu trailer out

క్రికెట్ లో ఏ ప్లేయర్ అయినా స్కోర్ చేస్తే ఇండియా స్కోర్ చేస్తుంది అనే చెబుతాం. అలానే సినిమా కూడా. నేను త్వరలో తెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తా.

తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది ఖచ్చింతగా చూస్తారని ఆశిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *