టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నెంబర్ 3 షూటింగ్ అప్ డేట్!

IMG 20250427 WA0204 scaled e1745813541931

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా, దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

IMG 20250427 WA0208

  హరికృష్ణ హీరోగా, భవ్య శ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు భావోద్వేగపు అనుభవాన్ని అందించనుంది.ఈ చిత్రం ప్రేమ, త్యాగం, మరియు కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోంది. హరికృష్ణ మరియు భవ్య శ్రీ మధ్య సహజమైన కెమిస్ట్రీ, కథలోని భావోద్వేగాలను మరింత లోతుగా చూపిస్తుందని భావిస్తున్నారు.

విపిన్ వి రాజ్ సినిమాటోగ్రఫీ దృశ్యాలు, గౌతమ్ రవిరామ్ సంగీతం, విజయ్ కందుకూరి సంభాషణలు పాత్రల భావాలను సహజంగా ఆవిష్కరించేలా ఉంటాయట. ఈ సినిమా కేవలం ప్రేమకథ మాత్రమే కాక, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు, వారి సవాళ్లు, మరియు విజయాలను కూడా హృదయానికి హత్తుకునేలా చిత్రికరించ బడుతుంది.

దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి కథనంలో సమతుల్యతను పాటిస్తూ, ప్రేమ మరియు కుటుంబ జోనర్‌లను సమర్థవంతంగా మేళవించారు.

దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి మాట్లాడుతూ : TSR మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా ప్రేమికులకు మరో విజయవంతమైన చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు.

   గతంలో ఎన్నడూ చూడని ఒక వైవిధ్యమైన ప్రేమ కథని చూపించ బోతున్నారు.గతంలో ఈ బ్యానర్ లో తికమక తాండ, కొబలి వంటి వైవిధ్యమైన సినిమాలు వచ్చాయి. ఎంతగానో ఆకట్టుకున్నాయి.

  కొబలి సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బాగా ట్రెండ్ అయ్యింది. అలాంటిది ఈ బ్యానర్ లో ఇప్పుడు మరో అదిరిపోయే సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

IMG 20250427 WA0206

ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ : ఈ సినిమా కంటెంట్ బాగా నచ్చిందని ప్రొడ్యూసర్ TSR అన్నారు. కొత్త జోనర్ లో వైవిధ్యమైన లొకేషన్ లలో ఈ సినిమాని తెరకెక్కించి ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతి ఇస్తాం అని అన్నారు.

హీరో : హరికృష్ణ, హీరోయిన్ : భవ్య శ్రీ, 

సాంకేతిక నిపుణులు:

బ్యానర్ : టిఎస్ఆర్ మూవీ మేకర్స్,
ప్రొడ్యూసర్ : తిరుపతి. శ్రీనివాసరావు,
డైరెక్టర్ : ఆదినారాయణ. పినిశెట్టి, డి. ఒ. పి : విపిన్ వి రాజ్, మ్యూజిక్ డైరెక్టర్ : గౌతమ్ రవిరామ్ , డైలాగ్స్ : విజయ్ కందుకూరి, పి ఆర్ ఓ: మధు వి ఆర్, డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *