బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో హౌస్ లోకి యుటుబర్ గా వెళ్ళిన టేస్టీ తేజ, జబర్దస్ట్ స్కిట్స్ మరియు యుట్యూబు లో ఫుడ్ షో లు చేసుకొంటూ జబర్దస్ట్ తేజా, టేస్టీ తేజా గా అందరికి సుపరిచితులు. హౌస్ లోకి వెళ్లక ముందు సమాన్యుడుగా అందరితో కలివిడిగా తిరుగుతూ, ముఖ్యంగా మీడియా తో ఫ్రెండ్లీ గా ఉండేవాడు. బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో ఆటలు ఆడుతూ హౌస్ లొని సభ్యులతో గేమ్ పరంగా గొడవ పడినా ప్రేక్షకుల అందరికి నచ్చడం తో దాదాపు 8 వారాలుగా ప్రేక్షకులు అవసరం అనుకొన్నప్పుడు ఓట్లు వేస్తూ వచ్చారు.
గత 8 వారాలుగా మంచి ఎంటర్‌టైనర్‌గా బీబీ ప్రేక్షకులందరికి నచ్చాడు. అయితే అనూహ్యమైన రితీలో బిగ్‌బాస్ 7 నుంచి 8 వ వారం లో ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. అయితే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ముందుగా ఏర్పాటు చేసుకొన్న కొంత మంది అభిమనులతో భాన సంచయ కలుస్తూ ర్యాలీ చేశాడు. ప్రస్తుతం తెలంగాణ లో అసెంబ్లీ ఎలెక్షన్స్ నేపద్యం లో సిటీ లో పోలీసుల రిస్ట్రక్సన్స్ ఉన్న నేపద్యం లో ర్యాలీ లో కొంత గందరగోళం ఏర్పడింది. పోలీస్ లు వచ్చి తేజా కు వార్నింగ్ ఇచ్చి పంపించేశారు.
తర్వాత హౌస్ నుండి వచ్చే ప్రతి కాంటిస్టంట్ ని అదిగినట్టే మీడియా వారు టేస్టీ తేజ ను కూడా ఇంటర్వ్యూ లు అడిగితే, మీడియా వాళ్ళతో ఇబ్బందికారంగా మాట్లాడుతూ తేజ రెచ్చిపోయినట్టు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. తేజా హౌస్ బయటకి వచ్చిన తీరు, ప్రవర్తన మీడియాకు, స్నేహితులు, సన్నిహితులకు ఇబ్బందికరంగా తయారైందనే విషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
బీబీ హౌస్ కి వెళ్లక ముందు తేజా ఏడుకొండలు జబర్దస్ట్ లో కొన్ని స్కిట్స్ చేస్తూ తర్వాత య్యూటుబర్‌గా (YOUTUBE Vloger) టేస్టీ తేజ అనే పేరుతో సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. మీడియా లొని ఫ్రెండ్స్ ద్వారా మరంత పాపులర్ అవ్వడం తో బిగ్‌బాస్ టీం నుండి పిలుపు రావడంతో ఆయన సన్నిహితులు, మీడియా వర్గాలు హ్యాపీగా ఫీలయ్యాయి. గత 7 వారాలుగా బయట ఉన్న ఫ్రెండ్స్ మరియు మీడియా బాగా సపోర్ట్ చేస్తూ పాపులర్ చేశారు.
ఈ 8 వారాలలో తెలుగు బిగ్‌బాస్ షో నుండీ అనుకోకుండా వచ్చిన క్రేజ్‌తో ప్రస్తుతం మీడియా, యూట్యూబ్ వారిని కించపరిచే విధంగా మాట్లాడుతుండటం వివాదంగా మారింది. హౌస్ లో కన్టిస్టెంట్స్ తో ప్రవర్తించినట్టు బయట ఫ్రెండ్స్ తోనూ మీడియా తోనూ మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.
ఇంతకీ ఆ రోజు రాత్రి ఏమి జరిగింది అంటే: బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా అభిమాన ర్యాలీలు తీయడం వివాదాస్పదమైంది. టేస్టీ తేజను ఊరేగింపుగా తెసుకెళ్లడం కోసం వచ్చిన స్నేహితులు కొందరు మద్యం సేవించి రోడ్డుపై నానా హంగామా చేయడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వచ్చి రోడ్డుపై ఏం జరుగుతుందని తెలుసుకొని.. వారిని అక్కడి నుంచి పంపించారని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు
హౌస్ లోకి వెళ్లేటప్పుడు మీడియా ఫ్రెండ్స్ అందరినీ సపోర్ట్ చేయమని చెప్పి బిగ్‌బాస్ షో నుండి తిరిగివచ్చిన తర్వాత అదే మీడియా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నా లెక్కచేయకుండా ఫోన్ కట్ చేస్తున్నట్టు కొందరు మీడియా వారు చెప్తున్నారు. ఆ ఫ్రెండ్స్ తె జ ముఖం చాటేస్తు వారిపై మండిపడుతూ కించపరుస్తున్నాడట. ఇంకో యు ట్యూబు టీం నయతే ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి రోజంతా సిటీ లో అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నను రండీ అని తిప్పి తిప్పి విసిగించి చివరకు మాట్లాడుకుండా తిరిగి పంపిచడమే కాకుండా అసభ్య పదజాలం కూడా వాడుతుండటం వివాదంగా మారింది.
ఎంత బిగ్‌బాస్ హౌస్ నుండి వస్తే ఇంతలా బిహావ్ చేయాలా రేపు మరలా ఫేమ్ తగ్గిన తర్వాత ఇదే మీడియా చుట్టూ తిరగడా అని సన్నిహితులు, మీడియా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో నుండి వచ్చిన ప్రతి సభ్యుడు బిగ్ బాస్ కాదు కదా !.
అసలు ఏమి జరిగింది?, తేజా ఎందుకు ఇలా బిహావ్ చేస్తున్నాడు అని మా 18f మూవీస్ టీం ఫోన్ చేసినా ఆన్సర్ చెయ్యలేదు. చూద్దాం పర్సనల్ గా కలిసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో.. ! బిగ్ బాస్ తేజా లానా లేక అప్పటి టేస్టీ తేజా లానా లేక వట్టి తేజ ఏడుకొండలు లనే ఉంటాడా ! .
* కృష్ణ ప్రగడ.