Tenant Movie Review & Rating: టెనెంట్ కి దియేటర్స్ ఆకుపెన్సీ పెంచే సత్తా ఉందా ? లేదా ?

tenant movie review by 18 fms 9 e1713583283462

చిత్రం: టెనెంట్,

విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2024,

నటీనటులు: సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి తదితరులు..,

దర్శకుడు: వై. యుగంధర్,

నిర్మాత: మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి,

సంగీత దర్శకుడు: సాహిత్య సాగర్,

సినిమాటోగ్రఫీ: జెమిన్ జోమ్ అయ్యనేత్,

ఎడిటింగ్: విజయ్ ముక్తవరపు,

tenant movie review by 18 fms

మూవీ: టెనెంట్ రివ్యూ  (Tenant Movie Review) 

20 సంవత్సరాలుగా తన సినీ కెరియర్ ని ఒడుదుడుకులతో నెట్టుకు వస్తున్న సత్యం రాజేష్ (Satyam Rajesh) గత రెండు మూడు సినీమాల లో కథానాయకుడిగా వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టి తన నటనతో ఒక్కో మెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి వడుదుడుకుల  ప్రయాణం లో మంచి కధలను ఎంపిక చేసుకొంటే మరికొన్ని సంవత్సరాలు తన సినీ కెరియర్ అద్బుతంగా కోనసాగించవచ్చు.

ప్రస్తుతం సత్యం రాజేష్ నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ “టెనెంట్” సినిమా విడుదల అయ్యింది.  వై.యుగంధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు.

కాగా ఈ సినిమా ఈ శుక్ర వారం రోజు రిలీజ్ అయ్యింది. మరి తెలుగు సినిమా ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో  మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !

tenant movie review by 18 fms 7

కధ పరిశీలిస్తే (Story Line): 

గౌతమ్ (సత్యం రాజేష్) సిటీ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటాడు. తన మరదలు సంధ్య (మేఘా చౌదరి)తో పెళ్లి అవుతుంది. ఇద్దరూ  కలిసి ఓక అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఉంటారు. మరోవైపు రిషి (భరత్ కాంత్) పక్క ప్లాట్ లో ఫ్రెండ్స్ తో ఉంటాడు. ఐతే, రిషి, ఎప్పటి నుంచో శ్రావణి (చందన పయ్యావుల) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు.

ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సంధ్య చనిపోతుంది.

అసలు సంధ్యను ఎవరు చంపారు ?,

రిషి – శ్రావణి ఎందుకు బిల్డింగ్ పై నుంచి దూకారు ?,

అసలు ఆ అపార్ట్మెంట్ లో, ఆ రాత్రి ఏమి జరిగింది ?,

పోలీస్ లు అనమానిస్తూన్నట్టు నిజంగానే గౌతం సంధ్య ను చంపాడా ? ,

రిషి – శ్రావణి ల మరణం తో  గౌతం కి సంభంధం ఉందా ? ,

ఈ రెండు జంటల జీవితాలు నాశనం అవ్వడానికి అసలు కారణం ఏమిటి ?,

గౌతమ్‌ స్టోరీకి, రిషి స్టోరీకి ఉన్న సంబంధం ఏంటి? ,

ఇంతకీ, గౌతమ్ మంచోడా ? చెడ్డోడా ?

ఆ రోజు రాత్రి ఏం జరిగింది?

అనే ప్రశ్నలకు జవాబులు కావాలంటే టె నెంట్ సినిమా దియేటర్ కి వెళ్ళి చూడవలసిందే !.

tenant movie review by 18 fms 1

కధనం పరిశీలిస్తే (Screen – Play):

ఈ టెనెంట్ సినిమా కధలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా, కొన్ని చోట్ల కధనం (స్క్రీన్ – ప్లే) మాత్రం చాలా స్లో గా, సింపుల్ గా సాగింది. కధలొని మెయిన్ ప్లాట్ కూడా చాలా సినిమాలలో వచ్చినట్టే ఉంది. అలాగే,మొదటి అంకం ( ఫస్ట్ హాఫ్) లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి.

దర్శకుడు ఫస్ట్ హాఫ్ స్క్రీన్ – ప్లే ని ఇంకా బలంగా ఇన్నోవేటివ్ గా రాసుకుని ఉండాల్సింది. కొన్ని  అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా సినిమా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో నడిచింది.

ముఖ్యంగా మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో కధను మలుపు తిప్పే కొన్ని కీలక సన్నివేశాలు మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ పేలవంగా ఉన్నాయి. ఇక రెండవ అంకం (సెకండాఫ్) లోనైనా సిన్మా మీద ఇంటరెస్ట్ క్రియేట్ అవుతుందా అని ఎంతో ఆతృత తో ఎదురుచూసే ప్రేక్షకులకు నిరాశనే తొడయ్యింది.

దర్శకుడు వై. యుగంధర్ మంచి థ్రిల్లింగ్ స్టోరీ పాయింట్ తో కాస్త ఎమోషనల్ కధనం తో మర్డర్ ఇన్వెస్ట్గెటివ్ ఎలిమెంట్స్ తో కధనం (స్క్రీన్ – ప్లే ) నడుపుదామని బాగానే ప్రయత్నం చేశాడు కానీ, క్లైమాక్స్ లో తప్ప మిగిలిన అన్ని సీన్స్ లో ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు. పైగా ఫెక్ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో సినిమా బోర్ కొట్టే విధంగా తీశాడు.

tenant movie review by 18 fms 2

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు వై. యుగంధర్ ఈ టెనెంట్  క్రైమ్ థ్రిల్లర్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచి ఉంటే మంచి సోషల్ మెసేజ్ సినిమా అయ్యేది. స్క్రీన్ -ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఇన్వెస్ట్గేసన్ యాంగిల్ ఇంకా బెటర్ గా తీసిఉంటే బాగున్ను.

ఈ ‘టెనెంట్’ ప్రధాన కథాంశం మన చుట్టూ జరిగే సంఘటనలకి దగ్గరగా ఉంటుంది. రియల్ పాయింట్ చుట్టూ సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీని దర్శకుడు వై. యుగంధర్ బాగానే ఎస్టాబ్లిష్ చేశాడు. ముఖ్యంగా ఆడవాళ్లు  ఈ మోడ్రన్ కల్చర్  మొగవాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పిన సినిమా ఇది.

సత్యం రాజేష్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎమోషనల్ అండ్ సీరియస్ సన్నివేశాల్లో  తన ఎక్స్పీరియన్స్  తో మెట్యూర్నడ్  నటన తో  సినిమా తన బుజాలమీద మోసినట్టు అనిపించింది.

ఓక హీరోయిన్ మేఘా చౌదరి కూడా తన నటన తో సినిమా కి జీవం పోసింది. మరో కీలక పాత్రలో నటించిన భరత్ కాంత్ చాలా బాగా నటించాడు. అతని లుక్స్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ కూడా బాగున్నాయి.

మరో హీరోయిన్ గా చందన పయ్యావుల నటన బాగుంది. ఇక తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ధనా బాల, అనురాగ్, రమ్య పొందూరి తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

ఎస్తేర్ నొరోన్హ సీరియస్ పోలీస్ అధికారిణిగా ఆకట్టుకున్నారు. తనకు ఇచ్చిన లుక్ కూడా బాగుంది.  దర్శకుడు ఓక  మర్డర్ చుట్టూ అనేక యాంగిల్స్ లో సినిమాని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది.

tenant movie review by 18 fms 3

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

సాహిత్య సాగర్ సంగీతం పరవాలేదు. నేపథ్య సంగీతం కూడా కొన్ని సీన్స్ కి తగ్గట్టుగా పర్వాలేదు అనిపించింది.

 సినిమాలో జెమిన్ జోమ్ అయ్యనేత్ సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు.

విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. కానీ స్లో స్క్రీన్ రైటింగ్ వలన కొన్ని సీన్స్ బోర్ గా ఉన్నాయి. అవి ట్రిమ్ చేస్తే సినిమా లెన్త్ ఇంకా తగ్గిపోతుంది.  ఇలాంటి తక్కువ లెన్త్ ఉన్న సినిమా స్క్రిప్ట్ లు ఎడిటర్ కి ఛాలెంజ్ గా మారతాయి.

నిర్మాత మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. కాకపోతే కొన్ని సీన్స్ మరి లో క్వాలిటి లో ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో చేశారా లేక రెజూల్యుసన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది చిత్ర యూనిట్ కి మాత్రమే తెలుసు.

దియేటర్ లో బిగ్ స్క్రీన్ మీద మాత్రం చాలా లో క్వాలిటి లో ప్రాజెక్టు అయ్యింది.   

tenant movie review by 18 fms 4

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

సత్యం రాజేష్ లీడ్ పాత్రలో ‘టెనెంట్’ సినిమా షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ, దియేటర్ కి తక్కువ అన్నట్టు ఉంది. సుమారు 96 నిముషాల నిడివితో ఉన్నా చాలా సీన్స్ ఎడిట్ చేయవచ్చు. ఇంకా ఈ మూవీ పోస్టర్ డిజైన్ మరియు టైటిల్ చూస్తే ఏదో మంచి ఇంగ్షీషు సినిమా లెవెల్ లో ఉన్నా ఇందులో చూపించిన ఎమోషనల్ మర్డర్ మిస్టరీ డ్రామా చాలా నిరశంగా సాగింది.

ఈ మద్య వస్తున్న కొన్ని టివి సీరియల్స్ కూడా, ఓటీటీ నుండి వచ్చే కాంపీటేశన్ తట్టుకోలేక ఎంతో క్వాలిటీ తో మంచి కంటెంట్ తో నిర్మిస్తున్నారు. అలాంటిది దియేటర్ ఆడియన్స్ కోసం సినిమా చేస్తున్నాము అంటే ఎంతో జాగ్రత్తగా చెయ్యాలి, కానీ ఈ టెనెంట్ నిర్మాణం మాత్రం టివి సీరియల్ కంటే దారుణంగా సాగింది.

 కొన్ని చోట్ల మర్డర్ మిస్టరీ కి సంబందించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పర్వాలేదు అనిపించినా కధనం ( స్క్రీన్ ప్లే) స్లోగా సాగడం వలన నిరశం వస్తుంది. మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.

మొత్తమ్మీద ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించలేక మద్యలోనే దియేటర్ కాలి చేద్దామా అనిపించేలా ఉంది. కానీ గంటన్నార నిడివే కదా అని పూర్తిగా చూడవలసి వచ్చింది. కానీ ఈ కధలో మంచి సోషల్ మెసేజ్ వుండటం వలన, కొంత మంది పట్టణ వాసులకి, ఆడవారికి ఈ  కధలో ఉన్న ఎమోషనల్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.

tenant movie review by 18 fms 5

చివరి మాట: నిరాశ పరిచిన టెనెంట్ !

18F RATING: 1.5/5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *