సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ వస్తున్న వై ఎస్ ఆర్ – చంద్ర బాబు లను గుర్తు తెచ్చే మయసభ టీజర్  రివ్యూ !

mayasabha teaser scaled e1752323097763

వైవిధ్యమైన కంటెంట్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోన్న వన్ అండ్ ఓన్టీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ తాజాగా మరో డిఫరెంట్ వెబ్ సిరీస్‌తో అలరించటానికి సిద్ధమవుతోంది. అదే ‘మయసభ’. ‘రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ట్యాగ్ లైన్. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు.

ఇద్దరు గొప్ప స్నేహితులు.. అయితే వారి రాజకీయ ప్రస్థానాలు వారి మధ్య తెలియని దూరాన్ని పెంచాయి. మానసికంగా ఎంత దగ్గరి వారైనా రాజకీయ చదరంగంలో ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకోక తప్పలేదు. అలాంటి ఇద్దరు స్నేహితుల కథే ‘మయసభ’. ఇందులో కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి, ఎం.ఎస్.రామిరెడ్డి పాత్రలో చైతన్య రావు, ఐరావతి బసు పాత్రలో దివ్య దత్తా నటించారు.

జీవితంలో ఏదో సాధించాలి, ప్రజలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఇద్దరు స్నేహితుల దారులు ఎలా మారాయి? చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారే.. రాజకీయ గమనంలో ప్రత్యర్థులుగా ఎలా మారారు. ఇద్దరి గొప్ప స్నేహితుల మధ్య ఉండే స్నేహం, మానసిక సంఘర్షణ.. పొలిటికల్ జర్నీలో వారు ఎదుర్కొన పరిస్థితులను భావోద్వేగంగా ఆవిష్కరించిన వెబ్ సిరీస్ ‘మయసభ’.

ఈ సిరీస్ సోనీ లివ్‌లో ఆగస్ట్ 7 నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈసందర్భంగా శనివారం రోజున సోనీ లివ్ ‘మయసభ’ ట్రైలర్‌ను విడుదల చేశారు. .

ప్రతి సన్నివేశంలో ఓ ఎమోషన్, ఫ్రెండ్ షిప్, ఎత్తుకు పై ఎత్తులు వేసే రాజకీయ చదరంగం.. ఎదుర్కొన్న ఆటు పోట్లు అన్నింటినీ దేవా కట్టా టీజర్‌లో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక డైలాగులైతే…

* ఫ్రెండ్ గా ఒక మాట చెప్పనా నాయుడు… యుద్ధం నీ ధర్మం

* వ్యవసాయాన్ని మించిన చదువు లేదు పెద్దయ్య…
మా అందరికన్నా పెద్ద చదువు నీదే.

* డబ్బులతో కొనలేనిది ఒకటే ఒకటి ఉంది… ప్రజల మనసు.

* మడక దున్నే కులంలో పుట్టిన వాడికి నీకెందుకు అబ్బే రాజకీయం.

* వసూలు చేసే కులం లో పుట్టిన రౌడీ వి నీకెందుకయ్యా వైద్యం.

* ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఫోన్ చేసినావ్.
ఫ్రెండ్ గానా.. ప్రత్యర్థి గానా?

* ఏం జరుగుతుంది నాయుడు?
కురుక్షేత్రం.

* ఇది చావో రేవో అర్ధం కావడం లేదు రెడ్డి…
20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుంది అనుకోలేదు.

* స్నేహితుడి గా ఒక మాట చెప్పు. ఈ ఉచ్చు నుంచి బయటపడతానంటావా?

* ఈరోజు నువ్వు గెలిస్తే…
ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణం గా మారుతుంది.
ఆ బాణం నిన్ను ఓడించేంత వరకు వాడుతూనే ఉంటాను.

* చివరికి పిల్లనిచ్చిన మామ తోనే ఉనికి కోసం పోరాడుతున్నాను. వేరే దారి లేదు.

“మయసభ” టీజర్ లోని డైలాగులు తుటాల్లాగా కనెక్ట్ అవుతున్నాయి. గొప్ప స్నేహితుల కథగా ప్రారంభమై తరువాత రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ఇద్దరి వ్యక్తుల పయనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *