రవితేజ, ఊర్వశి రౌతాలా, మెగా స్టార్ కోసం వాల్తేరు వీరయ్య సినిమాకు ఫ్రీ గా నటించారా ? డబ్బులు అసలు తీసుకోలేదా ? ఇదేంది బాబీ మైక్, స్టేజ్ ఉంది కదా అని మైక్ ని గన్ అనుకోని కనిపించని బుల్లెట్స్ పేలచుతూ… మరి ఇంతలా దిగజారీ మాట్లాడాలా ?.
సినిమా వాళ్ళ ఫంక్షన్లలో ప్రసంగాల భలే గమ్మత్తుగా వుంటాయి. వినే సినీ ప్రేక్షకులు చాలా దూరంగా ఉంటారు కాబట్టి మరి ఎక్కువ గా వస్తావనికి దూరంగా ప్రసంగిస్తారు. స్టేజ్ కి ఎదురుగా పక్కనే కొంతమంది నికార్సయిన జర్నలిస్టులు కూడా ఉన్నారు అని మార్చిపోయి అతి ప్రేమలు పొంగించేస్తారు.
కానీ తెరవెనుక వస్తవాలు వెరే గా ఉంటాయి. మొన్నటికి మొన్న వాల్తేర్ వీరయ్య సినిమా ప్రెస్ మీట్ అంటూ చాలా ఆడావడి చేసి సీటీకీ చాలా దూరంగా ఉన్న ఆలూమినీయం ఫ్యాక్టరీ లో వీరయ్య సినిమా కోసం వేసిన సెట్ లో బాస్ పార్టీ మీట్ అంటూ ఏర్పాటు చేసి మైక్ లో మాటల తూటాలు వదిలారు. ఆ బాస్ మీట్ లో వక్తల మాటలు భలేగా వినిపించాయి. అందులోనించి వాల్తేరు వీరయ్య సినిమా దర్శకుడు బాబీ వదిలిన తూటాలు అయితే వస్తావనికి చాలా దూరంగా అద్బుతంగా పేలాయి.
ఈ బాస్ పార్టీ మీట్ లో, ఓక జర్నలిస్టు రవితేజ ని మీరు ఈ సినిమా ఒప్పుకోవడానికి అసలు కారణం దర్శకుడా ? మెగా స్టార్ ? లేక మెగా స్టార్ లేకపోయినా బాబీ కోసం ఈ సినిమా చేసే వారా ? అంటే మాస్ మహా రాజా ఏమి చెప్పాలో తెలియక నీళ్ళు నములారు, తర్వాత మీడియా కెమెరా లు ఉన్నాయి అని తడబడుతూ, అన్నయ్య సినిమా అంటే చాలు చేసేస్తా అన్నారు రవితేజ.
ఇంకా రవితేజ ని దర్శకుడు బాబీ అయితే ఆకాశానికి ఎత్తేశారు.. రవి గారు మెగాస్టార్ కోసం డేట్ లు అడ్జస్ట్ చేసుకొని నటించారు అంటూ తెగ చెప్పుకువచ్చారు. అంతే కాదు,మైత్రీ మూవీస్ అస్సలు ఖర్చు గురించి గురించి ఆలోచించకుండా తనకు కావలసిన నటులను, సెట్స్ ని అందించారు అంటూ మైత్రి మనస్సు దోచే ప్రయత్నం చేశారు.
కానీ తెరవెనుక అసలు విశయం మరోలా ఉంది అంటూ కృష్ణ నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమారు 40 నిమిషాల పాటు సినిమాలో కనిపించే ఈ ప్రత్యేక పాత్ర లో రవితేజ నాటిస్తేనే బాగుంటుంది అని గట్టిగా పట్టుకొని కూర్చున్న దర్శకుడి కధా కల కోసం రవితేజ కి 15 కోట్లు రెమ్యూనిరేషన్ ఇచ్చుకోవాలసి వచ్చింది అని మైత్రి పార్టనర్ ఇన్నర్ వాయిస్.
మైత్రి నిర్మాణ సంస్థ రవితేజ ని ప్రొజెకట్లోకి తెచ్చే పనిలో బేరం 10 కోట్ల నుంచి ప్రారంబించి ఆఖరికి దర్శకుడి అభిమతం కోసం సినిమా వ్యాపారం ఆలోచించకుండా సుమారు 15 కోట్ల దగ్గర డీల్ ఓకె అన్నారని టాక్ వినిపిస్తుంది.
అలాగే దర్శకుడు బాబీ మరో బుల్లెట్ పేల్చారు. మెగాస్టార్ సినిమా అనగానే ఊర్వశి రౌతాలా ఎగిరి గంతేసి, ఒక్క ఫోన్ కాల్ తో ఓకె చెప్పారన్నది బాబీ స్టేజ్ మీద మైక్ లో పేల్చిన మాటల మరో తూటా. ఆమె కూడా చిరంజీవి సినిమాలో నటించడం తన డ్రీమ్ అన్నట్లు చెప్పుకువచ్చారు.
కానీ తెరవెనుక గుసగుసలు వేరేలా వినిపిస్తున్నాయి. ఈ సాంగ్ చేయడానికి ఊర్వశి రౌతాలా ఒకంతట ఒప్పుకోలేదు. దర్శకుడు బాబీ కిందా మీదా పడడం, మరో దర్శకుడు సంపత్ నంది ద్వారా ఊర్వశి రౌతాలాను ఒప్పించి అధిక మొత్తం సరా సరి హీరోయిన్ రెమ్యులేసం అంత ఇచ్చుకోవాలసి వచ్చింది అనేది టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ వినిపిస్తున్న వార్త.
ఇన్ని వస్తావాలు లోపల ఉంచుకొని బయటికి మాత్రం మరోలా మాట్లాడటం సినీ జగత్తు కే చెల్లింది. మా ఈ ఆర్టికల్ చదివి బావిష్యత్తు లోనైనా స్టేజ్ ఎక్కినప్పుడు మైక్ లో నిజాలు మాట్లాడతారు అనేదే మా ప్రయత్నం.
* కృష్ణ ప్రగడ.