Priyadarshi New Movie Opens Under Sridevi Movies: మోహనకృష్ణ ఇంద్రగంటి – శ్రీదేవి మూవీస్ ల మూడవ చిత్రం ప్రారంభం !

IMG 20240325 WA0070 e1711351156815

 ముచ్చటగా మూడోసారి మోహనకృష్ణ ఇంద్రగంటి – శ్రీదేవి మూవీస్ కాంబినేషన్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ప్రియదర్శి, రూప కొడువాయూర్ ఇందులో హీరో హీరోయిన్లు.

IMG 20240325 WA0071

శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్. 15 గా రూపొందుతోన్న ఈ చిత్రం సోమవారం (మర్చి 25) ఉదయం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది . దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

ఈ సందర్బంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ -“మా శ్రీదేవి మూవీస్ సంస్థకి ఆత్మీయుడు, నాకు అత్యంత సన్నిహితుడైన ప్రతిభా శాలి మోహనకృష్ణ ఇంద్రగంటి తో జెంటిల్ మన్, సమ్మోహనం చిత్రాల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నందుకు చాల సంతోషంగా ఉంది.

IMG 20240325 WA0073

‘బలగం’ తో హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న ప్రియదర్శికి హీరోగా యాప్ట్ సబ్జెక్ ఇది. తెలుగమ్మాయి రూప కొడువాయూర్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ఇదో క్యూట్ ఫిలిం. స్వీట్ ఎంటర్టైనర్. చక్కటి వినోదంతో పాటు మంచి భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.

ఇప్పటి ట్రెండ్ లో జంధ్యాల గారు సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా . ఈ రోజు నుంచి హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలయింది” అని తెలిపారు.

IMG 20240325 WA0072

ప్రధాన తారాగణం:

ప్రియదర్శి, రూప కొడవాయూర్, వి.కె. నరేష్. తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవ’ హర్ష, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూపలక్ష్మి, హర్షిణి , కె.యల్.కె. మణి.

 సాంకేతిక నిపుణులు:

కాస్ట్యూమ్స్-మనోజ్; కాస్ట్యూమ్ డిజైనర్-రాజేష్-శ్రీదేవి; ప్రొడక్షన్ కంట్రోలర్స్- పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు; పి.ఆర్.ఓ- పులగం చిన్నారాయణ; కో-డైరెక్టర్- కోట సురేష్ కుమార్; పాటలు- రామజోగయ్య శాస్త్రి; ఫైట్స్- వెంకట్; ప్రొడక్షన్ డిజైనర్- రవీందర్; ఎడిటర్- మార్తాండ్ కె. వెంకటేష్; డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ- పి .జి. విందా; సంగీతం- వివేక్ సాగర్; లైన్ ప్రొడ్యూసర్స్ -విద్య శివలెంక, లిపిక ఆళ్ల , నిర్మాత-శివలెంక కృష్ణప్రసాద్; రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *