Pranayagodari Movie Review & Rating : ప్రణయ గోదారి చిత్ర రివ్యూ మరియు రేటింగ్ !

Pranayagodari Movie Review e1738072804262

చిత్రం: ప్రణయ గోదారి 

విడుదల తేదీ : డిసెంబర్ 13, 2024,

నటీనటులు :సదన్‌, ప్రియాంక ప్రసాద్‌, సాయి కుమార్‌, పృథ్వి, సునిల్‌, జబర్థస్త్‌ రాజమౌళి తదితరులు ,

డైరెక్టర్ :పీఎల్‌ విఘ్నేష్‌  ,

ప్రొడ్యూసర్ : పారమళ్ల లింగయ్య ,

సినిమాటోగ్రఫీ : ప్రసాద్ ఈదర ,

మ్యూజిక్ : మార్కండేయ  ,

ఎడిటింగ్ :కొడగంటి వీక్షిత వేణు  ,

మూవీ: ప్రణయ గోదారి రివ్యూ  (Pranayagodari Movie Review) 

డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో సదన్ ప్రియాంక ప్రసాద్ హీరో హీరోయిన్ గా పి ఎల్ విఘ్నేశ్ దర్శకత్వం లో పారమళ్ల లింగయ్య నిర్మించిన ప్రణయ గోదారి మూవీ ఈ శుక్ర వారం విడుదల అయ్యింది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూరల్ లవ్ స్టోరీ గా నిర్మించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకొందామా !

 

కధ పరిశీలిస్తే (Story Line): 

పెద కాపు (సాయి కుమార్) ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి పరిసర ప్రాంతం లొని 40 ఊర్లకు పెద్దదిక్కుగా ఉంటాడు.  తన గ్రామాన్ని, చుట్టూ పక్కల గ్రామాల ప్రజల బాగును కోరుకొంటూ ప్రజల యొక్క చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలో ముందుంటాడు. దత్తుడు (పృద్వి) కూడా అదే గ్రామానికి చెందినవాడు మరియు ప్రతి పరిస్థితి ఆధిపత్యం కోసం పెద కాపుతో ప్రతిసారీ పోటీపడతాడు.

శీను (సదన్) పెద కాపు కి వరసకు మేనల్లుడు. తండ్రి చనిపోవడం తో తల్లితో కలిసి మావయ్య  గ్రామానికి వచ్చి అదే ప్రదేశానికి చెందిన గొయ్య (ప్రియాంక ప్రసాద్) అనే జలర్ల అమ్మాయి ప్రేమలో పడతాడు. గొయ్య శీను ప్రేమ ప్రతిపాదనను అంగీకరించినప్పుడు, పరిస్థితులు మరింత దిగజారతాయి మరియు గ్రామంలోని వీరిద్దరూ అనేక సవాళ్లను ఎదుర్కొంటారు.

పేదకాపు తన ఒక్కగాని ఒక్క కూతురుని మేనల్లుడు శ్రీను కి ఇచ్చి వివాహం చెయ్యాలి అనుకొంటాడు. కానీ శ్రీను గో య్య ను, తన కూతురు వెరే అబ్బాయిని ప్రేమిస్తుంది అని తెలిసి ఇద్దరినీ మందలిస్తాడు. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత ….

పెద కాపు ప్రేమ జంట  శీను, గొయ్యల ప్రేమను అంగీకరించాడా ?,

శీను, గొయ్యలు  ఎలాంటి ఘర్షణలను ఎదుర్కొన్నారు?,

పేదకాపు స్వతహాగా ఎలాంటి వాడు ?,

పేదకాపు కూతురి ప్రేమను అంగీకరించాడా?,

చివరకు ఈ జంట తమ సమస్యను ఎలా పరిస్కరించుకొన్నారు  అనేది వెండితెర పై చూడాల్సిందే.

 

కధనం పరిశీలిస్తే (Screen – Play):

మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్ ) కొంచెం రొటీన్ స్టోరీ లా అనిపించినా రెండవ అంకం (సెకండ్ ఆఫ్ ) మాత్రం మంచి ఎమోషనల్ రైడర్ గా సాగింది. చిత్ర కధ వస్తూ పాతదే అయినా దర్శకుడు తనదైన కధనం తో రూరల్ ప్రేక్షకులు ఇష్టపడే మసాలా సీన్స్ తో మలచిన విదానం బాగుంది.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు  పిఎల్ విఘ్నేష్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు. సరళమైన కథాంశాన్ని సరైన నటి నటులతో చక్కని భావోద్వేగాలతో నటింప చేయడం ద్వారా ప్రేక్షకులకు మంచి రూరల్ మట్టి కధ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించాడు.  గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఈ కధ ను  చేయడంలో దర్శకుడు ఉత్తమంగా వ్యవహరించాడు.

డైలాగ్ కింగ్ సాయి కుమార్ సినిమా అంతటా హై ఆక్టేన్ యాక్షన్ మరియు ఎమోషన్స్ తో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో డామినేట్ చేశాడు. తను పేదకాపు పాత్రలో తనదైన బహుముఖ ప్రజ్ఞ,  డైలాగ్ డెలివరీ తో అద్బుతంగా నటించాడు. ఈ మద్య సాయి కుమార్ కి మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలే దొరుకుతున్నాయి.

హీరో సదన్ లీడ్ రోల్ లో డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే క్యారెక్టర్ తో అదరగొట్టాడు.

హీరోయిన్ ప్రియాంక ప్రసాద్ తన తొలి సినిమా అయినప్పటికీ సినిమా చివరి వరకు మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ.

ఆర్టిస్ట్ సునీల్ రావినూతల గోచి క్యారెక్టర్‌లో మంచి పాత్రతో ప్రేక్షకులను అలరించారు. పాత్రకు ఇచ్చిన లుక్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది .

30 సంవత్సరాల పృద్వి పాత్ర పరిమిత పరిధి మేరకు తనదైన మేనరిజం తో ఆకర్షణీయంగా  నటించాడు. జబర్థస్త్‌ రాజమౌళి తదితర నటి నటులు తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు.

 

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

మార్కెండేయ అందించిన సంగీతం మరియు BGM అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ చాలా బాగుంది.

డిఓపి ప్రసాద్ ఈదర సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్‌గా ఉంది. గోదావరి అందాలను చాలా చక్కగా చూపించాడు.

వీక్షిత వేణు ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. కానీ మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్ ) లో కొన్ని సీన్స్ నిడివి తగ్గించి ఉంటే ఇంకా ఎంగేయిజింగ్  ఉండేది.  పిఎల్‌వి సినిమాస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

ప్రణయగోదారి చిత్రం  మంచి భావోద్వేగాలు మరియు న్యాచురల్  విజువల్స్‌తో ఆకర్షణీ యంగా నిర్మించబడినది. ఇంక చెప్పాలి అంటే ఈ చిత్రం ఒక పల్లెటూరి నాటకం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో చాలా సహజమైన కనెక్షన్లు ఉన్నాయి, అవి నిజ జీవితంలో అద్భుతమైన మలుపులతో కనెక్ట్ అవుతాయి.

ఈ కథను  ఎలాంటి డైవర్షన్స్ లేకుండా ప్రేక్షకులకు అందించడంలో దర్శకుడు తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. సినిమాలో అన్ని  పాత్రలు  న్యాచురల్ గా నటించి మెప్పించాయి. తెరపై ప్రదర్శించబడే ప్రతి పాత్రకు సంబంధించిన  జర్నీ ప్రేక్షకులకు  మంచి అనుభూతిని ఇస్తాయి.

ఓవరాల్ గా ఈ ప్రణయ గోదారి చిత్రం పల్లెటూరు, మట్టి కధలను ఇష్టపడే వారికి ఇది ఒక చక్కని మంచి సినిమా అని చెప్పవచ్చు. అలానే అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఈ చిత్ర ఆకర్చించవచ్చు.

చివరి మాట: చక్కని గోదారి అందాలతో నిండిన ఒక పల్లెటూరి నాటకం !

18F RATING: 2.75 / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *