పొలిమేర సినిమాటిక్ యూనివర్స్ అద్భుతంగా పనిచేస్తుంది. లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీ లో చూసిన ప్రేక్షకులు దీనికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు అంటే.. దానికి కారం, తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కొత్త గా ఉన్న కంటెంట్ ని గుండెల్లో పెట్టుకొంటారు.
అప్పట్లో వెండితెర మీద కాష్మోరా, బుల్లితెర మీద ఈ టివి అన్వేషిత, జెమిని టివి మర్మ దేశం, స్టార్ మా లో ప్రసారమైన తులసిదళం సీరియల్ ఎంత పాపులారిటీ సంపాదించాయో తెలుగు ప్రజలందరికీ తెలుసు. థ్రిల్లర్ తో కూడిన సస్పెన్స్ మర్డర్ మిస్టరీ లు ఎప్పటికీ హాట్ ఫేవరెట్ గా నిలిచాయి.
ప్రస్తుతం ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన లేటెస్ట్ చిత్రాల్లో సత్యం రాజేష్ హీరోగా దర్శకుడు అనిల్ విశ్వనాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఓ సాలిడ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “మా ఊరి పొలిమేర 2” కూడా ఒకటి. పార్ట్ -1 ని ఓటిటిలో భారీ హిట్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు వచ్చిన ఈ పార్ట్ -2 ని కూడా థియేట్రికల్ గా అంతకు మించిన సక్సెస్ చేస్తూ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మ రధం పడుతున్నారు.

ఈ మా ఊరి పొలిమేర 2 సినిమా మొదటి రోజే సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుని రెండవ రోజు ఇంక ఎక్కువు బుకింగ్స్ తో దూసుకుపోతుంది. డే 2 కి ఏకంగా 66 వేలకి పైగా టికెట్స్ ఒక్క బుక్ మై షో నుంచే బుక్ అయ్యాయి. దీనితో డే బై డే పొలిమేర 2 కి ఆదరణ మరింత పెరుగుతుంది అని చెప్పాలి.
ఇప్పటికే చూసిన అంతా కూడా సినిమా బాగుంది అనడంతో పాజిటివ్ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. దీనితో ఈ చిత్రం మరింత స్థాయిలో రాణిస్తుంది. చిత్ర దర్శకుడు డాక్టర్ అనిల్ గారూ, ఈ సక్సెస్ చూసి మూడో పార్ట్ ని ఇంకా బిగ్గర్ స్కేలు అండ్ బడ్జెట్ లో నిర్మించడానికి స్క్రిప్ట్ ని పాకట్బందిగా తయారు చేస్తున్నట్టు చెప్పారు.