Police Vaari Heccharika Movie canes Action shots : పోరాటాల చిత్రీకరణలో పోలీస్ వారి హెచ్చరిక మూవీ !

IMG 20240108 WA0042 e1704734362357

 

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న””పోలీస్ వారి హెచ్చరిక”” చిత్రం ప్రస్తుతం పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుంది…..!

పాన్ ఇండియా నటుడు రవి కాలె, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, అఖిల్ సన్నీ లతో పాటు హీరో హీరోయిన్ ల బృందం పై టాలీవుడ్ స్టూడియో, చిత్రమందిర్ స్టూడియో, చందానగర్, బీరంగూడా, ఘణ పూర్, షామీర్ పేట లలో భారీగా వేసిన సెట్స్ లో ప్రముఖ ఫైట్ మాస్టర్ “సింధూరం సతీష్ ” నేతృత్వంలో ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించామని” చెప్పారు.

IMG 20240108 WA0040

“అక్టోబర్ 23 న ప్రారంభమైన యీ సినిమా చిత్రీకరణను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తున్నామని, ఇప్పటివరకు జరిగిన షూటింగ్ లో 80 శాతం టాకీ పార్ట్ తో పాటు ఫైట్స్ సన్నివేశాల చిత్రీకరణ ను పూర్తి చేశామని, జనవరి నెలాఖరు నాటికి మిగతా సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణను కూడా పూర్తి చేసి షూటింగ్ కార్యక్రమాన్ని ముగిస్తామని” బాబ్జీ పేర్కొన్నారు…!!

చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ : భారత సైన్యం లో పనిచేసి వచ్చిన తనకు యుద్ధరంగం లో సైనికులకు ఉండే క్రమశిక్షణ సినిమా రంగంలో పనిచేసే టెక్నీషియన్స్ దగ్గర కనిపించిందని, టైం మేయింటేనేన్స్ అనేది సినిమా పరిశ్రమకు ఉన్న గొప్ప గుణమని తనకు అర్థమైందని. ఈ రంగంలో పొందిన స్పూర్తితో భవిష్యత్ లో కూడా సినిమా నిర్మాణాన్ని ఇలాగే కొనసాగిస్తూ సినిమా రంగంలోనే ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు…..!!

IMG 20240108 WA0038

నటీనటులు :

అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, రవి కాలె, సంజయ్ నాయర్, కాశీ విశ్వనాథ్, గిడ్డేష్, హనుమా, గోవిందు, బాబురాం, జబర్దస్త్ వినోద్, వేణు రాక్, సకరాం, వైజాగ్ శివ, చీరాల సాయి, లాబ్ శరత్, హిమజ, జయ వాహిని, మేఘనా ఖుషీ, రుచిత, ఉజ్వలా రెడ్డి, అద్విత.

 

టెక్నీషియన్స్ :

కెమెరా : కొండపల్లి నళినీ కాంత్ , సంగీతం : గజ్వేల్ వేణు, ఎడిటర్ : శివ శర్వాణి, ఫైట్స్ : సింధూరం సతీష్, డాన్స్ : వేణు రాక్, స్టిల్స్ : బి. శ్రీకాంత్, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : యస్ . హనుమంత రావు, నిర్మాణ నిర్వహణ : ఎన్. వై. సుబ్బరాయుడు, డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం, పి ఆర్ ఓ : మధు VR, నిర్మాత : బెల్లి జనార్ధన్,రచనా, దర్శకత్వం : బాబ్జీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *