100 సినిమాలను నిర్మించే ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ గా “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ” ఉండబోతుంది : టీజీ విశ్వ ప్రసాద్

tgv 3 e1681753786724

 

మాచో హీరో గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.ఇదివరకే వీరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం,లౌక్యం సినిమాలు మంచి హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ కాంబినేషన్ గా వస్తున్న “రామబాణం” మే 5 న రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మా  18f మూవీ  రిపోర్టర్ తో ముచ్చటించారు.

పేరుకు తగ్గట్టుగానే “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ” లో ఇన్ని ఎక్కువ సినిమాలు ఎలా.?

tgv 1

మా కాన్సెప్ట్ ఏ ఫ్యాక్టరీ లా సినిమాలు చెయ్యాలని, ఒక ఐదు సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ ఉంటుంది అనే కాన్సెప్ట్ నాది. అదే అడాప్ట్ చేసాం.

బాలకృష్ణ గారు చెప్పారు అని ఈ టైటిల్ పెట్టారా.?

టైటిల్స్ చాలా రోజులు నుంచి చూస్తున్నాం.బాలకృష్ణ గారు ఇది చూస్ చేసారు. బేసిక్ గా బ్రదర్ సెంటిమెంట్ ఫిల్మ్ ఇది. ఫుల్ లెన్త్ యాక్షన్ ఉంటుంది. అలానే ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంటుంది.

ఈ సినిమా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది.? అవుట్ ఫుట్ చూసాక మీ ఫీలింగ్ ఏంటి.?

tgv 2

దాదాపు ఈ మూవీ వన్ ఇయర్ ప్రొడక్షన్ లో ఉంది. లాస్ట్ ఇయర్ మే లో ఒక షెడ్యూలు జరిగింది. తరువాత హీరో గారికి చిన్న ఇంజ్యురి అవ్వడం.తరువాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కొన్నిరోజులు బ్రేక్ ఇవ్వడం వలన ఇంతవరకు వచ్చింది. వేసవిగా రిలీజ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాం. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. కంటెంట్ వైజ్ వి ఆర్ హ్యాపీ.

మీది సినీ రంగంలో పెద్ద ప్రొడక్షన్ కంపెనీ. అలానే ఓటిటి , ఎగ్జిబిషన్ సైడ్ వెళ్లే ప్లాన్ ఉందా.?

ఓటిటి కి ప్రజెంట్ కంటెంట్ చేస్తున్నాం. సినిమాకి సంబంధించిన దేనికైనా మేము ఇన్వెస్ట్ చేసి ముందుకు వెళ్తాము.

tgv 6

పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ఏంటి అనుకుంటున్నారా.?

టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు అండి.

మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారా.?

నాకు సినిమా ఇన్స్పిరేషన్ అండి. పర్టిక్లర్ ఒక పర్సన్ ఇన్స్పిరేషన్ అంటూ కాదు కానీ, 100 సినిమాలను నిర్మించే ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ గా ఆ మైల్ స్టోన్ అయితే అచీవ్ చేస్తాం.

tgv 5

దాదాపుగా పదేళ్లు ప్రొడ్యూసర్ జర్నీ ఎలా అనిపిస్తుంది.?

యాక్టీవ్ గా ప్రొడక్షన్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది. మంచి సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. మధ్యలో కోవిడ్ వలన ఒక వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది.

tgv 1 e1681753889669

మీ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా.?

గూఢచారి – 2 లాంచ్ చేసాం కదండీ. ఆన్ సెట్స్ వెళ్ళడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. కార్తికేయ-3 ప్లాన్ లో ఉంది. చందు గారికి ఇంకొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయ్. అవి అయ్యాక చూడాలి.

# కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *