adikeshava vaishnav tej e1684177651755

 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలు మంచి కంటెంట్‌తో పాటు మంచి విలువలతో ప్రేక్షకులను అలరించే చిత్రాలను నిర్మిస్తున్నాయి.

 పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పంజా వైష్ణవ్ తేజ్ తన కెరీర్‌లో తొలిసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని చేస్తుండటం విశేషం.

పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో నాలుగో చిత్రంగా రూపొందుతోన్న ఈ అదిరిపోయే యాక్షన్ ఫిల్మ్ ‘PVT04’కి ‘ఆదికేశవ’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ సోమవారం నాడు చిత్ర బృందం ఓ భారీ యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ ను విడుదల చేసింది.

aadhi kesav

ఆదికేశవ గ్లింప్స్ లో పంజా వైష్ణవ్ తేజ్ మనకు రుద్రగా పరిచయం అయ్యాడు. ఒక చిన్న గ్రామంలో గూండాలు శివాలయాన్ని ఆక్రమించాలని చూస్తుండగా, రుద్ర వారిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ గొడవ ఎక్కడికి దారి తీసింది?, ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తిని కలిగించేలా గ్లింప్స్ ఉంది.

aadhi kesav ౩

గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా గ్లింప్స్ ని ముగించిన తీరు ఆకట్టుకుంది. రుద్రగా పంజా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం చూపించారు. లుక్స్, యాక్షన్ తో అదరగొట్టారు. పవర్ ఫుల్ యాక్షన్ పాత్రలో తేలికగా ఒదిగిపోయారు. ఇది అసలు ఆయనకు మొదటి యాక్షన్ ఫిల్మ్ అనే భావన మనకు కలగదు.

అందరి మనసులను దోచుకునే అందమైన చిత్ర పాత్రలో శ్రీలీల నటిస్తుండగా, వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ నటిస్తున్నారు.

aadhi kesav 2

ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో ఆయన అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఆదికేశవ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్‌ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. గ్లింప్స్ కి ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను పెంచేసింది.

జూలై నెలలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

తారాగణం:

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, అపర్ణా దాస్, జోజు జార్జ్ తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి
సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్
నిర్మాతలు: ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
డీఓపీ: డడ్లీ
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *