Meet Cute Pre-Release Function: “మీట్ క్యూట్” మనసుకు హాయినిచ్చే బ్యూటీఫుల్ ఎంథాలజీ : “మీట్ క్యూట్” ప్రీస్ట్రీమింగ్ సెలెబ్రెషన్స్ లో నేచురల్ స్టార్ నాని

MEET CUTE TEAM AT STAGE e1669124411992

 

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఎంథాలజీ “మీట్ క్యూట్”. నాని సోదరి దీప్తి గంటా ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా ప్రధాన పాత్రలు పోహిస్తున్న ‘మీట్ క్యూట్” ఎంథాలజీ ” నవంబర్ 25న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

MEET CUTE CELEBRATIONS

ఈ నేపధ్యంలో ‘మీట్ క్యూట్” ‘మీట్ క్యూట్” ప్రీస్ట్రీమింగ్ సెలెబ్రెషన్స్ గ్రాండ్ గా జరిగాయి.

NANI SPEECH AT MEET CUTE

హీరో నాని మాట్లాడుతూ.. ‘మీట్ క్యూట్” చాలా క్యూట్ ఎంథాలజీ. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. ఇందులో ఐదు కథలు వున్నాయి. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ కథలో సత్యరాజ్ గారు, రుహాని రాజా చాలా అద్భుతంగా చేశారు.

ఇందులో చాలా లైఫ్ లెసన్స్ వున్నాయి. సందేశంలా కాకుండా చాలా చిన్న విషయాలని చాలా సెటిల్ద్ గా అందంగా ప్రజంట్ చేసే కథ ఇది. ‘ఎక్స్ గర్ల్ ఫ్రెండ్’ కథలో సంచిత, జిపి, సునయన చాలా బ్యూటీఫుల్ గా చేశారు. అందరూ రిలేట్ చేసుకుంటారు.

NANI DEEPTI PRASANTHI

ఒక షాకింగ్ ట్విస్ట్ కూడా వుంది. ‘స్టార్స్ట్రక్’ లో అదా, శివ చాలా క్యూట్ గా ఫెర్ ఫార్మ్ చేశారు. ఇది నా ఫేవరేట్ కథలలో ఒకటి. చాలా అందమైన కథ. అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. చాలా ఎంజాయ్ చేస్తారు. ‘మీట్ ది బాయ్’ లో వర్ష, అశ్విన్ కథ చాలా స్పెషల్. ఇందులో మా పిన్ని, అంజు కూడా డబ్బింగ్ చెప్పింది.

నేను అక్కని పరిచయం చేస్తే అక్క మా ఫ్యామిలీని పరిచయం చేస్తోంది. ఈ కథలో చాలా బ్యూటీఫుల్ మూమెంట్స్ వున్నాయి. ‘ఇన్ లా’కథలో రోహిణి గారు, ఆకాంక్ష, దీక్షిత్ చేశారు. కాబోయే అత్తా కోడలికి మధ్య జరిగే క్యూట్ కథ. అక్క చాలా అందంగా రాసింది. అంతే అందంగా ఫెర్ ఫార్మ్ చేశారు.

MEET CUTE DEEPTI NANI ROHINI AND PRASANTHI

చాలా మంచి కంటెంట్ వున్న ఎంథాలజీ ఇది. చాలా మంచి టెక్నికల్ టీం ఈ ఎంథాలజీకి పని చేసింది. అందరికీ పేరుపేరునా థాంక్స్. నేను లెక్కల్లో వీక్. ప్రశాంతి చాలా స్ట్రాంగ్. నేను నా పనిని ప్రశాంతంగా చేయగలుగుతున్నా అంటే కారణం ప్రశాంతి నాకిచ్చిన నమ్మకం. విజయ్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.

MEET CUTE TEAM AT STAGE e1669124411992

అక్కని చూస్తే చాలా గర్వంగా వుంది. చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసింది. . ‘మీట్ క్యూట్” చాలా హాయిని ఇచ్చే ఎంథాలజీ. ఈనెల 25 తర్వాత మీరు ఎప్పుడైన అలసటగా ఫీలౌతుంటే ఓ సాయంత్రం పూట సరదాగా కూర్చుని ‘మీట్ క్యూట్” పెట్టుకొని చూడండి. చాలా హాయిగా నిద్రపోతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు”అన్నారు.

DEEPTI SPEECH AT MEET CUTE

దీప్తి గంటా మాట్లాడుతూ.. నాని లేకుండా ‘మీట్ క్యూట్” ప్రాజెక్ట్ లేదు. నాని లేకపోతే నేను దర్శకురాలిని అయ్యేదాన్నే కాదు. నాని ఈ ప్రాజెక్ట్ కి సంబధించిన ప్రతి అడుగులో నా వెంట వున్నారు. ప్రశాంతి నాపై ఎంతో నమ్మకం వుంచి ప్రాజెక్ట్ ని నిర్మించారు.

రోహిణి, అదా , వర్ష , ఆకాంక్ష , రుహాని, సునైనా.. అందరూ తమ పాత్రలని అద్భుతంగా చేశారు. వారి నుండి ఎంతో నేర్చుకున్నాను. సత్యరాజ్ గారు, అశ్విన్, శివ , దీక్షిత్, జిపి .. అందరూ గ్రేట్ కన్విక్షన్ తో చేశారు. కథే ఇందులో హీరో. సత్యరాజ్ గారితో పని చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన చాలా ధైర్యాన్ని ఇచ్చారు.

వినయ్ తో పాటు నా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ అందరికీ థాంక్స్. వసంత వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఎడిటర్ గ్యారీ గ్రేట్ వర్క్ అందించారు. విజయ్ చాలా అందమైన మ్యూజిక్ ఇచ్చారు. తనకి చాలా మంచి ఫ్యూచర్ వుంటుంది.

అవినాష్ వండర్ ఫుల్ ఆర్ట్ వర్క్ చేశారు. 25 నుండి మీట్ క్యూట్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. చాలా ఎంజాయ్ చేస్తూ ‘మీట్ క్యూట్” చేశాం. మీరు చూసి అంతే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

PRASANTHI SPEECH AT MEET CUTE

ప్రశాంతి తిపిర్నేని మాట్లాడుతూ.. దర్శకురాలు దీప్తి మరియు టీం తో కలసి మీట్ క్యూట్ ని నిర్మించడం చాలా గర్వంగా వుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు” తెలిపారు.

గోవింద్ పద్మసూర్య మాట్లాడుతూ .. చాలా మంచి స్టార్ కాస్ట్ ఉన్న ఈ సిరిస్ లో నటించడం చాలా అనందంగా వుంది. ఇంత మంచి సిరిస్ నాని, దీప్తి గారి వలనే సాధ్యమైయింది. దీప్తి చాలా మంచి కంటెంట్ రాశారు. సిరిస్ చాలా బ్యూటీఫుల్ గా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

MEET CUTE TEAM

అదా శర్మ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ లో అవకాశం ఇచ్చిన నాని, ప్రశాంతి, దీప్తికి కృతజ్ఞతలు. ఇలాంటి పాత్రని ఇదివరకెప్పుడు చేయలేదు. మీట్ క్యూట్ టీంతో కలసి పని చేయడం చాలా అనందంగా వుంది” అన్నారు

RAJ KANDUKURI SPEECH AT MEET CUTE

శివ కందుకూరి మాట్లాడుతూ.. మీట్ క్యూట్ సిరిస్ నాకు చాలా స్పెషల్. నాని, దీప్తి, నిర్మాత ప్రశాంతి గారికి కృతజ్ఞతలు. చాలా మంచి టెక్నికల్ టీం ఈ ప్రాజెక్ట్ కి పని చేసింది. దీప్తి అక్క చాలా మంచి కంటెంట్ రాశారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సిరిస్ చేశాం. చూసే ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను” అన్నారు,.

VARSHA SPEECH AT MEET CUTE

వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ‘మీట్ క్యూట్” నిజాయితీ గల కథల సమాహారం. దీప్తి గారు అద్భుతంగా డైరెక్టర్ చేశారు. చాలా అందమైన సంభాషణలు ఇందులో వున్నాయి. నాని గారు చాలా స్వీట్ పర్శన్. చాలా సపోర్ట్ చేశారు. ప్రశాంతి గారికి థాంక్స్. ‘మీట్ క్యూట్’ మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు

రోహిణి మాట్లాడుతూ.. కొత్త దర్శకులతో పని చేయడం ఎప్పుడూ ఎక్సయిటింగా వుంటుంది. చాలా అరుదుగా ఇలాంటి పాత్రలు దొరుకుతాయి. ఈ సిరిస్ చూసిన తర్వాత దీప్తి నాని అక్కగానే కాకుండా మంచి రచయితగా, దర్శకురాలిగా పేరు తెచ్చుకుంటుంది. అందమైన ఐదు కథల సమాహారం మీట్ క్యూట్. అందరూ తప్పకుండా చూడాలి”అని కోరారు.

ASWIN SPEECH AT MEET CUTE

రాజా మాట్లాడుతూ.. మీట్ క్యూట్ ని దీప్తి అక్క అద్భుతంగా రాశారు. ప్రతి పాత్ర నిజాయితీగా వాస్తవానికి దగ్గర గా వుంటుంది. మాటలు అద్భుతంగా వుంటాయి. ప్రతి ఎపిసోడ్ అందంగా వుంటుంది. ఇంత మంచి సిరిస్ ని నిర్మించిన నాని గారికి కృతజ్ఞతలు.

మీట్ క్యూట్ మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు. ఈ ఈవెంట్ లో వసంత్, రుహని శర్మ అశ్విన్ కుమార్, ఆకాంక్ష సింగ్, దీక్షిత్ శెట్టి, విజయ్, సంచిత, తదితరులు పాల్గొన్నారు.

తారాగణం – సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా

రచన, దర్శకత్వం: దీప్తి గంటా
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
సమర్పణ: నాని
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
డీవోపీ: వసంత్ కుమార్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: గ్యారీ బిహెచ్
లిరిక్స్ : కెకె
పీఆర్వో: వంశీ-శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *