నితిన్ “తమ్ముడు” మూవీ రిలీజ్ డేట్ ఖరారు!

IMG 20241104 WA0163 e1730736559591

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ రోజు “తమ్ముడు” సినిమా రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

“తమ్ముడు” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాగడా చేత పట్టిన నితిన్, భుజానికి పాపను ఎత్తుకుని పరుగెడుతూ రావడం, ఆయనతో పాటు ఊరి ప్రజలు కూడా కాగడాలతో వెంటే వస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ రిలీజ్ డేట్ పోస్టర్ “తమ్ముడు” సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచుతోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. ఈ చిత్రంలో లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా..దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో తమ్ముడు సినిమా రిలీజ్ కు వస్తుండటం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

నటీనటులు :

నితిన్, లయ, తదితరులు

టెక్నికల్ టీమ్:

సినిమాటోగ్రఫీ – కేవీ గుహన్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, మ్యూజిక్ – అజనీష్ లోకనాథ్,పీఆర్వో – వంశీ కాకా, జీఎస్ కే మీడియా, బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్నిర్మాత – దిల్ రాజు, శిరీష్, రచన -దర్శకత్వం – శ్రీరామ్ వేణు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *