మూవీ: Mr. కింగ్ (Mr. King)
విడుదల తేదీ : 24-02-2023
నటీనటులు: శరణ్ కుమార్, యస్విక నిష్కల, ఉర్వి సింగ్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సునీల్
దర్శకుడు : శశిధర్ చావలి
నిర్మాతలు: బి.ఎన్. రావు
సంగీత దర్శకులు: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: తన్వీర్ అంజుమ్
ఎడిటర్: శశిధర్ చావలి

Mr. కింగ్ సినిమా రివ్యూ (Mr. King Movie Review):
ఈ శుక్రవారం సినిమా థియేటర్స్ లోకి చాలా చిన్న చిత్రాలు అయితే ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చాయి. అందులో ఘట్టమనేని కృష్ణ – విజయనిర్మల ఫ్యామిలీ మెంబర్ గా పరిచయం అవుతున్న కొత్త నటుడు శరన్ కుమార్ హీరోగా నటించిన చిత్రం “మిస్టర్ కింగ్” కూడా ఒకటి.
మరి ఈ శరన్ కుమార్ మిస్టర్ కింగ్ గా తెలుగు సినీ ప్రేక్షకులను ఎలా మెప్పించాడో మా 18f మూవీస్ టీం సమీక్షలో చదివి తెలుసుకుందాము రండి.
కధ ను పరిశీలిస్తే (story line):

మిస్టర్ కింగ్ సినిమా కథలోకి వెళ్తే .. శివ(శరన్ కుమార్) తనకంటూ కొన్ని విలువలు పెట్టుకొని తన లక్ష్యం దిశగా సాగాలని చూస్తాడు. వైమానిక రంగంలో ఏరో నాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఫ్లైట్ ఇంజిన్ ప్రాజెక్టు తీసెస్ చేస్తూ వైమానిక రంగంలో ఇప్పటి వరకూ ఆచరణ లో లేని ఓ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ చేసి తన కల నెరవేర్చుకోవాలని చూస్తాడు.
ప్రాజెక్టు సక్సెస్ అయ్యేవరకు తల్లి దండ్రుల మీద అదరపడకుండా ఎఫ్ఎం రేడియొ స్టేషన్ లో ఆర్ జె గా చేస్తూన్న క్రమంలో తన లైఫ్ లోకి ఉమాదేవి(యస్విక నిష్కల) అలాగే వెన్నెల(ఉర్వీ సింగ్) లు వస్తారు.
ఇలా తన లైఫ్ లోకి వచ్చిన ఇద్దరు అమ్మాయి లు తో తన లైఫ్ ఎలా టర్న్ అయ్యింది?
శివ పెట్టుకున్న లక్ష్యం ఏంటి? అది సాదించడం లో ఈ అమ్మాయి లు అడ్డు పడ్డారా ? సహాయం చేశారా ?
తాను చేపట్టిన ప్రాజెక్ట్ ఏంటి?
ఇంతకీ తన లక్ష్యాన్ని తాను చేరుకున్నాడా లేదా ? అనేది మిగతా కథ.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (screen – Play):

అసలు ఈ మిస్టర్ కింగ్ సినిమాలో సరైన కథా కథనాలు ఎక్కడా కనిపించవు. చాలా పేలవమైన లైన్ దానికి మించి పేలవమైన కధనం ( స్క్రీన్ ప్లే) తో ఉన్న సీన్స్ ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. ఈ Mr. King సినిమా లో మెప్పించే అంశాలు కన్నా బాగా నిరుత్సాహ పరిచే కధనం తో కూడిన అంశాలు ఎక్కువ ఉంటాయని చెప్పాలి.
పైగా ఈ చిత్రం లో అనవసరమైన సీన్స్ చాలా నే ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలు సినిమా నిడివి పెంచడానికే తప్ప ఏది ఎంగేజింగ్ గా ఉండదు. దీనితో ఆడియెన్స్ చాలా బోర్ ఫీల్ అవుతారు. అలాగే సినిమాలో సునీల్ లాంటి మంచి నటుణ్ని సరిగ్గా వాడుకోలేదు అనే చెప్పాలి, పైగా మురళీ శర్మ పాత్ర కి తన సొంత డబ్బింగ్ కూడా లేదు.
అలాగే సినిమాలో చాలా చోట్ల కొన్ని సీన్స్ ఎందుకు వస్తున్నాయో తెలియదు. అలాగే సినిమాలో పాటలు కూడా ఏమంత ఆకట్టుకునేలా ఉండవు.
ఓవరాల్ గా అయితే ఈ మిస్టర్ కింగ్ పరమ బోరింగ్ ఫ్యామిలీ డ్రామా, ట్రై యాంగిల్ లవ్ స్టోరీ, యూత్ కి కనెక్ట్ కానీ పరమ బోరింగ్ సినిమా గా చెప్పవచ్చు.
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

దర్శకుడు: శశిధర్ చావలి, ఈ మిస్టర్ కింగ్ సినిమాకి కథ దర్శకత్వం వహించగా, ఏ అంశంలో కూడా తాను సరైన అవుట్ పుట్ ఇవ్వలేక పోయాడు. చాలా రొటీన్ అండ్ బోరింగ్ ట్రీట్మెంట్ తో సినిమాని నడిపి థియేటర్ లో ఉన్న ఆడియెన్స్ కి చికాకు తెప్పిస్తాడు. కధ లేదు అందులో ఉన్న కధ కి సరైన స్క్రీన్ ప్లే లేదు, ఆకట్టుకునే సీన్స్ లేవు, ఓవరాల్ గా దర్శకుడు వర్క్ ఏమీ బాగాలేదు
హీరో: ఈ సినిమాతో ఘట్టమనేని ఫ్యామిలీ నుండి పరిచయం అవుతున్న యువ నటుడు శరన్ కుమార్ డీసెంట్ పెర్ఫామెన్స్ అందించాడు. తనకంటూ కొన్ని విలువలు ఉన్న కుర్రాడిలా బాధ్యతలతో బాగా నటించాడు.
హీరోయిన్స్: అలాగే సినిమాలో కనిపించిన యశ్విక మరియు ఉమా దేవి లు కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు. అలాగే తమ లుక్స్ కూడా సినిమాలో బాగున్నాయి.
అతిది పాత్ర లో కనిపించిన కమెడియన్ వెన్నెల కిషోర్ మంచి కామెడీ టైమింగ్ తో మంచి నటన ప్రదర్శించాడు.
ఇతర పాత్రలలో సీనియర్ నటులు మురళి శర్మ మరియు తనికెళ్ళ భరణి లాంటి నటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు. అక్కడక్కడా కొన్ని సీన్స్ పర్వాలేదనిపించేలా వారు ఆకట్టుకొనే నటన తో మెప్పించారు.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

ఈ సినిమాలో విశయం లో నిర్మాణ విలువలు ఒకే పర్వాలేదు అనేలా ఉన్నాయి. మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే తన్వీర్ అంజుమ్ సినిమాటోగ్రఫీఒకే అనిపిస్తుంది.
శశిధర్ చావలి ఎడిటింగ్ బాగాలేదు. ఇంకా విశ్లేషణ చేసే అంత సినిమా కాదు ఈ మిస్టర్ కింగ్.
18F మూవీస్ టీం ఒపీనియన్:

“మిస్టర్ కింగ్” సినిమా తో తెలుగు సినీ పరిశ్రమ లోకి వచ్చిన కొత్త నటుడు శరన్ కుమార్ నటుడిగా పర్వాలేదు అనే ల ఉన్నాడు. కానీ అసలు Mr. కింగ్ సినిమాలో ఫామిలి కా, లవర్స్ కా లేదా స్టూడెంట్స్ కా అనే క్లారిటీ లేకుండా సాగిన బోరింగ్ డ్రామా.
ఎలాంటి ఆకట్టుకునే సీన్స్ లేకుండా బోరింగ్ మెలో డ్రామా కథ తో అంతే ఆర్టిఫీషియల్ గా నడిచే కథనం తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెట్టేలా ఉంది. ఈ వారాంతానికి అయితే ఈ మిస్టర్ రాజా ని మర్చి పోవడమే మంచిది. డబ్బుతో పాటూ సమయం కూడా వృదా !.
టాగ్ లైన్: బోరింగ్ డ్రామా రాజా !

18f Movies రేటింగ్: 1.75 / 5
* కృష్ణ ప్రగడ.