మూవీ: గాలోడు
విడుదల తేదీ : నవంబర్ 18, 2022
నటీనటులు: సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటించగా.. సప్తగిరి, పృథ్విరాజ్, శకలక శంకర్, సత్య క్రిష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు
కధ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకుడు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల
నిర్మాత: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల
సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: సి రాంప్రసాద్
బుల్లి తెర అందగాడు సుడిగాలి సుధీర్ నటించిన ‘గాలోడు’ మూవీ ఎన్నో అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో ఈ సినిమా షోలు పడిపోయాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఈ సినిమాపై తమ అభిప్రాయాలు చెప్తున్నారు.
అయితే, ఈ చిత్రం విషయంలో కొందరు బాగుందని అంటుంటే.. మరికొందరు ఏవరేజ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.l
మొదటి అంకం రెండవ అంకం పరిశీలిస్తే:
సుడిగాలి ‘గాలోడు’ మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే మొదటి అంకం (ఫస్టాఫ్) మొత్తం పాత్రల పరిచయం, ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లేందుకు కొంత టైమ్ తీసుకున్నారట. కానీ, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయేలా ఉంటుందట.
ఇక రెండవ అంకం (సెకెండాఫ్) మాత్రంమొత్తం మాస్ ట్రీట్మెంట్ , యాక్షన్ సీక్వెన్స్‌తో ఉంటుందని తెలిసింది. కానీ, ఆకరి ఘట్టం (క్లైమాక్స్) మాత్రం కొత్తగా లేకపోవడంతో తేలిపోయినట్లు అనిపిస్తుందని సోషల్ మీడియా టాక్. ఇంకా కొంత సేపతిలో మా 18 f మూవీ ఒపీనియన్ అండ్ పబ్లిక్ టాక్ వస్తుంది గా ….
మొత్తం సినిమా పరిశీలిస్తే:
సోషల్ మీడియా ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. సుధీర్ నటించిన ‘గాలోడు’ మూవీ ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే వ్యక్తి సమస్యల్లో పడి సిటీకి రావడం.. సిటీ లో కూడా సమస్యలను ఎదుర్కోవడం అనే అంశాలతో తెరకెక్కింది.
ఓవరాల్ గా అదే మొత్తంగా పాత రొటీన్ కథే అయినా మాస్ ట్రీట్‌మెంట్ కొత్తగా ఉండేలా చేశారట. ఇక, సుధీర్ కోసం అయితే ఈ సినిమా చూడొచ్చని అంటున్నారు సోషల్ మీడియా బ్యాచ్.
నటి నటుల నటన పరిశీలిస్తే:
గాలోడు గా నటించిన సుడిగాలి సుధీర్ హిట్ కొట్టాడా అంటే ఇప్పటి వరకూ అందుతోన్న సమాచారం ప్రకారం.. ‘గాలోడు’ మూవీకి ఏబో ఏవరేజ్ టాక్ వచ్చినట్లు తెలిసింది.
సుడిగాలి సుధీర్ ని ఇష్టపడే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మెచ్చే అంశాలు మాస్ మీటర్ లో ఉన్నాయట. కాబట్టి సుధీర్ కామిడీ ఇస్టపడే వాళ్లను థియేటర్లకు రప్పించుకోగలిగే టాక్ వస్తే మాత్రం సుడిగాలి సుధీర్ గాలోడు కి కలెక్షన్లు వచ్చి సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.
టికెట్ లు ఎన్ని తేగాయి అంటే:
సుడిగాలి సుధీర్ నటించిన ‘గాలోడు’ మూవీకి మల్టీ ఫ్లేక్స్ అడ్వాన్స్ బుకింగ్ బాగున్నాయని తెలిసింది. ఈరోజు ఉదయం 6 గంటల వరకూ ఈ మూవీ బుకింగ్స్ ద్వారా రూ. 2 5 నుండి 30 లక్షలు వసూలు చేసిందని సమాచారం.
గాలోడు సినిమాలో కొత్తదనం ఉండక పోయినా, నీకు హిట్ అందించేందుకు ప్రయత్నిస్తామని సుడిగాలి ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ట్విట్స్ చేస్తున్నారు. గాలోడు’ని ట్విటర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
18 ఫ్ టీం ఒపీనియన్:
కొద్ది సేపటి లోనే మా రివ్యూ లో ఉంటుంది.
సోషల్ మీడియా రేటింగ్: 2.5 /5
- కృష్ణ ప్రగడ..