గాలోడు సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షో అయిపోయింది. సుడిగాలి సుధీర్ ఫాన్స్ అండ్ కామన్ ఆడియన్స్ పబ్లిక్ టాక్ విందామా ?
గాలోడు సినిమా రివ్యూ అదే సమీక్ష మీ కోసం మరలా. చదవండి.
మూవీ: గాలోడు
విడుదల తేదీ : నవంబర్ 18, 2022
నటీనటులు: సుడిగాలి సుధీర్, సప్తగిరి, షకలక శంకర్, సత్య క్రిష్టన్, పృథ్వీరాజ్ తదితరులు నటించారు
కథ, కథనం, మాటలు, దర్శకత్వం : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల
నిర్మాత: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల,
సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరొలియో
ప్రొడక్షన్ డిజైన్ & సినిమాటోగ్రఫీ: సి.రామ్ ప్రసాద్
ఎడిటర్ : ఎమ్మెస్సార్
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) సోలో హీరోగా వస్తోన్న రెండో సినిమా ‘గాలోడు’ (Gaalodu) ఈ రోజు విడుదల అయ్యింది.
సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో హీరోగా మారిన ‘జబర్దస్త్’ కమెడియన్, టీవీ యాంకర్ సుడిగాలి సుధీర్.. ఇప్పుడు ‘గాలోడు’ అనే మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా తో వస్తున్నాడు.
‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమా ద్వారా సుధీర్‌ను హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ‘గాలోడు’ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు.
ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌కు యూట్యూబ్‌లో 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
గాలోడు’ కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. సుధీర్ ఇమేజ్‌ను దాటి వెళ్లిన సినిమా ఇది. ఇప్పటి వరకు సుధీర్‌ను ప్రేక్షకులు కమెడియన్‌గానే చూశారు. కానీ, ఈ సినిమాలో మాస్ హీరోగా చూడబోతున్నారు. మరి ఆయన్ని తెలుగు ప్రేక్షకులు ఏ మేర ఆదరిస్తారో ఇంకో రెండు రోజులలో తెలిసిపోతుంది.
కథ ని పరిశీలిస్తే:
రజనీకాంత్ (Sudigaali Sudheer) చిన్న ఊర్లో పనీ పాటా లేకుండా ఖాళీగా గాలి కి తిరుగుతూ ఉంటాడు. దీంతో అందరూ సుధీర్‌ని గాలోడు అంటూ ఉంటారు. ఒక గొడవలో అనుకోకుండా సర్పంచ్ కొడుకు చనిపోతాడు. ఆ కేసు రజనీకాంత్‌పై పడుతుంది. దీంతో ఊరి నుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకొంటాడు గాలోడు.
హైదరాబాద్ సిటీలో గాలిలో ఎలా బతకాలి అని ఆలోచిస్తూ గుడి దగ్గర బిచ్చగాళ్ల డబ్బులు దొంగిలిస్తూ, గుడిలో పెట్టె ప్రసాదం తింటూ మరలా గాలికి బతుకుతుంటాడు. ఆ సమయంలోనే శుక్ల (Ghehana Shippy) పరిచయం అవుతుంది.
వీరిద్దరూ ప్రేమలో పడతారు. శుక్ల తన ఇంట్లోనే రజనీకాంత్‌కు పని ఇప్పిస్తుంది. ఇంతలో ఒకరోజు పోలీసులు వచ్చి రజనీకాంత్‌ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.
ఆ తర్వాత రజనీకాంత్ ఏంచేశాడు?
రజనీకాంత్, శుక్ల ఒక్కటయ్యారా?
రజినీకాంత్ మరలా తన ఊరు వెళ్లాడా ?
రిచ్ అమ్మాయిని గాలోడు ఎలా ప్రేమ లో పదేశాడు ?
అనేది మిగతా కథ.
కధ కధనం (SCREENPLAY) పరిశీలిస్తే:
సుడిగాలి సుధీర్ డ్యాన్స్‌లు, రొమాన్స్ మరియు కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. కానీ బుల్లి తెరకు, సిల్వర్ స్క్రీన్‌కు చాలా తేడా ఉంటుంది. ఒక చిన్న స్కిట్ చేసి మెప్పించడం వేరు. రెండు గంటల సినిమా తీసి ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడం వేరు అనేది తెలుసుకోవాలి.
ఇప్పటికే రెండు సినిమాలు చేసి ఎదురు దెబ్బలు తిన్నా సుధీర్‌కి vendi తెర లాజిక్ మరియు స్క్రీన్ తత్వం ఇంకా బోధపడలేదు.
గాలోడు కధకుడు రాజశేఖర్ రెడ్డి సినిమాను కాస్త ఆసక్తికరంగానే ప్రారంభిస్తాడు. జైల్లో సుడిగాలి సుధీర్ ఇంట్రడక్షన్, తన పాత్రకు ఇచ్చే బిల్డప్ ఆసక్తిని కలిగిస్తుంది. ఎప్పుడైతే సినిమా ఫ్లాష్ బ్యాక్ దారి పట్టిందో అప్పుడే కధనం దారి తప్పింది.
గాలోడు సినిమా హీరో పాత్ర ఏ లక్ష్యం లేకుండా గాలికి తిరిగేది అలాంటి గాలి గాడు, కోటీశ్వరుల ఇంటికి ఏకైక వారసురాలు అయిన హీరోయిన్ కి అట్రాక్ట్ అవ్వడం, వీరి మధ్య వచ్చే సన్నివేశాలు మరి అతికినట్టు గా ఉన్నాయి.
హీరోయిన్ ఎందుకు హీరోని ప్రేమించిందో చెప్పే ఒక్క సన్నివేశం కూడా సినిమాలో లేకపోవడం కధ స్క్రీన్ ప్లే అందించిన దర్శకుడు విజన్ లోపం అనాలా ?
ఇంకా సప్తగిరి, షకలక శంకర్‌ల పాత్ర ల కామెడీ నవ్వించకపోగా విసిగిస్తాయి. పాటలు కయిత్రికరణ, యాక్షన్ సన్నివేశాలు డిజైన్ ఉన్నంతలో పర్వాలేదనిపిస్తాయి. ‘నువ్వు శనివారం పుట్టావా? నీకెలా తెలుసు… శనిలా తగులుకుంటేనూ…’ ఇది సినిమాలో ఒక డైలాగ్. రచయతల సెన్సాఫ్ హ్యూమర్ ఇలా గాలికి వదిలేసి ప్రేక్షకులను సుడిగుండం లోకి నెట్టేశారు.
ఇలాంటి పంచ్‌ల దగ్గరే గాలోడు కధనం ఆగిపోయింది. ఇక ఆఖరి ఘట్టం లో వచ్చే కోర్టు సీన్ అయితే ఇంతకు ముందు, ఎంకెప్పుడూ అదే సరిలేరు ని కెవ్వరు లో డైలాగ్ లో చెప్పాలి అంటే ‘నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’ అనుకోవచ్చు.
తామిద్దరం ప్రేమించుకుంటున్నామని కోర్టులో హీరో, హీరోయిన్లు చెప్పాక మీ ప్రేమలో నిజాయితీని నిరూపించుకోమని జడ్జి అడగడం, వారి మాటలు ప్రభుత్వ ఖర్చులతో హీరో, హీరోయిన్ల పెళ్లి ఘనంగా చేయమని జడ్జి తీర్పు ఇవ్వడం, తామిక్కడే పెళ్లి చేసుకుంటామని కోర్టులోనే పెళ్లి చేసుకోవడం లాంటి సీన్లు నభూతో నభవిష్యత్ అని చెప్పాలి.
నటి నటుల నటన పరిశీలిస్తే:
మంచి కామిడీ పండించే సుడిగాలి సుధీర్ దగ్గర ఇంకా మంచి టాలెంట్ ఉంది. తను డ్యాన్సులు, ఫైట్లు బాగా చేస్తాడు. కానీ మొదటి, రెండవ అడుగులోనే మాస్ హీరో అయిపోవాలనుకుంటే దానికి సరైన మాస్ ఎమోషనల్ డ్రామా ఉన్న కథ ను ఎంచుకోవాలి.
ఇలాంటి చిల్లర కథ తీసుకుంటే మాత్రం ఆడియన్స్ గాలిలో కలిపేస్తారు. సినీ ప్రేక్షకులు సినిమాను చూసే విధానం కోవిడ్ తర్వాత చాలా మారిపోయింది.
మంచి కంటెంట్ ఉన్న అవుట్‌డేటెడ్ కథలతో వస్తే స్టార్లకు కూడా కనీస ఓపెనింగ్స్ రావడం లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పాటు తన టాలెంట్ ప్రదర్శించే స్కోప్ ఉన్న కథలను ఎంచుకుంటే సుడిగాలి సుధీర్ కచ్చితంగా సక్సెస్ అవుతాడు.
గెహనా సిప్పీ తెరపై అందంగా కనిపించింది. షకలక శంకర్, సప్తగిరిల కామెడీకి నవ్వడం కష్టమే. మిగిలిన నటులు తమ పాత్రకు తగ్గట్టు గా నటించారు.
సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే:
కెమెరా వర్క్ చాలా బాగుంది c రామ్ ప్రసాద్ అద్బుతంగా తీశారు. మ్యూజిక్ విశయం చూస్తే ఒకటి రెండు సాంగ్స్ మాత్రమే ఆకట్టుకొనెల ఉన్నాయి. గాలోడు ప్రొడక్షన్ వాల్యూస్ ఒకే అన్నట్టు ఉన్నాయి.
18 ఫ్ టీం ఒపీనియన్:
సుడిగాలి సుధీర్ ఫాన్స్ కి ఈ గాలోడు బాగా సినిమా నచ్చుతుంది. కథ తో సంబందం లేకపోయినా పాటలు, మాస్ సీన్స్ తో సినిమాలను ఆదరించే సినీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లవచ్చు. సుడిగాలి ఫాన్స్ కానీ సామాన్య ప్రేక్షకులు మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే.
గాలోడు సుడిగాలి తట్టుకోవడం కస్టమే…
18F MOVIE RATING: 2.5 / 5
- కృష్ణ ప్రగడ..