Mistery Movie Trailer Launched: వెంకట్ పులగం నిర్మించిన మిస్టరీ సినిమా ట్రైలర్ విడుదల !

IMG 20231008 WA0100 e1696763872170

 

పి.వి. ఆర్ట్స్ బ్యానర్ పైన వెంకట్ పులగం నిర్మాత గా తల్లాడ సాయికృష్ణ డైరెక్షన్ లో స్వప్న చౌదరి, సాయికృష్ణ హీరో హీరోయిన్లు గా సుమన్, అలీ, తనికెళ్ల భరణి , వెంకట్ దుగ్గిరెడ్డి, రవి రెడ్డి లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా” మిస్టరీ”.

ఈ సినిమా అక్టోబర్ 13 న థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

IMG 20231008 WA0099

డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ – కంటెంట్ ఉన్న సినిమాల్ని ప్రేక్షకులకు ఎల్లప్పుడూ అదరిస్తారు,మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ వెంకట్ పులగం, వెంకట్ దుగ్గిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు,అక్టోబర్ 13 న థియేటర్ లో విడుదల చేస్తున్నాం, ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

IMG 20231008 WA0098

హీరోయిన్ స్వప్న చౌదరి మాట్లాడుతూ– ఈ సినిమా లో నా పాత్ర కి ఆరు రకాల వెరీయేషన్స్ ఉంటాయి,టీం వర్క్ వలనే సినిమా అవుట్పుట్ బాగా వస్తుంది అని అనడానికి మా టీం నిదర్శనం.

జబర్దస్త్ ఫేమ్ – సత్య శ్రీ మాట్లాడుతూ ఈ సినిమా లో జర్నలిస్ట్ శ్వేత పాత్రలో చేస్తున్నాను, సీనియర్ నటులతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

IMG 20231008 WA0100

ఆకెళ్ల మాట్లాడుతూ– సినిమా అనుకున్న విధంగా తెరెక్కేడానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచిన మా నిర్మాతలకి ధన్యవాదాలు.

సినిమాటోగ్రఫర్ సుధాకర్ బార్ట్లే మాట్లాడుతూ 21 వర్కింగ్ డేస్ ల్ సినిమా ని పూర్తి చేసాం, త్రిల్లర్ కామెడీ అంశాల ని ఎక్కువగా సినిమా పెట్టాం..

సత్య శ్రీ, గడ్డం నవీన్, అకెల్లా, షన్ను, సి.కే.రెడ్డి, శోభన్ ,నేత లు నటిస్తున్న ఈ సినిమా కి కథ మాటలు- శివ కాకు,సాహిత్యం- శ్రీనివాస్ సూర్య, గానం- మనోజ్, సంగీతం- రామ్ తవ్వ , కెమెర – సుధాకర్ బార్ట్లే, ఎడిటింగ్ – సూర్య తేజ గంజి, డాన్స్ – సాగర్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *