మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా కుటుంబ సభ్యులు, మెగా అభిమానులకు మాత్రమే కాదు ఒక రకంగా తెలుగు రాష్ట్రాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు అందరూ ఓక పండుగ రోజులా జరుపుకుంటూ ఉంటారు.

ఇక ఈ ఏడాదికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు రేపు అంటే 22వ తేదీ జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరగబోతున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి బర్త్డే వేడుకల కార్యక్రమం మొదలు కాబోతోంది.

అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి మెగా హీరోలతో పాటు అనేక మంది సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరు కాబోతున్నారు.
ఈ సంత్సరమం వేడుకలు కనీ వినీ ఎరుగని విధంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరపాలని అఖిల భారత చిరంజీవి యువత నిర్ణయం తీసుకుంది.

ఈ మెగా వేడుకలు హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని JRC కన్వెన్షన్ హల్ లొ జరగనున్నాయి.