“మార్కో” మూవీ విజయం తో ‘కాట్టలన్’ ఫస్ట్ లుక్ ! 

IMG 20250302 WA0174 scaled e1740924573154

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ “మార్కో” విజయం తర్వాత క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షెరీఫ్ మొహమ్మద్ నిర్మించిన న్యూ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఆంటోనీ వర్గీస్ (పెపే) నటించిన ఈ చిత్రం వైలెన్స్ తో నిండిన మరో ఇంటెన్స్ థ్రిల్లర్ అని పోస్టర్ సూచిస్తుంది.

వర్షం కురుస్తుండగా, పడిపోయిన శవాలు, ఏనుగు దంతాల మధ్య పెపే నిలబడి ఉన్నట్లు పోస్టర్‌లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు.

IMG 20250302 WA0269

పాన్-ఇండియన్ చిత్రం “మార్కో” మాదిరిగానే కట్టలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ హై హ్యాలితీ విజువల్స్‌ను అందిస్తుంది. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, దాని రెండవ చిత్రం కోసం భారీ అంచనాలను పెంచుతుంది.

పోస్టర్ ఫాంట్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. గొడ్డలి, దంతాల వెనుక దాగి ఉన్న టైటిల్ ఫాంట్, సినీ అభిమానులు డీకోడ్ చేయడానికి అనేక అంశాలను కలిగి ఉంది. జైలర్, లియో, జవాన్, కూలి వంటి సినిమాలకు టైటిల్ డిజైన్లపై పనిచేసిన ఐడెంట్ ల్యాబ్స్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది.

IMG 20250302 WA0258

క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ తన మొదటి సినిమాతోనే కంటెంట్ డెలివరీ, మార్కెటింగ్‌లో ఒక బెంచ్‌మార్క్‌ను నెలకొల్పడంతో పాటు, తన మునుపటి చిత్రాల ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను గెలుచుకున్న పెపే మరోసారి కలిసి పనిచేయడంతో, హ్యుజ్ పాన్-ఇండియన్ సినిమా కోసం ఎదురుచూసేలా చేస్తోంది.

తారాగణం, టెక్నికల్ టీం త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తారు మేకర్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *