ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా లోనే మంచి బజ్ ని సంతరించుకొని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకొని జెట్ స్పీడ్ లో ప్రమోషన్స్ జరుపుకుంటూ మూడు రోజులలో రిలీజ్ కాబోతున్న మంగళవారం సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రి గా మారింది.
ఈ మంగళవారం సినిమాలొ యంగ్ అండ్ టాలెంటెడ్ నటి పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో తన డెబ్యూ దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో తెరకెక్కినది . ఈ సాలిడ్ రాస్థీక్ హారర్ థ్రిల్లర్ చిత్రం మంగళవారం ప్రేక్షకులను దియేటర్స్ లో భయపెట్టడానికి ఈ శుక్రవారం నుండే ప్రదర్శన కి సిద్దం అయ్యింది.
ఈ చిత్రం మేకర్స్ కి మొదటి సిన్మా అయినా ఖర్చుకి వెనకడుగు వేయకుండా ఓ రేంజ్ లో నిర్మించినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్స్ లో భాగంగా రోజు మీడియాని కలుస్తూ, ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఒక్కొకటిగా బయటకి వదులుతున్నారు.
ఆ ఇంటరెస్టింగ్ అప్ డేట్స్ లో భాగంగా చూస్తే నిన్న చిత్ర దర్శకుడు మరియు నిర్మాణం లో భాగమైన అజయ్ భూపతి ఈ సినిమా బడ్జెట్ కి సంబంధించి చిన్నగా రివీల్ చేసాడు. అజయ్ మాటల ప్రకారం ఈ చిత్రానికి 20 కోట్లు బడ్జెట్ అయ్యినట్టు గా తెలుస్తుంది.
ఈ రోజు చిత్ర నిర్మాతలు స్వాతి గునిపాటి, సురేష్ వర్మ మీడియా తో మాట్లాడుతూ, స్క్రిప్ట్ టైమ్ లో అనుకొన్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కవ బడ్జెట్ అయిన మాట వాస్తవం, కానీ ఇలాంటి స్క్రిప్ట్ తో బెస్ట్ క్వాలిటీ మూవీ చెయ్యాలి అంటే టాప్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయాలి కాబట్టి మేము కూడా ఎక్స్ట్రా బడ్జెట్ కి ఒకే చేశాము అన్నారు.
అదే మీడియా సమావేశంలో మరో మీడియా మిత్రుడు అడుగుతూ, ఈ మంగళవారం సినిమా మీకు రిలీజ్ కి 15 డేస్ ముందే టేబల్ ప్రాఫిట్ తెచ్చింది అంట కదా, అలానే మీ దగ్గర రైట్స్ కొన్నవాళ్ళు కొంచెం ఎక్కవ రేట్ కి రి-సేల్ చేస్తున్నారు అని వింటున్నాము.. ఇలా జరగం వలన మీకేమైన భాద ఉందా అని అడిగితే..
స్వాతీ, సురేశ్ వర్మ నవ్వుతూ మేము సినిమా కి అనుకొన్న దానికంటే ఖర్చు ఎక్కవ పెట్టినా మేము అనుకొన్న కంపార్ట్బూల్ ప్రైస్ కె మా ఫ్రెండ్స్ కి ఇచ్చాము. మా దగ్గర కొన్నవారు కూడా సంతోషంగా ఉండాలి కధా ! . రి-సేల్ జరగడం అనేది డిమెండ్ ని బట్టి ఉంటుంది.. రిలీజ్ కి ముందుగానే రైట్స్ అమ్మడం వలన మాకు ఎటువంటి భాద లేదు అంటూ చెప్పుకొచ్చారు. మా దగ్గర కొన్నవారు హ్యాపీ అయితే మేము కూడా హ్యాపీ నే అంటూ మీడియా. సమావేశం ముగించారు.
ప్రస్తుత టైమ్స్ లో అయితే ఈ తరహా హర్రర్ థ్రిల్లింగ్ చిత్ర నిర్మాణం లొ ఇది కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే వస్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే, మేకింగ్ లో ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టుగా కనిపించలేదు.
ఈ మంగళవారం చిత్రాన్ని ముధ్రా మీడియా వర్క్స్ , A క్రియేటివ్ వర్క్స్ మీద స్వాతి గునుపాటి మరియు సురేష్ వర్మ, అజయ్ భూపతి సంయుక్తంగానిర్మించగా ఈ నవంబర్ 17న మంగళవారం సిన్మా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలోనూ రిలీజ్ కాబోతుంది.