కన్నప్ప’ నుండి మాంచి ప్రేమ పాట వచ్చేసింది ! 

IMG 20250310 WA0134 scaled e1741607062527

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. శివా శివా శంకర పాట, రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండో టీజర్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి.

ఈ మూవీని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ లవ్ మెలోడీ సాంగ్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు.

విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ కనిపించే ‘సగమై.. చెరిసగమై’ అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను రేవంత్, సాహితి చాగంటి ఆలపించారు. స్టీఫెన్ దేవస్సీ బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది.

శ్రీమణి సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ చిత్రీకరించిన తీరు, ఇక ప్రభు దేవా, బృందా కొరియోగ్రఫీ చేసిన విధానం, విష్ణు మంచు-ప్రీతి ముకుందన్‌ను చూపించిన తీరు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది.

శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై ఆవిష్కరించబోతోన్నారు. విష్ణు మంచు కన్నప్పగా, అక్షయ్ కుమార్ శివుడిగా, ప్రభాస్ రుద్రుడిగా, కాజల్ పార్వతీ మాతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు.

మోహన్ బాబు, మోహన్‌లాల్, బ్రహ్మానందం వంటి అద్భుతమైన తారాగణంతో తెరకెక్కిన కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *