రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైన మంచు లక్ష్మి “దక్ష” ! 

IMG 20250918 WA0252 e1758188686941

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఈ సినిమాలో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

 తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ చిత్రంలో నటించడం విశేషం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ఈ సినిమా రేపు *( ఈనెల 19న)* వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా

డైరెక్టర్ వంశీకృష్ణ మల్లా మాట్లాడుతూ – మంచు లక్ష్మి గారు, మోహన్ బాబు గారు కలిసి నటించిన ఫస్ట్ మూవీ “దక్ష” రేపు థియేటర్స్ లోకి రాబోతోంది. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మీరంతా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఇప్పటి ట్రెండ్ లో ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అలాంటి అంశాన్నీ ఉన్న థ్రిల్లర్ సినిమా “దక్ష”. ఇటీవల విష్ణు అన్న కన్నప్ప, మనోజ్ అన్న మిరాయ్ సక్సెస్ అయినట్లే లక్ష్మి అక్క “దక్ష” సినిమా కూడా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నం. అన్నారు.

మంచు లక్ష్మి మాట్లాడుతూ – రేపు మా “దక్ష” సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. నేను ఇష్టపడి, కష్టపడి, ప్రేమించి చేసిన చిత్రమిది. ఫస్ట్ టైమ్ నాన్న మోహన్ బాబు గారితో కలిసి నటించాను. టైటిల్ లాగే “దక్ష” సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఎప్పటిలాగే నాపై మీ ప్రేమ ఉంటుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంతో మా డైరెక్టర్ వంశీ కృష్ణకు మంచి సక్సెస్ దక్కాలి. అలాగే సముద్రఖని, సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా..వీళ్లంతా తమ స్క్రీన్ ప్రెజెన్స్ , పర్ ఫార్మెన్స్ తో “దక్ష” సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. వీళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. రేపు మా “దక్ష” సినిమా థియేటర్స్ లోకి వస్తోందంటే ఎగ్జైటింగ్ గా ఉంది. మీ అందరినీ మా మూవీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా. అన్నారు.

నటుడు రంగస్థలం మహేశ్ మాట్లాడుతూ – ఒక మంచి థ్రిల్లర్ చిత్రంగా మంచు లక్ష్మి గారి “దక్ష” రేపు మీ ముందుకు వస్తోంది. మీ దగ్గరలోని థియేటర్స్ లో తప్పకుండా చూడండి. మీరంతా సినిమా చూసి మిగతా వారికి పాజిటివ్ టాక్ ను చెప్పాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు :

మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, సముద్రఖని, సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేశ్, జెమినీ సురేష్, తదితరులు

టెక్నికల్ టీమ్:

సంగీతం: అచు రాజమణి,ఛాయాగ్రహణం: గోకుల్ భారతి,నృత్య దర్శకురాలు: బృంద,పీఆర్ఓ – వీరబాబు,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ కృష్ణ మల్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *