1. ఇంట్రో :
“Mad Square” అనేది 2023లో హిట్ అయిన “MAD” సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్. కళ్యాణ్ శంకర్ రచన మరియు దర్శకత్వంలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం, మార్చి 28, 2025న థియేటర్లలోకి వచ్చింది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, ప్రియాంక జవాల్కర్, విష్ణు ఓఐ వంటి యంగ్ టాలెంట్‌తో ఈ సినిమా రూపొందింది.
“MAD” సినిమా ఇచ్చిన ఫన్, ఎనర్జీని మళ్లీ తెరపై చూపించాలనే లక్ష్యంతో వచ్చిన ఈ చిత్రం, ఫ్రెండ్‌షిప్, కామెడీ, కొంచెం గందరగోళంతో నిండిన రైడ్‌ని అందిస్తుంది. కానీ, ఈ సీక్వెల్ అంచనాలను అందుకుందా? దాని గురించి వివరంగా చూద్దాం.
2. కథ – స్క్రీన్‌ప్లే:
సినిమా కథ లడ్డు (విష్ణు ఓఐ) పెళ్లితో మొదలవుతుంది. అతని స్నేహితులు మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్) ఈ పెళ్లిలో పాల్గొంటారు. కానీ, అనుకోకుండా జరిగే ఓ గందరగోళం వల్ల వీళ్లందరూ గోవాకి పరిగెత్తాల్సి వస్తుంది. అక్కడ వీళ్లపై రాబరీ ఆరోపణలు పడతాయి.
ఈ ఇబ్బంది నుంచి బయటపడే క్రమంలో వచ్చే సిచుయేషనల్ కామెడీ, ఫన్ సన్నివేశాలే సినిమా మెయిన్ హైలైట్. స్క్రీన్‌ప్లే విషయానికొస్తే, ఫస్ట్ హాఫ్‌లో పెళ్లి చుట్టూ తిరిగే ఎపిసోడ్స్ బాగా నవ్విస్తాయి. రైటర్ కళ్యాణ్ శంకర్ ఇక్కడ తన టైమింగ్, వన్-లైనర్స్‌తో సక్సెస్ అయ్యాడు. కానీ సెకండ్ హాఫ్‌లో గోవా ట్రాక్ కొంచెం డల్ అవుతుంది.
కథలో లాజిక్ లేదని తెలిసినా, కొన్ని సీన్స్ ఫోర్స్డ్‌గా అనిపిస్తాయి. మొత్తంగా, స్క్రీన్‌ప్లే కామెడీ కోసం వచ్చే వాళ్లకి ఓకే, కానీ డీప్ స్టోరీ ఆశించే వాళ్లకి నిరాశే.
3. దర్శకుడు – నటి నటులు ప్రతిభ:
దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మార్క్ కామెడీని మళ్లీ తెరపైకి తెచ్చాడు. “MAD”లో చూపించిన ఎనర్జీని ఇక్కడ కూడా కొనసాగించే ప్రయత్నం చేశాడు, కానీ సీక్వెల్‌గా కొత్తదనం తక్కువగా ఉంది.
నటీనటుల్లో నార్నె నితిన్ తన కామెడీ టైమింగ్‌తో మళ్లీ ఆకట్టుకున్నాడు.
సంగీత్ శోభన్ తన పాత్రలో ఎనర్జీ, హాస్యం రెండూ జోడించాడు.
రామ్ నితిన్, విష్ణు ఓఐ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
ప్రియాంక జవాల్కర్ పాత్ర కాస్త లిమిటెడ్‌గా ఉన్నా, తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.
మురళీధర్ గౌడ్ సపోర్టింగ్ రోల్‌లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు.
వీరితో పాటు స్పెషల్ క్యారెక్టర్స్ (భాయ్, ఆంటోనీ) రెండవ అంకం ( 2nd ఆఫ్) లో వచ్చి నవ్వులు పంచుతూ మంచి హై ఇస్తాయి.
4. సాంకేతిక నిపుణులు ప్రతిభ:
సాంకేతికంగా ఈ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది.
భీమ్స్ సిసిరోలియో సాంగ్స్ కూడా యూత్‌కి నచ్చేలా ఉన్నాయి.
తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి జోష్ తెస్తుంది. చాలా సీన్స్ నీ బాగా ఎలివేట్ చేసింది.
శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ గోవా లొకేషన్స్‌ని చక్కగా క్యాప్చర్ చేసింది. సాంగ్స్ కూడా కలర్ ఫుల్ గా ఉన్నాయి.
ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ చాలా చార్ప్ గా ఉంది. సినిమా 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్ లో బోర్ కొట్టకుండా చూసింది.
సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ స్టాండర్డ్ కి తగ్గట్టు ఉన్నాయి.
5. 18F మూవీస్ టీం ఒపీనియన్ :
18F మూవీస్ టీం ఒపీనియన్ ప్రకారం, “Mad Square” ఒక డీసెంట్ కామెడీ ఎంటర్‌టైనర్. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే నవ్వులు, నటీనటుల ఎనర్జీ ఈ సినిమాకి ప్లస్. కానీ సెకండ్ హాఫ్‌లో స్టోరీ లేకపోవడం, రిపీటెడ్ ఫీల్ వంటివి మైనస్‌గా నిలిచాయి.
కథ ను ఆశించకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చే వారికి ఈ సినిమా హాట్ సమ్మర్ లో చల్లని ఆనందాన్ని ఇచ్చి అయిగా నవ్వుకొనేలా చేస్తుంది.
“MAD” సినిమా స్థాయిని అందుకోలేకపోయినా, ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్‌లో ఎంజాయ్ చేయడానికి ఇది మంచి ఛాయిస్.
యూత్ ఆడియన్స్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.
18F రేటింగ్ – 3/5
పంచ్ లైన్:
“నవ్వుల స్క్వేర్ లో ఫన్ ఉంది కానీ కధ కనిపించదు!”
* కృష్ణ ప్రగడ.