సూపర్ ఇంట్రెస్టింగ్ పేస్‌తో 2 నిమిషాల 27 సెకన్ల ట్రైలర్‌ను విడుదల చేసిన లవ్ ఓటిపి టీమ్.
చిత్ర ట్రైలర్ చూస్తున్నంత సేపు సరదాగా గడిచి పోయింది. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమించి ఇబ్బందిపడే అబ్బాయిల కథలా ఉంది ‘లవ్ ఓటిపి’ ట్రైలర్.
ప్రేమంటే అస్సలు పడని నాన్న పాత్రలో బెంగుళూరులో ఉండే పోలీసాఫీసర్‌గా రాజీవ్ కనకాల నటించారు.
భవప్రీతా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ యం రెడ్డి నిర్మాతగా అనీష్, జాన్విక, స్వరూపిణిలు హీరో హీరోయిన్లుగా నటించిన ‘లవ్ ఓటిపి’ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. చిత్ర బృందం శనివారం లవ్ ఓటీపీ ట్రైలర్ ను విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత విజయ్ యం రెడ్డి మాట్లాడుతూ–‘‘ ఫ్రెష్ కంటెంట్‌తో వచ్చిన ఏ సినిమాకైనా ఫుల్ డిమాండ్ ఉంటుంది అని అందరికి తెలుసు. మా ‘లవ్ ఓటిపి’ సినిమాతో ఎవరూ ఊహించని ఎంటర్‌టైన్‌మెంట్‌ని మీ ముందుకు తీసుకువస్తున్నాం.
హీరో హీరోయిన్లతో పాటు ఈ కొత్త రకం తండ్రి కొడుకులను చూసి ప్రేక్షకులు ముచ్చట పడతారు. మా హీరో అనిషే ఈ సినిమా దర్శకుడు కూడా కాబట్టి ఈ సినిమా తర్వాత చాలా పెద్ద హీరోగా, మంచి దర్శకునిగా పేరు సంపాదించు కుంటాడని నేను గట్టిగా నమ్ముతున్నాను’’
నటి నటులు:
అనీష్, జాన్విక, రాజీవ్ కనకాల, ప్రమోదిని, కాలకే రి, స్వరూపిణి, నాట్యరంగ, తులసి, అన్నపూర్ణ, చేతన్ గంథర్వ, రవి భట్ తదితరులు నటించారు….
సాంకేతిక నిపుణులు:
సంగీతం– ఆనంద్ రాజా విక్రమ్, డిఓపి– హర్ష, ఎడిటర్ – శరత్, ఫైట్స్– విక్రమ్ మోర్, డాన్స్– బాబా భాస్కర్, పి.ఆర్.ఓ– శివమ్ మీడియా నిర్మాత– విజయ్ యం.రెడ్డి, రచన–దర్శకత్వం– అనీష్.