Yashoda Team Success celebrations at Sridevi Movies office:
హీరో నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత యశోద సినిమాతో పలకరించింది. శుక్ర వారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని శ్రీదేవి మూవీస్ ఆఫీసు లో కేక్ కట్ చేసి సక్సెస్ సంబరాలు చేసుకున్నారు.

యశోద సినిమా సరోగసీ బ్యాక్ డ్రాప్‌లో జరిగే మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1300 పైగా థియేటర్స్‌లో వాల్డ్ వైడ్‌గా రిలీజైంది అని ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ తెలియ జేశారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మొదటి రోజు వసూళ్లు ఏ మేరకు ఉంటాయనేది ఇంకా కొన్ని గంటలలో అఫిసియల్ గా రావచ్చు.
యశోద సినిమాకు మొదటి రోజు అన్నీ ఏరియా లు నుండి పాజిటివ్ టాక్ నేపథ్యంలో యశోద చిత్రానికి ఓపెనింగ్స్ హై రేంజ్‌లో ఉంటాయనేది సినీ పండితుల సమాచారం.

మొత్తంగా సమంత లేడి సూపర్ స్టార్ గా అవతారం ఎత్తి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో చెప్ప బోతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.. కేక్ కట్ చేయడంతో పాటు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.ఈ కోవలో సమంత టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ ’యశోదా’. హరి, హరీష్ అనే ఇద్దరు కొత్త దర్శకులు డైరెక్ట్ చేసారు

యశోద ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ (ట్రేడ్ వర్గాల నుండి) చూస్తే లేడీ ఓరియంటెడ్ మూవీ అయిన ఈ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని, అది ఎంతంటే నైజాం (తెలంగాణ ) : రూ. 4.5 కోట్లు.. రాయలసీమ (సీడెడ్) : రూ. 1.50 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ : రూ. 11.50 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + ఓవర్సీస్ కలిపి రూ. 4 కోట్లు.. టోటల్ గా ప్రపంచ వేత్తనగా రూ. 15.50 కోట్లు రేషియో లో విడుదల చేసి నాటు చెప్తున్నారు.
యశోద సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 16.50 కోట్లు రాబట్టాలి అంటున్నారు. మొత్తంగా యశోద సినిమా ముందు పెద్ద టార్గెట్టే ఉన్నట్టు ఉంది కదా !.

ప్రొడ్యూసర్ కృష్ణ ప్రసాద్ గారు మాత్రం చెప్తున్నది ఏంటంటే, మేము ఎవరికి ధియాటర్ రిలీజ్ కోసం యశోద సినిమా అమ్మలేదు. మా పార్టనర్ ఛానెల్స్ ద్వారా రిలీజ్ చేశాము అని చెప్తున్నారు. చూడాలి ఇంతకీ తెర వెనుక ఏమి జరిగినది అనేది.
యశోద సినిమా డే 1 కలెక్షన్స్ అఫిసియల్ గా వచ్చిన తర్వాత ఇక్కడ పోస్ట్ చేస్తాము. అప్పటి వరకూ వైట్ అండ్ వాచ్..