allu sirish rajamundry tour 1

తెలుగు సినిమా అభిమానులతో “ఊర్వశివో రాక్షసివో” చిత్రంలోని “కలిసుంటే” సాంగ్ పోస్టర్ విడుదల చేయించిన అల్లు శిరీష్

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఊర్వశివో రాక్షసివో”

కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు, అలానే సాంగ్స్ కు అనూహ్య స్పందన లభించింది.

ఈ చిత్రం నవంబర్‌ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఈ చిత్రం ప్రోమోసనల్ టూర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ రాజమండ్రి లో అభిమానులను కలిసారు.

అభిమానులతో “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి “కలిసుంటే” అనే సాంగ్ పోస్టర్ ను విడుదల చేయించారు. అభిమానులతో సాంగ్ పోస్టర్ రిలీజ్ చేయించడం అరుదైన విషయం.ఇది అభిమానులకు కూడా ఆనందం కలిగించే విషయం.

ఈ పాటను ఈ రోజు  సాయంత్రం 4 గంటలకు విడుదలచేయనుంది చిత్రబృందం.

allu sirish poster
అనూప్‌రూబెన్స్,అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *