“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు.
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. “లిటిల్ హార్ట్స్” సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ షేర్ చేసుకున్నారు బన్నీ వాస్, వంశీ నందిపాటి
ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ -“లిటిల్ హార్ట్స్” మూవీ బాగుందని వంశీ నందిపాటి చెప్పాడు. ఆ తర్వాత ఆదిత్య హాసన్ వచ్చి మూవీ గురించి వివరించాడు. సినిమా చూశాను చాలా బాగుంది. వంశీ చెప్పింది కూడా ఈ మూవీ గురించే కదా అనుకున్నాను. కంటెంట్ బాగుంది. థియేట్రికల్ గా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యి, మనం చేస్తున్నామని వంశీకి చెప్పాను.
క్రియేటివ్ పరంగా మేము ఇన్వాల్వ్ కాలేదు. నాకు అనిపించిన సజెషన్స్ చెప్పాను. మొత్తం వాళ్లే చేసుకున్నారు. ఇందులో నటించిన వాళ్లు కొత్తవాళ్లు లేదా ఓటీటీలో ఎక్కువ పరిచయమైనవాళ్లు. కాబట్టి ఓపెనింగ్స్ నెమ్మదిగానే ప్రారంభమవుతాయని అనుకుంటున్నాం, అయితే మ్యాట్నీ, ఫస్ట్ షో నుంచి కలెక్షన్స్ పికప్ అవుతాయనే నమ్మకం ఉంది. ఈ డేట్ తప్పితే మాకు మరో డేట్ సరైనది లేదు. 12న సినిమాలు వస్తున్నాయి. “లిటిల్ హార్ట్స్” బాగుందనే టాక్ తో ఆ వీక్ సస్టెయిన్ అయితే బెటర్ రన్ కు వెళ్తుంది.
మేము 19కి వద్దామంటే ఆ తర్వాత వీక్ ఓజీ ఉంది. యూత్ కంటెంట్ తో మంచి ఎంటర్ టైన్ మెంట్ తో “లిటిల్ హార్ట్స్” ఉంటుంది. ఎక్కడా అశ్లీలత ఉండదు. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయొచ్చు. హిందీ, మలయాళ చిత్రాలకు థియేట్రికల్ గా ఉన్న అడ్వాంటేజ్ మనకు లేదు. మనం నాలుగు వారాల్లోనే ఓటీటీకి సినిమాను ఇచ్చేస్తున్నాం. మనం థియేటర్ కు చేసిన ప్రమోషన్ ఓటీటీకి పనికొస్తోంది.
సినిమాలకు ప్రేక్షకులు రావాలని మనం డిమాండ్ చేయడంలో అర్థం లేదు. సినిమా బాగుంటే వాళ్లే వస్తారు. ఇది మన బిజినెస్. మల్టీఫ్లెక్స్ లో ఫుడ్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయనేది నిజమే. సినిమా బాగుంటే ప్రేక్షకుడు ఆ ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మంచి సినిమా చూశామనే ఫీల్ లో ఫ్యామిలీ కోసం ఖర్చు పెడతాడు.

చిన్న చిత్రాలకు టికెట్ రేట్స్ 150 పెడితే బాగుంటుంది. అయితే ఈవారం రిలీజయ్యే సినిమాల్లో మా ఒక్క చిత్రానికే టికెట్ రేట్స్ తగ్గించడంలో సమస్యలు వస్తాయి. మిగతా సినిమాకు వాళ్లు 200 రేట్ పెట్టమని అంటారు. ప్రాక్టికల్ గా ఉన్న ఇబ్బందులు ఇవి. “లిటిల్ హార్ట్స్” కంటెంట్ బాగుంది. ఇలాంటి మూవీ నాలుగైదేళ్ల కిందట వచ్చి ఉంటే థియేటర్స్ లో కుమ్మేసేది. ఈ రెండు మూడు వారాల్లో కూడా యూత్ ఓరియెంటెడ్ ఫన్ మూవీ రావడం లేదు. సో అది మాకు అడ్వాంటేజ్ అవుతుందని ఆశిస్తున్నాం.
లిటిల్ హార్ట్స్ సినిమా ఫైనల్ కాపీ చూశాను, ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారు. కాత్యాయని నన్ను లవ్ చేయి అనే సాంగ్ మాత్రం మంచి మీమ్ కంటెంట్ అవుతుంది. 16 నుంచి 20 ఏళ్ల యూత్ కు ఈ సినిమా బాగా నచ్చుతుంది. 90’s ఫ్యామిలీ మిడిల్ క్లాస్ బయోపిక్ లో స్కూల్ బ్యాక్ డ్రాప్ అయితే, ఇందులో ఇంటర్, ఎంసెట్ ఎగ్జామ్స్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. హీరో మౌళి చేసిన అఖిల్ క్యారెక్టర్ ఎలాంటి ఇబ్బందుల్లో అయినా ఫన్ గా బిహేవ్ చేస్తుంటాడు.
“లిటిల్ హార్ట్స్” ఫ్యామిలీలో జరిగే కథ కంటే ఎక్కువగా ఎంసెట్ కోచింగ్ సెంటర్, వాళ్ల చదువులు, ప్రేమలో పడే ఆకర్షణలు..వీటి చుట్టూ సాగుతుంది. కంటెంట్ బాగున్న సినిమాలే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అవి ఆదరణ పొందని సందర్భాలూ రావొచ్చు. అన్నీ తీసుకోగలగాలి. గత వారం మేమొక సినిమా చేశాం. అది ఓటీటీకి పనికొస్తుందనే ప్రచారం చేశాం. ఇప్పుడు 90 థియేటర్స్ లో రిలీజైతే తప్ప ఓటీటీ వాల్లు కన్సిడర్ చేయడం లేదు.
ఐదు షోస్ వేయాలనే రూల్ ప్రభుత్వం నుంచి ఉంది కానీ ఎవరూ పాటించడం లేదు. ఇక్కడ రూల్స్ ఎన్నో ఉంటాయి. కానీ చివరకు పాటించడమే అసాధ్యం. కరోనా టైమ్ నుంచి కంటెంట్ లో చాలా మార్పులు వచ్చాయి. ప్రచారం చేయాల్సిన తీరులోనూ మార్పులు వచ్చాయి. గతంలో పద్ధతులు ఇప్పుడు ఉపయోగపడటం లేదు.
ట్రైలర్ నచ్చితేనే ప్రేక్షకులు సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మా సంస్థ నుంచి మిత్రమండలి సినిమాను అక్టోబర్ 16న దీపావళి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నాం.

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమా 80 పర్సెంట్ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. ఒక ఆడియెన్ గా మాకు అనిపించినవి సజెషన్స్ చెప్పాం. “లిటిల్ హార్ట్స్” సినిమాను మేము చూస్తున్నప్పుడు ఇది థియేట్రికల్ కంటెంట్ , థియేటర్స్ లో బ్లాస్ట్ అవుతుంది అనిపించింది.
బన్నీ వాస్ గారు తన బ్యానర్ నుంచి తీసుకొస్తున్న ఫస్ట్ మూవీ ఇది. యంగ్ టీమ్ ఈ చిత్రానికి పనిచేశారు. వాళ్ల ఎనర్జీ అంతా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని నమ్ముతున్నాం. ఈటీవీ విన్ వారు తీసుకొస్తున్న కంటెంట్ చాలా బాగుంటుంది. మన చిన్నప్పటి మొమెరీస్ గుర్తు చేసేలా వాళ్ల మూవీస్, సిరీస్ లు ఉంటాయి.
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” స్కూల్ జ్ఞాపకాలను, ఎయిర్ అనే సిరీస్ తో కాలేజ్ డేస్ ను గుర్తుచేశారు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ తో కాలేజ్ అయ్యాక ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన అబ్బాయి తన లవ్ సక్సెస్ చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది ఎంటర్ టైన్ చేస్తుంది. కంటెంట్ అనేది మారుతోంది. మేము పొలిమేర చేసినప్పటికి ఇప్పటికి కూడా కంటెంట్ వైజ్ చాలా మార్పులు వచ్చాయి.
ప్రేక్షకుల అభిరుచిలో కూడా మార్పు వచ్చింది. దానికి తగినట్లే ప్రొడ్యూసర్స్ మారాల్సిఉంది. ఈ నెల 3వ తేదీన ఈ చిత్రానికి స్టూడెంట్స్ కోసం హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నాం. 4న పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. దాదాపు 170 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం.