మూవీ : కోట బొమ్మాళీ PS (Kota Bommali PS):

విడుదల తేదీ: నవంబర్ 24, 2023
నటీనటులు: శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, మురళీ శర్మ, పవన్ తేజ్ కొణిదెల, బెనర్జీ తదితరులు
మాటలు: నాగేంద్ర కాశి
ఛాయాగ్రహణం: జగదీశ్ చీకటి
సంగీతం: రంజిన్ రాజ్
సహ నిర్మాతలు: భాను కిరణ్ ప్రతాప, రియాజ్
నిర్మాతలు: ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి
దర్శకత్వం: తేజ మార్ని
కోట బొమ్మాళీ PS రివ్యూ (Kota Bommali PS Review):
‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది మలయాళీ హిట్ సినిమా రిమేక్ అని కాకుండా లింగిడి లింగిడి పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అని, ఇంకా సినిమా ప్రెస్ మీట్స్ లో ఈ సినిమా లో పొలిటికల్ సెట్టైర్స్ బాగా ఉన్నాయి అని చెప్పడం వలన .
ఈ కోట బొమ్మాళి పీఎస్’ సినిమాలో శ్రీకాంత్, వెరసేటైల్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో… రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించారు. ‘జోహార్’, ‘అర్జున ఫాల్గుణ’ తర్వాత తేజా మార్ని దర్శకత్వం వహించిన చిత్రమిది. మలయాళ హిట్ ఫిల్మ్ ‘నాయట్టు’కు రీమేక్ రైట్స్ తీసుకొని తెలుగుకు మార్పులు, చేర్పులు చేశాము అని యూనిట్ మొత్తం చెప్పింది. మరి ఈ సినిమా ఎలా ఉందో మా 18F మూవీస్ టీం సమీక్షలో చదివి తెలుసుకొందామా !
కధ పరిశీలిస్తే (Story Line):

ఆంధ్ర ప్రదేశ్ లోని టెక్కలి ఉపఎన్నికను ప్రస్తుతం అధికారం లో ఉన్న పార్టీ, ప్రభుత్వం ఉపఎన్నిక గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, హోమ్ మంత్రి బరిసెల జయరామ్ (మురళీ శర్మ)ఆ ప్రాంతానికి పంపుతుంది. అదే నివేజక వర్గం లో ఉన్న కోట బొమ్మాళీ పోలీస్ స్టేషన్ లో CI పై ఆఫీసర్స్ ఆద్వర్యం లో రాజకీయ నాయకులు కొన్ని దొంగకేసులు పోలీసుల చేత చేయిస్తుంటారు.
ఇలా పోలీస్ లు మనస్సు సంపుకోని పై అధికారులు చెప్పినట్టు చేసుకొంటూ పోతున్న హెడ్ కానిస్టేబుల్ రామ కృష్ణ ( శ్రీకాంత్ ) రవి ( రాహుల్ విజయ్), కుమారి (శివాని రాజశేకర్) ప్రయాణిస్తున్న పోలీస్ జీప్ కి అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణిస్తాడు. పెళ్లిలో మద్యం సేవించి వస్తున్న పోలీస్ జీప్ యాక్సిడెంట్ చేయడంతో అతను మరణిస్తాడు.
జీపు నడిపింది పోలీసులు కాదు కానీ, ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు స్టేషనులో కుమారికి వరుసకు బావ అయ్యే మున్నా (పవన్ తేజ్ కొణిదెల)తో పాటు మరణించిన సామజిక వర్గానికి చెందిన కొందరితో రామకృష్ణ, రవి గొడవ పడతారు. దాంతో యాక్సిడెంట్ కాస్త రాజకీయ సమస్యగా మారుతుంది.
మరోవైపు ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని హోమ్ మంత్రి ప్రెస్ ముందు తొడ కొట్టి శపథం చేస్తారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మీ శరత్ కుమార్)కు ఆ బాధ్యత అప్పగిస్తారు.
ఆ తర్వాత ముగ్గురు కనిస్టేబుల్స్ దొరికారా ?
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏమి చేశారు ?
అడవిలో కూంబింగ్ లో ఎంతో అనుభవం ఉన్న కానిస్టేబుల్ రామకృష్ణ ఏం చేశాడు?
ట్రైనింగ్ లో తెలివి ని టెక్నిక్ ని నేర్పే ఐపిఎస్ ఆఫీసర్ రజియా వాళ్ళను పట్టుకోవడానికి ఏం చేసింది?
ఎత్తుకు పైఎత్తులు వేస్తూ జరిగిన దొంగా (పోలీస్)- పోలీస్ ఆట లో అంతిమ విజయం ఎవరిది?
ఇంతకీ హోమ్ మినిస్టర్ ఆ ఉప ఎన్నిక గెలిపించాడా ?
ఫైనల్ గా పారిపోయిన కనిస్టేబుల్స్ ని రజియా అలీ పట్టుకొందా ?
ఎవరు ఎవరిపై గెలిచారు అనేది వెండితెరపై చూడాలి.
కధనం పరిశీలిస్తే (Screen – Play):

ఈ చిత్రంలో ఆసక్తికరమైన థ్రిల్స్ మరియు రియల్ ఎమోషనల్ కధనం ఉన్నప్పటికీ ప్రేక్షకుడు దానిలో లీనం అవ్వడానికి మాత్రం కాస్త టైం పడుతుంది. కధ ను నడిపే కధనం (స్క్రీన్ – ప్లే ) స్టార్టింగ్ లో కాస్త స్లో గానే ఉంటుంది. అలాగే కామెడీ ఎంటర్టైన్మెంట్ లాంటివి ఆశించే వారికి అవి ఇందులో అంతగా ఏమి ఉండవు.
కథనం అక్కడక్కడా కాస్త స్లో గా ఉన్నట్టు అనిపిస్తుంది..కానీ, బాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రతి సీన్ హంటింగ్ చేసేలా మలచిన తీరు బాగుంది. అలాగే ఒరిజినల్ తో పోల్చకుండా రామకృష్ణ (శ్రీకాంత్) రోల్ ని ఇంకాస్త డెప్త్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఇంకా బాగా ఉండేది.
ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలలో మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) పాత్రల పరిచయం తో గ్రిప్పింగ్ గా సాగినా రెండవ అంకం (సెకండ్ ఆఫ్) లో సాగదీసినట్టు ఉంటాయి. కానీ ఈ కోట బొమ్మాళీ మాత్రం ఫస్ట్ ఆఫ్ అంటే సెకండ్ ఆఫ్ చాలా గ్రిప్పింగ్ గా జరిగింది.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు తేజ మార్నిమలయాళ ఒరిజినల్ చిత్రం ‘నాయట్టు’ సోల్ తీసుకొని తను ఓ ప్రామిసింగ్ రీమేక్ ని అందజేసే ప్రయత్నం చేసారని చెప్పాలి. మంచి కధని డీసెంట్ నరేషన్ తో ప్రెజెంట్ చేశారు. ఇన్వెస్టగేటివ్ థ్రిల్లర్ కి ప్రస్తుత రాజకీయ సంఘటనలు జోడించి చేసిన ప్రయత్నం బాగుంది.
శ్రీకాంత్ అగ్ర హీరోల సినిమాల్లో పాత్రలు చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు. అయితే ఆ పాత్రలు కథకు అలంకారప్రాయంగా మాత్రమే ఉంటున్నాయి. ఇలాంటి సమయం లో ‘కోట బొమ్మాళి పీఎస్’లో రామకృష్ణ రోల్ మరోసారి శ్రీకాంత్ నటనను ఆవిష్కరించింది. ఈ సినిమా కు రామ కృష్ణ పాత్ర నే ముఖ్యం. తన అద్బుత నటనతో కట్టిపడేశాడు శ్రీకాంత్.
ఓ సాధారణ కానిస్టేబుల్ పాత్రలో సహజంగా నటిస్తూ, కథ ముందుకు వెళ్లే కొలదీ హీరోయిజం ఎలివేట్ చేసిన తీరు బావుంది. అలాగే, ఆయన నటన! ఓ తండ్రిగా పతాక సన్నివేశాల్లో కుమార్తె గురించి చెప్పే సన్నివేశం కంటతడి పెట్టిస్తుంది.
హీరోఇజం ఉన్న మరో పాత్ర గురించి చెప్పుకోవాలి అంటే అది వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించిన రజియా అలీ పాత్ర. ఎందుకంటే ఆమెను నటన పాత్ర తీరు చూస్తే విలన్ అనలేం! న్యాయం కోసం వెతికే పాత్ర కాబట్టి. వరా కూడా అలీ పాత్రకు జీవం పోసింది. ఒకరకమైన నవ్వు, బాడీ లాంగ్వేజ్ మైంటైన్ చేస్తూ కథపై ప్రేక్షకులలో క్యూరియాసిటీ కలిగించారు.
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లలా కాకుండా కేవలం పాత్రల్లో ఒదిగిపోయారు. వారి నటన కూడా న్యాచురల్ గా ఉంది ప్రేక్షకులలో మంచి మార్కులు పొందుతారు.
హోమ్ మంత్రి గా మురళీ శర్మ మరోసారి టిపికల్ మేనరిజం, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ప్రవీణ్, బెనర్జీ, సీవీఎల్ నరసింహారావు, దయానంద్, పవన్ తేజ్ కొణిదెల తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

రంజిన్ రాజ్ మ్యూజిక్ బాగుంది. లింగిడి లింగిడి పాట జానపదం అయినా, ఇప్పటి వారికి చక్కగా వినిపించడం కోసం యాడ్ చేసిన ఇన్స్ట్రుమెంటల్ వర్క్ బాగుంది. చాలా సీన్స్ లో BGM చాలా బాగా శేట్ అయ్యింది.
జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ బాగుంది. సహజత్వానికి దగ్గరగా రియల్ ఫారెస్ట్ లోకేసన్స్ బాగున్నాయి.
కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు.
గీతా ఆర్ట్స్ 2 వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా నేపథ్యంకి తగ్గట్టుగా చాలా నాచురల్ గా సినిమాని తెరకెక్కించారు.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
‘కోట బొమ్మాళి పీఎస్’ సిన్మా సాదాసీదాగా పోలీస్ కానిస్టేబుల్ కస్టాలు తో మొదలై, కాసేపటికి తన ప్రపంచంలోకి మనల్ని తీసుకు వెళుతుంది. తెరపై ఏం జరుగుతుంది? అని ఆలోచింపజేసే థ్రిల్లర్.సినిమా చూస్తున్నంత చేపు మనల్ని మనం మర్చిపోయి పాత్రలతో ఇన్వాల్వ్ అయిపోతాము.
మాతృక మలయాళ నాయాట్టు నుండి సోల్ తీసుకొని శ్రీకాకుళం ప్రాంత నికి, తెలుగు రాష్ట్రా- రాజకీయకు లింకు చేస్తూ సహజత్వానికి దగ్గరగా తీసిన చిత్రమిది. పార్టీలు ఎలెక్షన్స్ అప్పుడు పంచే నోటు తీసుకుని ఓటు వేసే ప్రజల్ని, వ్యవస్థను ఎత్తిచూపుతూ మురళీ శర్మ చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. బయటి వ్యక్తులు తో చెప్పించే కంటే పొలిటికల్ లీడర్ తో నే చెప్పించడం కొంచెం కొత్తగా ఆపిపయిస్తుంది.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు, కంటెంట్ బేస్డ్ సినిమాలు కోరుకునే ప్రేక్షకులు అసలు మిస్ కాకుండా చూడవలసిన సినిమా ఈ కోట బొమ్మాళీ PS. మ్యూజిక్ కూడా సినిమా హిట్ కి దోహద పడేలా ఉంది. కొన్ని సీన్స్ లో BGM చాలా బాగుంది.
చివరి మాట: నిజాన్ని నిజాయితీ గా చెప్పే ప్రయత్నం!

18F RATING: 3 .5 / 5
* కృష్ణ ప్రగడ.