సినిమా ప్రేక్షకులను ఇండియన్ వెండితెర గజిని ఎవరు అంటే? కొలి వుడ్ లోనా బాలీవుడ్ లోనా అని అడుగుతారు. ఎందుకంటే గజిని పాత్ర ను వెండితెర మీద ఆవిష్కరించిన కధ – దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్య తో మొదలు పెట్టి తర్వాత బాలీవుడ్ లో హీరో ఆమీర్ ఖాన్ తో కూడా నటింప చేసి ప్రొడ్యూసర్స్ కి కలెక్షన్స్ సునామీ సృష్టించాడు.
తమిళ, తెలుగు, హిందీ లో కూడా గజిని పేరుతోనే వచ్చింది . హిందీ లో మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసి బాలీవుడ్ లో ఫస్ట్ 100 కోట్ల చిత్రంగా నిలిచింది. ఇక్కడ తెలుగులో కూడా సూర్య నటించిన తమిళ వెర్సన్ నే తెలుగు డబ్బింగ్ చేసి విడుదల చేయగా, తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది.

ఇంత స్పెషల్ చిత్రం అయినటువంటి ఈ గజిని సినిమా హీరోస్ అయిన సంజయ్ రామస్వామి (సూర్య) – సంజయ్ సింగనియా (అమీర్ ఖాన్)లిద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది. అప్పట్లో గజిని తమిళ (2005) షూటింగ్ అయిపోయి విడుదల అయి హిట్ అయిన తర్వాత హిందీ గజిని (2008) షూటింగ్ జరిగింది కాబట్టి, ఇద్దరు హీరోలు కలవడానికి కుదరలేదు.
గజిని హిందీ చిత్రానికి సినిమాటోగ్రఫీ వర్క్ చేసిన ప్రముఖ సినిమాటోగ్రఫర్ రవి కె చంద్రన్ నిన్ననే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో ఇద్దరు గజినీ లను ఒకే ఫ్రేమ్ లో బందించి, ఓ బ్యూటిఫుల్ మెమరీ అంటూ సోషల్ మీడియా లో షేర్ చేశాడు. ప్రస్తుతం రవి కె చంద్రన్ దర్శకుడు మణి రత్నం కమల్ హాసన్ తో చేస్తున్న తగ్ లైఫ్ (Thag Life) సినిమా కి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.

గజిని సినిమాలో హీరో యాక్సిడెంట్ లో గతం కోల్పోయి కొద్దిగా ఉన్న షార్ట్ మెమరీ తో ఫోటోలు తీస్తూ ప్రత్యార్డులను అంతం చేయడమే గజిని సినిమా కాన్సెప్ట్. ఆ గజిని ఫోటో కాన్సెప్ట్ ని ప్రేక్షకులు ఈ ఫోటో ద్వారా గుర్తుచేసుకొంటూ సోషల్ మీడియా లో సంజయ్ రామస్వామి మీట్స్ సంజయ్ సింగనియా అంటూ కమెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం హీరో సూర్య భారీ చిత్రం “కంగువ” తో బిజీగా ఉండగా అమీర్ సితారే జమీన్ పర్ (తారే జమీన్ పర్ సీక్వల్) లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటూ భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ వస్తున్న టైమ్ కాబట్టి, ఏ దర్శకుడైనా ఈ ఫోటో చూసి ఇన్స్పైర్ అయ్యి ఇద్దరు గజినీలతో అదే సూర్య – అమీర్ తో భారీ మల్టీ స్టారర్ తీస్తే సిన్మా ఫాన్స్ కి పండగే…
* కృష్ణ ప్రగడ.