రెట్రో ఎడిషన్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ లో మెరిసిన సెలబ్రిటీలు

IMG 20251215 WA0168 e1765810052405

హైదరాబాదులో ప్రతి సంవత్సరం కొత్త కొత్త థీమ్‌‌లతో జరుగుతున్న కె స్టైల్ పార్టీ ఈ సంవత్సరం కూడా అత్యంత ఆసక్తికరంగా జరిగింది.

IMG 20251215 WA0178

కె పార్టీ ప్రియులకు తన కొత్త ఆలోచన‌తో లయన్ డాక్టర్ కిరణ్, సుచిరిండియా గ్రూప్ సీఈఓ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బల్గేరియా గౌరవ కన్సల్, తన ప్రతిష్టాత్మక కె పార్టీని రెట్రో ఎడిషన్ స్టైల్లో ఆదివారం రాత్రి ఘనంగా హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ వేడుకలో సెలబ్రిటీలతో గ్రాండ్‌గా ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

IMG 20251215 WA0182

ఇటువంటి కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తలలో ఉండే డాక్టర్ కిరణ్.. తను ఎందుకు అంత ప్రత్యేకమో మరోసారి ఈ పార్టీతో తెలియజేశారు.ఆయన ఆలోచనలతో జరిగిన సరికొత్త థీమ్ మరియు సర్‌ప్రైజ్‌లు ఈ ఈవెంట్‌ను మరిచిపోలేని ఓ గొప్ప అనుభవంగా మార్చాయి.

IMG 20251215 WA0171

కె పార్టీ, మరోసారి హైదరాబాద్‌లో హార్ట్ టాపిక్‌గా నిలిచింది. తన సృజనాత్మకత మరియు వినూత్నతకు ప్రసిద్ధుడైన లయన్ కిరణ్, మరొక విశిష్టమైన మరియు ఉత్సాహభరితమైన థీమ్‌తో వచ్చే సంవత్సరం ఆహ్వానితులను ఎలా ఆకట్టుకుంటారో అనే ఆసక్తి ఇప్పటి నుండే మొదలవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *