సంక్రాంతి కోడిపందాల ఫైట్ ఇప్పుడు తెలుగు నిర్మాతల మండలి మరియు గీల్ట్ లో జరుగుతుంది.
ఈ మద్యనే నిర్మాతల మండలి సమావేశం అయ్యింది అని చెప్పి చిన్న ప్రెస్ నోట్అంటూ పెద్ద బాంబు పేల్చారు. తెలుగు ప్రజల పండగలకు పబ్బాలకు కేవలం తెలుగు స్ట్రెయిట్ సినిమాలకే దీయటర్స్ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ఒక లేఖను విడుదల చేయడం బాగానే ఉంది.
అందులో ప్రత్యేకంగా అగ్ర నిర్మాత దిల్ రాజు గారి వారసుడు సినిమా తో పాటు అజిత్ కుమార్ తూనీవు (తెలుగు వెర్షన్ ) సినిమా ని కూడా భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ప్లాన్ చేయడాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా దిల్ రాజు గారు గతం లో తన స్ట్రెయిట్ సినిమాలు కోసం రజిని కాంత్ పేట రిలీజ్ టైంలో అన్నమాటల తో..
దిల్ రాజు గారి పేరుని వాడుకుని, ఆయన చెప్పిన మాటలకు కట్టుబడమని, ఎలాగూ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కదానే లాజిక్ తో అందులో ఒక పాయింట్ పెట్టింది నిర్మాతల మండలి.
వినడానికి బాగానే ఉంది. కాని ఈ డీయేటర్ల పంచాయతీ ఏమిటి ? ఇది చదవగానే దిల్ ఉన్న రాజు గారు మనసు మార్చుకుని తన మాటలకు విలువ ఇచ్చి వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి లకు దీయటర్స్ ఇచ్చి, తన స్వంత నిర్మాణ సంస్త సినిమా వారసుడిని దత్త పుత్రుడు గా వదులుతారా.. .?
సినీ వ్యాపారం లో లాభాలు ఎక్కడ ఉంటే రాజు గారు అక్కడ ఉంటారు. అలాంటిది తన వారసుడుని కొన్ని దీయటర్స్ కి మాత్రమే పరిమితం చేసి తక్కువ స్క్రీన్లలోనే రిలీజ్ చేస్తానని బాహాటంగా చెబుతారా…?
లవ్ టుడే అనే తమిళ సినిమా ని తెలుగు లో రిలీజ్ చేయాడానికి ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ AGS తో అవగాహన చేసుకొని దిల్ రాజు గారు మొన్ననే లవ్ టుడే ప్రి రిలీజ్ ఈవెంట్ దశపల్లా హోటల్ చాలా ఘనంగా చేశారు.
ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత కొందరు మీడియా మిత్రులతో చిన్నగా చిట్ చాట్ స్టార్ట్ చేసి, తన మనసు లొని భాధను బయట పెట్టారు. ఆ రోజు అనగా 2017 సంక్రాంతి రిలీజ్ టైమ్ లో నేను ఏ సినిమా రిలీజ్ ని ఆప లేదు, వద్దు అని చెప్పలేదు. తెలుగు సినిమా లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని దియేటర్ ఓనర్స్ ని రిక్వెస్ట్ చేశాను, కావాలి అంటే అప్పటి రికార్డు లు మరలా చెక్ చేయండి అని చెప్పారు.
ఇంకా మాట్లాడుతూ, అప్పుడు సూపర్ స్టార్ రజిని కాంత్ పేట సినిమా తెలుగు లో రిలీజ్ కి సంక్రాంతి కి వారం ముందే అగ్రీమెంట్ చేసి పోటీకి తెచ్చారు. అది ఎవరు చేశారో మన అందరికీ తెలుసు. అందుకే అప్పుడు అలా అనవలసి వచ్చింది అని చెప్పారు.
ఇదే విశయాన్ని స్టేజ్ మీదే మాట్లాడుదాము అనుకొన్నాను. కానీ లవ్ టుడే సినిమా ఈవెంట్ డిస్టర్బ్ అవుతుంది అని మాట్లాడ లేదు. మరో సందర్బం లో తప్పకుండా మాట్లాడ తాను అని చెప్పి వెళ్లిపోయారు.
దిల్ రాజు గారు మాట్లాడిన తర్వాత రోజే మరో ఇతర భాషా (హిందీ) సినిమా తెలుగు లో రిలీజ్ చేస్తున్న మెగా నిర్మాత అల్లు అరవింద్ గారు మీడియా అడిగిని ప్రశ్న కు సమాదానం చెప్తూ బహు బలి సినిమా వచ్చి సినిమా ఇండిస్ట్రీ హద్దులానే చెరిపేసింది.
ఇప్పుడు భాష తో సంబందం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఉంటే చాలు జనాలు అదరిస్తున్నారు, అలా జనాలు అదరించే సినిమాలే డీయేటర్స్ లో వేస్తారు ఆడతాయి.
ఇక్కడ ఎవరూ సేవ చేస్తూ లేదు అందరూ వ్యాపారం మాత్రమే చేస్తున్నారు అని స్టేజ్ దిగిన తర్వాత మా దగ్గరకు వచ్చి చెప్పారు.
సొ ఒకో సందర్బం లో ఒకో నిర్మాత తమ వ్యాపారం కోసం అలా సందర్బం వచ్చినప్పుడు అల్లా తమకు అనుకూలంగా మాట్లాడతారు అన్నా మాట.
అంతే గాని ఇక్కడ ఛాంబరా, కౌన్సిల్ నా మరో సంస్థ అనేది కాదు. ఇక్కడ ఎవరూ ప్రజా సేవ చేయడానికి రావలేదు. అందరూ వ్యాపారం కోసమే వచ్చారు వ్యాపారమే చేసుకొంటున్నారు.
సినీ ఫాన్స్ లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనే మెదలైన ధర్మ సందేహమిది . ఇక్కడ కొన్ని విషయాలు సినీ విశ్లేసకులు లోతుగా విశ్లేషించుకోవాలి.
ఎంత వినోదం కోసమే అయినా సినిమా అనేది వ్యాపారం. కోట్లలో పెట్టుబడులు జరిగేది లాభాల కోసం తప్ప ఏదో సంఘసేవకు కాదు. దిల్ రాజు ఒకవేళ నా థియేటర్లు నా ఇష్టమన్నా, లేదూ బయ్యర్లను నేనేం బలవంతపెట్టలేదని, కావాలంటే వాళ్ళకే ఏ సినిమా కావాలో దాన్నే కొనుక్కోమని చెప్పినా ఎవరూ కాదనలేరు.
ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థనే పెద్ద సాలె గూడు లాంటిది. బయటి వాళ్లకు అంత ఈజీ గా అర్థం కాదు. ఆ నలుగురి చేతిలో సినిమా పంపిణి వ్యవస్థ నలిగిపోతోందని చిన్న నిర్మాతలు ఎన్ని సార్లు మొత్తుకున్నా ఏ కదలిక లేదు… ఉండదు.
ఎందుకంటే వారు కూడా డబ్బులు పెట్టిబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి. ఆ నలుగురు కాకపోతే బాగా డబ్బున్న ఇంకో నాలుగురు పంపిణీ వ్యవస్త లోకి వస్తారు లాభ నస్తాలతో వ్యాపార లవాదేవిల చేస్తారు.
కాసేపు ఈ విషయాన్ని పక్కనపెట్టి అసలు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నిర్మాతల మండలి లేదా డిస్ట్రిబ్యూటర్ల సంఘాలు ఎంత మేరకు సంఘటితంగా పరిష్కారం కోసం పోరాడాయంటే సమాధానం దొరకదు.
ఎప్పుడో 2017 సంక్రాంతికి పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి తీసిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమాకు థియేటర్లు దొరకలేదు.
ఎందుకటే అప్పుడు మెగా స్టార్ చిరంజీవి కం బాక్ సినిమా ఖైదీ నెంబర్ 150, అలాగే నట సింహం బాల కృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణిల తో పాటు దిల్ రాజే తీసిన శతమానం భవతి సంక్రాంతి పండగ రేస్ లో ఉండటంతో ఎ థియేటరు యజమాని నారయణ మూర్తి మాట వినలేదు.
ఎందుకంటే డీయేటర్స్ రన్ చేసేది కూడా డబ్బులు సంపాదన కోసమే, నారాయణ మూర్తి సినిమా లొని స్క్రిప్ట్ లా ప్రజా సేవ కోసం కాదు. ఏ సినిమా అడితే డబ్బులు వస్తాయో అదే సినిమా తమ డీయేటర్స్ లో ప్రదర్శిస్తూ ఉంటారు.
చిన్నా సినిమా, పెద్దా సినిమా అనే సంబంధం లేకుండా ఇలాంటి వ్యాపార అనుబంద చిక్కులు ప్రతిసారి వస్తూనే ఉన్నాయి. వివాదాలు మీడియాలో తిరిగినంత వేగంగా వాటి సొల్యూషన్లు కౌన్సిల్ – ఛాంబర్ల నుంచి రావడం లేదు.
ఇప్పుడు దిల్ రాజుకి అందరూ రివర్స్ అవుతారని లేదు. ఎందుకంటే ఆ నలుగురు లో ఇద్దరు, ముగ్గురు పాన్ ఇండియా సినిమాలు తీస్తూన్నరు, ఇతర భాషాలలో బాగున్న సినిమా లు తెలుగు లో రిలీజ్ చేస్తున్నారు.
ఇంకా దిల్ రాజు చేతిలో మరో పాన్ – ఇండియా సినిమా శంకర్ – రామ్ చరణ్ సినిమా ఉంది. తెలుగు డిస్ట్రిబ్యూటర్లు దాన్ని దృష్టిలో పెట్టుకునే వారసుడుకి సహకరిస్తున్నారన్న కామెంట్స్ ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి.
అందరికీ పెద్దమనిషిగా తల్లో నాలుకగా ఉండే దిల్ ఉన్న రాజు గారికి ఇప్పుడి ఈ కౌన్సిల్ లెటర్ పెద్ద తలనొప్పే. విజయ్ సినిమాకు థియేటర్ అగ్రిమెంట్లు చేస్తున్న సమాచారం బయటికి రావడమే ఈ రచ్చకు కారణం.
హైదరాబాద్ క్రాస్ రోడ్డు లొని సుప్రసిద్ధ సుదర్శన్ 35 ఎంఎం ని వారసుడు సినిమా కు లాక్ చేయడం తోనే ఈ రచ్చ మొదలయింది అని సమాచారం. ఆ దియేటర్ లో అయితే మెగా స్టార్ సినిమా లేదంటే బాలయ్య సినిమా పడాలి అని ఫాన్స్ గోడవతో ఈ రచ్చ మొదలయింది.
ఇప్పుడు దిల్ రాజు గారు పబ్లిక్ గా ఎలాంటి సమాధానం ఇస్తారనేది అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారసుడు సినిమా తెలుగు దర్శకుడు, నిర్మాత తీస్తూ ఉన్నందువల్ల అది ద్వి భాషా చిత్రమని దిల్ రాజు క్యాంప్ నుండి కొంత సమాచారం వస్తుంది.
ఇంకా చాలా టైమ్ ఉంది కదా, ఈ సంక్రాంతి పండక్కి డీయేటర్స్ పందాల వేట ఎలా ఉంటుందో… కొన్ని రోజులలోనే తెలిసి పోతుంది.
అప్పటి వరకూ మీడియా ఎవరికి తోసింది వారు రాసుకో వచ్చు. మా చూచిన ఏంటంటే, స్వయంగా విని వ్రాయమని. లేనిది ఉన్నట్టు గా బ్రమలో తనకు తోచింది వ్రాయ వద్దు అని..
ఎంత మంది జర్నలిస్టులకు, ఎన్ని మీడియా సంస్థ లకు ఈ ఆర్టికల్ చేరుతుందో తెలియదు కానీ అందరూ తెలిసిన నిజాలే వ్రాయండి అని మేము మాత్రం గళం విప్పి చెప్ప గలం.
మా ఈ ప్రశ్నలకు ఎవరు సమాదానం చెప్తారు?.
కౌన్సిల్ లేఖ విడుదల చేయడం దేనికోసం ?
ఎవరిని తృప్తి పరచడం కోసం ఈ లేఖ ?
లేఖ వెనుక ఉన్న బడా బాబులు ఎవరు ?
సినీ ఇండస్ట్రీ లో ఎవరు ప్రజా సేవ చేస్తూన్నరు ?
ఎవరు వ్యాపారం చేస్తున్నారు ?
ఒక సినిమా ప్రదర్శన వలన దియేటర్ కి లాస్ వస్తే కౌన్సిల్ గాని, ఛాంబర్ ఆ లాస్ ని తిరిగి ఇస్తారా ?
బహు బలి, కె జి యఫ్, బ్రహ్మస్ట్రా, కాంతర తరవాత కూడా ఇంకా పర భాషా సినిమాలు మన సినిమాలు అని సినిమా ని వేరు చేయ గలమా ?
-ప్రగడ.