Hot Star Unveils Mangalavaaram wall poster in Hyderabad: నెక్లస్ రోడ్ లో “మంగళవారం” వాల్ పెయింటింగ్ ఆవిష్కరించిన హాట్ స్టార్ !

IMG 20240105 WA0035 e1704458859947

 

పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన “మంగళవారం” సినిమా గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం సినిమాను రూపొందించారు.

నందిత శ్వేత, దివ్య పిల్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ గా రన్ అయిన “మంగళవారం” సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో గత నెల 26వ తేదీ నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

IMG 20240105 WA0036

బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన “మంగళవారం” సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లోనూ అద్భుతమైన ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నెక్లస్ రోడ్ లో ఈ సినిమా స్పెషల్ వాల్ పెయింటింగ్ ఏర్పాటు చేయించింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ప్రముఖ ఆర్టిస్ట్ లక్ష్మీ నారాయణ ఈ పెయింటింగ్ ను డిజైన్ చేశారు.

 

“మంగళవారం” సినిమా వాల్ పెయింటింగ్ హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంటోంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆహ్వానం పలుకుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *