ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అయిన ‘హోం టౌన్’ వెబ్ సిరీస్!

IMG 20250302 WA02341 e1740925270702

ఆహా సబ్ స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు.

ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

హోం టౌన్ వెబ్ సిరీస్ లో ప్రసాద్ పాత్రలో రాజీవ్ కనకాల తన పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. ఈ వెబ్ సిరీస్ ను నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు.

ఈ సిరీస్ కు సినిమాటోగ్రాఫర్ గా దేవ్ దీప్ గాంధీ కుండు పనిచేయగా..సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు.

హోం టౌన్ వెబ్ సిరీస్ కథా కథనాలను ప్రతి ప్రేక్షకుడు రిలేట్ చేసుకునేలా ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *