#90’s దర్శకుడి “లిటిల్ హార్ట్స్” సినిమా రిలీజ్ ఎప్పుడంటే!

IMG 20250802 WA0236 e1754137863912

“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు.

90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.

ఈ రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. “లిటిల్ హార్ట్స్” చిత్రాన్ని సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన ప్రోమోలో తండ్రీ కొడుకులుగా మౌళి తనూజ్, రాజీవ్ కనకాల నటించిన సరదా సన్నివేశం ఆకట్టుకుంటోంది.

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో రూపొందించిన ఈ సినిమా కంటెంట్ నచ్చి ప్రముఖ నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి “లిటిల్ హార్ట్స్” చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

నటీనటులు :

మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు

టెక్నికల్ టీమ్!

రచన, దర్శకత్వం – సాయి మార్తండ్,  ప్రొడ్యూసర్ – ఆదిత్య హాసన్, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), మ్యూజిక్ – సింజిత్ యెర్రమల్లి, సినిమాటోగ్రఫీ – సూర్య బాలాజీ, ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి, ఆర్ట్ డైరెక్టర్ – దివ్య పవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – వినోద్ నాగుల, మురళి పున్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *