Dhanaraaj, Sunil New Movie Opens Today: , సునీల్ ప్రధాన పాత్రలలో రోరింగ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ “బుజ్జి ఇలా రా2 ఓపెనింగ్!

IMG 20231027 WA0086 e1698413944406

ధనరాజ్ ప్రధాన పాత్రలో..”కాసిమ్” గారి నిర్మాణ సారథ్యం లో “మై సినిమా టాకీస్” బ్యానర్ పై రోరింగ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ “బుజ్జి ఇలా రా 2” అనే సినిమా భారీగా ప్రారంభం అయ్యింది..ఈ చిత్రం 2022 లో రిలీజ్ అయిన “బుజ్జి ఇలా రా” అనే హిట్ సినిమాకి సీక్వెల్ గా రూపుదిద్దుబడుతుంది..

బుజ్జి ఇలా రా సినిమా కి దర్శకత్వం మరియు ఛాయ గ్రహణం వహించిన “గరుడవేగ” అంజి నే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు..

IMG 20231027 WA0090

దర్శకత్వం మీద పూర్తి దృష్టి పెట్టాలనే ఉద్దేశం తో ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన “సర్వేశ్ మురారి” గారు సినిమాటోగ్రఫీ వహిస్తున్నారని డైరెక్టర్”గరుడవేగ” అంజి గారు తెలిపారు..ఈ సినిమాకి పాటలు మరియు బ్యాక్గ్రాండ్ స్కోర్ “చరణ్ అర్జున్” సమకూర్చగా..

ఎడిటింగ్ “చోటా. కె.ప్రసాద్” గారు చెయ్యనున్నారు..ఈ సినిమా “నో లిమిట్స్” అనే ట్యాగ్ లైన్ తో రూపుదిద్దుకోబోతుంది..ఈ సినిమా లోథ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోపాటు తండ్రి కూతుర్ల ఎమోషన్ కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుందని చిత్ర బృందం పేర్కుంది..

IMG 20231027 WA0087

 

ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూఈ సినిమా లోగో నీ ఓంకార్ గారు మరియు కెమెరామెన్ సెంథిల్ కుమార్ గారు ఆవిష్కరించారు, ఈ సినిమా కి క్లాప్ ని సాయి రాజేష్ గారు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ విజయ్ కనక మేడలా , కెమెరా స్విచ్ ఆన్ సి. కళ్యాణ్ గారు చేశారు, తెలుగు సినిమా స్క్రిప్ట్ ని కోన వెంకట్ గారు , తమిళ సినిమా స్క్రిప్ట్ ని దామోదర్ ప్రసాద్ గారు దర్శక నిర్మాతలకు అందచేసారు.

 బుజ్జి ఇలా రా 2 మూవీ ఓపెనింగ్ కి విచ్చేసిన  అందరూ అతిధులు కలిసి తెలుగు, తమిళ సినిమా లా రెండు మోషన్ పోస్టర్ లను లంచ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *