పందిరిమంచం’ చిత్రంలో సిద్ శ్రీరామ్ పాడిన కోవెలలో లిరికల్ సాంగ్ లాంచ్ చేసిన గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా

mohan raja pandiri mancham e1676272836269

 

మ్యాపిల్ లీఫ్స్ బ్యానర్ పై ఈవీ గణేష్ బాబు నిర్మించి, దర్శకత్వం వహించి కథానాయకుడిగా నటించిన చిత్రం కట్టిల్. సృష్టి డాంగే కథా నాయికగా నటించింది. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రదర్శించబడి అవార్డ్స్, రివార్డ్స్ తోపాటు ప్రశంసలందుకున్నఈ చిత్రం ‘పందిరిమంచం’ పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది.

తాజాగా ఈ చిత్రంలో ఫస్ట్ సింగిల్ కోవెలలో లిరికల్ సాంగ్ ని గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా లాంచ్ చేశారు. పుష్ప సినిమా తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో సిద్ శ్రీరామ్ పాడిన పాట ఇది. తన వాయిస్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు సిద్ శ్రీరాం. శ్రీకాంత్ దేవా సంగీతం సమకూర్చిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించారు.

తరతరాలుగా ఒకే ఇంట్లో ఉన్న పందిరిమంచం కథ ఇది. ఒక వంశంలోని మూడు తరాల పరంపర గురించి అందర్నీ ఆకట్టుకునేలా ప్రజంట్ చేశారు. మాస్టర్ నితీష్, గీతకైలసం, సంపత్ రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి ఎడిటర్ బి లెనిన్ కథ, కథనం అందించగా, కె ఎన్ విజయకుమార్ మాటలు రాశారు.

pandiri mancham సిద్ సాంగ్

తారాగణం: ఈవీ గణేష్ బాబు, సృష్టి డాంగే మాస్టర్ నితీష్, గీతకైలసం, సంపత్ రామ్ తదితరులు

టెక్నికల్ టీం:

నిర్మాణం, దర్శకత్వం : ఈవీ గణేష్ బాబు
బ్యానర్ : మ్యాపిల్ లీఫ్స్
కథ, కథనం: బి లెనిన్
మాటలు: కె ఎన్ విజయకుమార్
సంగీతం: శ్రీకాంత్ దేవా
పీఆర్వో : వంశీ-శేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *