Bichagadu2 Telugu Review: మాస్ ఎలిమెంట్స్ తో ఫీల్ గుడ్ సినిమా గా వచ్చిన బిచ్చగాడు 2

BICHAGAADU2 review e1684519586476

మూవీ: బిచ్చగాడు2 (Bichagadu2): 

విడుదల తేదీ : మే 19, 2023

నటీనటులు: విజయ్ ఆంటోని, కావ్య థాపర్, యోగి బాబు, రాధా రవి, వైజి మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పెరడి, జాన్ విజయ్ మరియు దేవ్ గిల్

దర్శకులు : విజయ్ ఆంటోని

నిర్మాతలు: ఫాతిమా విజయ్ ఆంటోని

సంగీత దర్శకులు: విజయ్ ఆంటోని

సినిమాటోగ్రఫీ: ఓం నారాయణ్

ఎడిటర్: విజయ్ ఆంటోని

BICHAGAADU2 review 14

బిచ్చగాడు2 రివ్యూ (Bichagadu2 Review):

టాలెంటెడ్ నటుడు కధకుడు, మ్యూజిక్ డైరెక్టర్వి, ఎడిటర్ అయిన విజయ్ ఆంటోని ప్రదాన పాత్ర లో నటిస్తూ దర్శకత్వం వహించిన   సినిమా బిచ్చగాడు 2.

మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకోగలిగిందో మా 18f మూవీస్ టీం సమీక్షలోకి వెళ్లి చదివి  తెలుసుకుందా మా!

BICHAGAADU2 review 4

కధ ను పరిశీలిస్తే (story line):

సత్య (విజయ్ ఆంటోనీ) ఒక బిచ్చగాడు. చిన్నప్పుడు తప్పిపోయిన తన చెల్లిని వెతుక్కుంటూ ఉంటాడు. మరోవైపు లక్ష కోట్లకు వారసుడైన అపర కోటీశ్వరుడు విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ) పై అతని మనుషులే మర్డర్ ప్లాన్ చేస్తారు.

ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో విజయ్ గురుమూర్తి ప్లేస్ లోకి సత్య వస్తాడు.

బిచ్చగాడు అయిన సత్య అపర కోటీశ్వరుడిగా ప్రజలకు ఏం చేశాడు?,

ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?,

చివరకు సత్య  తన చెల్లిని కలుసుకున్నాడా? లేదా ?

విజయ్ ప్లేస్ లోకి సత్య ఎందుకు వస్తాడు ?

విజయ్ మంచివాడా ? చెడ్డవాడా ?

అనేది మిగిలిన కథ.

bicchagadu2 pre release event 4 Copy 1

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):

సత్య పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు విజయ్ ఆంటోనీ అంతే స్థాయిలో ట్రీట్మెంట్ నుకధనం (స్క్రీన్ ప్లే)  రాసుకోలేదు. అలాగే విజయ్ గురమూర్తి ఆస్తులతో సత్య ప్రజా సేవ చేశాడని సరిపెట్టడం ఎఫెక్టివ్ గా అనిపించదు.

అలాగే బ్రెయిన్ సర్జరీ ట్రాక్ కూడా లాజికల్ కరెక్ట్ గా అనిపించదు.  తాను రాసుకున్న కథను తెర పై చాలా క్లారిటీగా చాలా కలర్ ఫుల్ గా మేకింగ్ చేసిన విజయ్ ఆంటోనీ, ప్లేను మాత్రం చాలా స్లోగా నడిపాడు.

అలాగే సినిమాలో చాలా భాగం ఎమోషనల్ గా అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడిపినా.. కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగాయి. దాంతో ఈ చిత్రం పూర్తి స్థాయిలో  అందరు ప్రేక్షకులను మెప్పించక పోవచ్చు.

BICHAGAADU2 review 5

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

దర్శకుడిగా కూడా విజయ్ ఆంటోని తీసుకున్న స్టోరీ లైన్, ఆయన రాసుకున్న కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ స్ బాగున్నాయి. ఇక చివర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సినిమాను ముగించడం కూడా బాగా ఆకట్టుకుంది.

విజయ్ ఆంటోని.. వన్ మ్యాన్ షోగా నడిచిన ఈ సినిమాలో.. పాత్ర పరిస్థితులకు తగ్గట్టు రెండు గెటప్స్ లో చక్కగా నటించి విజయ్ ఆంటోని మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో విజయ్ ఆంటోని చాలా బాగా నటించాడు.

BICHAGAADU2 review 8

హీరోయిన్ గా నటించిన కావ్య థాపర్ తన హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ మరియు తన గ్లామర్ తోనూ ఆకట్టుకుంది.

యోగి బాబు, రాధా రవి, వైజి మహేంద్రన్ తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పెరడి, జాన్ విజయ్ మరియు దేవ్ గిల్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

BICHAGAADU2 review 3

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

విజయ్ ఆంటోని అందించిన మ్యూజిక్ ఎడిటింగ్ ఆకట్టుకొన్నాయి. ఓవరాల్ గా సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగుంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా నేపధ్య సంగీతం చాలా బాగుంది.

ఓం నారాయణ్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

 నిర్మాతగా ఫాతిమా విజయ్ ఆంటోని పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

BICHAGAADU2 review 15

18F మూవీస్ టీం ఒపీనియన్:

విజయ్ ఆంటోని నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా బిచ్చగాడు 2.  ఈ సినిమా ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామా తో పాటు  మెయిన్ కంటెంట్, యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకున్నాయి.

కధనం ( స్క్రీన్ ప్లే) లో కొన్ని చోట్ల  స్లో నెరేషన్, కొన్ని సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం, రెండవ అంకం ( సెకండ్ హాఫ్) టెంపో తగ్గడం వంటి అంశాలు సినిమాకి కొంచెం మైనస్ అయ్యాయి.

మొత్తమ్మీద ఈ చిత్రంలో కొన్ని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ మెప్పిస్తాయి. ఈ వరం దియేటర్ కి వెళ్ళి చూడవలసిన సినిమా ఈ బిచ్చగాడు2 సినిమా.

BICHAGAADU2 review 10

టాగ్ లైన్: మాస్ ని కట్టిపడేసే ఫీల్ ఉన్న సినిమా!

18F Movies రేటింగ్: 3 / 5 

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *