టైటిల్ :- భళారే సిత్రం
విడుదల తేదీ:- 08-08-2025
తారాగణం:- శివ, కృష్ణ, దివ్య డిచోల్కర్, మౌనిక..,
డి ఓ పి: సతీష్
నిర్మాతలు :- శ్రీనివాసరావు సవరం, సుబ్బారావు,
దర్శకుడు: తుమ్మా లక్ష్మారెడ్డి,
బ్యానర్:- శ్రీ లక్ష్మి క్రియేషన్స్,
విడుదల: SKML మోషన్ పిక్చర్,
1. పరిచయం :
కొన్నిసార్లు అనుకోని సంబంధాలు, పరిణామాలు మన జీవితాలను తారుమారు చేస్తాయి. అలాంటి కథను శ్రీ లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు సవరం, సుబ్బారావు నిర్మాణంలో, దర్శకుడు తుమ్మా లక్ష్మారెడ్డి తెరకెక్కించిన చిత్రం ”భళారే సిత్రం”.
శివ, కృష్ణ, దివ్య డిచోల్కర్, మౌనిక ప్రధాన పాత్రల్లో రెండు కొత్త జంటల మధ్య జరిగే సంఘర్షణను హాస్యం, భావోద్వేగాలతో మిళితం చేశారు. తాజాగా థియేటర్‌లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో మా 18F మూవీస్ మీడియా టీం రివ్యూ చదివి తెలుసుకుందామా!
2. కథ – కథనం:
శివ (శివ రాజ్‌పుత్) – సీత ఒక జంట. పాండు (Panddu Chelimi) – దివ్య (Divya Dicholkar) మరొక జంట. రెండు వేర్వేరు ప్రదేశాల్లో కొత్తగా పెళ్లైన ఈ జంటల జీవితాలు సవ్యంగా సాగుతుండగా, అకస్మాత్తుగా పాత సంబంధం వెలుగులోకి వస్తుంది.
ఒకరి భార్య మరొకరికి ఎలా పరిచయం?
ఈ నిజం బయటపడిన తర్వాత రెండు జంటల మధ్య అనుమానాలు, సంఘర్షణలు ముదురుతాయి. చివరికి ఈ సమస్య ఎక్కడి వరకు దారి తీసిందనేది తెలుసుకోవాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
3. నటీ నటుల ప్రతిభ:
శివ – తన పాత్రకు తగ్గ కూల్ లుక్, నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు.
దివ్య దిచోల్కర్ – భావోద్వేగ సన్నివేశాల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
పాండు చెలిమి – హాస్య టైమింగ్, సహజమైన డైలాగ్ డెలివరీతో ఎంటర్‌టైన్ పంచాడు.
కృష్ణ – మౌన పాత్రలో బాడీ లాంగ్వేజ్, ఎక్సప్రెషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు.
కౌసురి మౌనిక – నాచురల్‌గా తన పాత్రకు తగిన గంభీరతను చూపించింది.
4. సాంకేతిక నిపుణులు ప్రతిభ:
దర్శకుడు లక్ష్మా రెడ్డి తుమ్మ – సింపుల్ లైన్‌ను సరదా మలుపులతో నడిపిస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా మలిచారు.
మ్యూజిక్ డైరెక్టర్ సమీ కట్టుపల్లి – పాటలు సగటు స్థాయిలో ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగ సన్నివేశాల్లో బాగుంది.
డివోపీ సతీష్ – రెండు జంటల జీవితాన్ని, వారి భావోద్వేగాలను విజువల్స్‌లో బాగా చూపించారు.
ఎడిటింగ్ (శ్రీనివాసరావు) – ఫస్ట్ హాఫ్ క్రిస్ప్‌గా ఉంది, సెకండ్ హాఫ్ పరవాలేదు.
5. 18F మూవీస్ టీం ఒపీనియన్:
విలేజ్‌లో ఉండి చదువులేని వారికైనా, నగరంలో ఉన్నత చదువు చదివినా కూడా మ్యారేజ్ లైఫ్ ఒకేలా మారుతున్న విషయాన్ని ఈ సినిమా చక్కగా చూపించారు డైరెక్టర్ లక్ష్మారెడ్డి తుమ్మ. తాను అనుకున్న కథను తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
ఈ తరం జంటల మధ్య ఎదురయ్యే సంఘర్షణలను స్పష్టంగా చూపించారు. రెండు జంటల మధ్య వచ్చే డ్రామా, మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అప్పుడప్పుడూ నవ్విస్తాయి. నటీనటుల నేచురల్ పర్ఫార్మెన్స్, హాస్యం, ఎమోషనల్ సన్నివేశాలన్నీ సినిమాను నిలబెట్టాయి.
భళారే సిత్రం ఒక సింపుల్ కానీ ఎంగేజింగ్ ఫ్యామిలీ డ్రామా. రెండు కొత్త జంటల మధ్య జరిగే సంఘర్షణ, పాత సంబంధాల రహస్యాలు, భావోద్వేగ పరిణామాలు ప్రేక్షకులను బంధిస్తాయి.
ఈ తరం యువత, ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగిన సినిమా.
18F రేటింగ్: 2.75 / 5
* కృష్ణ ప్రగడ.