తెలుగు దనం నిండిన ఆహా ఓ టి టి లో అత్యంత ప్రజాదరణ పొందిన బాలయ్య టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 లోకి డార్లింగ్ ప్రభాస్ వస్తున్నాడు అని ప్రకటించినప్పటి నుండి, పాన్ ఇండియన్ స్టార్ నటుడి యొక్క లేటెస్ట్ లుక్ మరియు ఆయన పర్సనల్ విశయాలు వినవచ్చు అభిమానులు ఎంత గానో ఎదురుచూస్తూన్నరు.
డార్లింగ్ డై హార్డ్ ఫాన్స్ అభ్యర్థన మేరకు, ఆహా షో నుండి కొన్ని స్టిల్స్‌ను వెల్లడించింది, మాంచి హెయిర్ స్టైల్ తో ఫుల్ గడ్డంతో ప్రభాస్ కూల్ గా సూపర్ స్మార్ట్ గా కనిపించాడు. ఈ డార్లింగ్, గోపీచంద్ ఎపిసోడ్ నిన్ననే షూటింగ్ పూర్తి చేసుకోంది.
మాకు అందిన సమాచారం ప్రకారం బాలయ్య బాబు ఓక లెవెల్ లో డార్లింగ్ ని, గోపీచంద్ ని అడుకొన్నట్టు తెలుస్తుంది. నువ్వు అందరినీ డార్లింగ్.. డార్లింగ్ అంటావాట కదా !, మరి రేపు కానీ పెళ్లి అయితే మీ ఆవిడను ఏమని పిలుస్తావు అంటూ ప్రభాస్ ని అడిగారంట బాలయ్య బాబు.
ఈ ప్రశ్నకు సమాధానంగా డార్లింగ్ ప్రభాస్ ఏమి చెప్పారో ప్రోమోలో చూద్దామా !
అభిమానులు ప్రభాస్ లుక్స్‌తో చాలా సంతోషం గా ఉన్నారు. ఇప్పటికైనా ఎనర్జిటిక్ బాలయ్య మరియు ఎవర్ లవ్లీ ప్రభాస్ కలిసి కనిపించే ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.